Today rashi phalalu – 24 ఫిబ్రవరి 2023, శుక్రవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
కార్యక్రమాలు కొన్ని సాఫీగా సాగుతాయి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొని ఉత్సాహంగా గడుపుతారు. స్థలాలు, వాహనాలు కొంటారు. రాబడి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చిక్కులు వీడతాయి. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారుల ఆశలు నెరవేరతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు భూలాభాలు. అనుకూల రంగులు……. పసుపు, ఎరుపు. ప్రతికూల రంగు…నేరేడు. శ్రీ రామ స్తోత్రం పఠించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కార్యక్రమాలలో అవాంతరాలు. ఆదాయం కొంత తగ్గుతుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు శ్రమ పెరుగుతుందే తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కొన్ని అంచనాలలో విఫలమవుతారు. విద్యార్థులు ఓపిక, సహనంతో మెలగాలి. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు…నలుపు. హయగ్రీవ స్తోత్రాలు పఠిచండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధుల్లో వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు తొలగి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థుల యత్నాలు కొలిక్కి వస్తాయి. మహిళలకు ఆస్తిలాభం. అనుకూల రంగులు……. గులాబీ, కాఫీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. రాబడి విషయంలో నిరుత్సాహం. స్నేహితులు కొందర్ని కలుసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సంస్థల నిర్వహణలో ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త విధులు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు సమస్యల నుం నుండి బయటపడతారు. విద్యార్థులకు శుభవర్తమానాలు. మహిళలకు సోదరుల ద్వారా ధనలబ్ధి. అనుకూల రంగులు……. తెలుపు, బంగారు. ప్రతికూల రంగు…కాఫీ. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
స్నేహితులతో విరోధాలు. ఆదాయానికి మించి ఖర్చులు. కొన్ని కార్యక్రమాలను కష్టసాధ్యమై వాయిదా వేయాల్సిన పరిస్థితి. దూర ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు తొందరపాటు వద్దు. ఉద్యోగస్తులకు విధుల్లో ప్రతిబంధకాలు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు చిక్కులు. విద్యార్థుల కృషి విఫలమవుతుంది. మహిళలకు చికాకులు పెరుగుతాయి. అనుకూల రంగులు……. ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు…తెలుపు. గణపతికి అర్చన చేయించుకోండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది. వ్యతిరేకుల ద్వారా సమస్యలు రావచ్చు. అనారోగ్య సూచనలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తప్పవు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు నిరుత్సాహం చెందుతారు. విద్యార్థులు శ్రమకు ఫలితం అందదు. మహిళలకు కుటుంబంలో మాటపట్టింపులు. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, పసుపు. ప్రతికూలరంగు…గులాబీ. వేంకటేశ్వరస్వామిని పూజించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
స్నేహితులను కలుసుకుని మీ అభిప్రాయాలు పంచుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు. ఆదాయపరంగా నెలకొన్న స్తబ్ధత తొలగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలు రాగలవు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం రావచ్చు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు సమస్యల నుండి బయటపడతారు. విద్యార్థులు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు శుభవార్తలు. అనుకూల రంగులు…. నలుపు, పసుపు. ప్రతికూల రంగు…గులాబీ. లలితాసహస్రనామ పారాయణ చేయండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఆకస్మిక ధన లాభం. అప్రయత్న కార్యసిద్ధి. విలువైన సమాచారం అందుకుంటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు అనూహ్యంగా దక్కుతాయి. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తి విషయంలో చికాకులు తొలగుతాయి.. వ్యాపార, వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పనిభారం తొలగుతుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు స్వీయ నిర్ణయాలు ఉపకరిస్తాయి. మహిళలకు భూలాభం. అనుకూల రంగులు….. గులాబీ, లేత ఆకుపచ్చ. ప్రతికూల రంగు…గోధుమ రంగు. లలితాసహస్రనామ పారాయణ చేయండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. స్నేహితులు, బంధువర్గంతో విరోధాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆలోచనలు అనేక విధాలుగా ఉండవచ్చు. కార్యక్రమాలు కొంత శ్రమానంతరం పూర్తి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీల పై కొంత శ్రద్ధ వహించాలి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు. క్రీడాకారులు, వైద్యులకు సమస్యలు. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు….. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు…చాక్లెట్. హనుమాన్ఛాలీసా పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
ఆదాయం కంటే ఖర్చులు అధికం. కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబసభ్యుల నుంచి వివాదాలు. ఆరోగ్యసమస్యలు వేధిస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు వ్యవహారాలు సాదాసీదాగా నడుస్తాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు విదేశీ పర్యటనలలో వాయిదా వేస్తారు. విద్యార్థులకు కృషి చేసినా ఆశించిన ఫలితం అందుకోలేరు. మహిళలు కుటుంబ విషయాల పై మరింత శ్రద్ధ చూపాలి. అనుకూల రంగులు….. నీలం, తెలుపు. ప్రతికూల రంగు…ఎరుపు. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
బంధువులను కలుసుకుంటారు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఒక స్థాయికి వస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థ యాత్రలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కీలక సమాచారం. ఉద్యోగులకు పని ఒత్తిడులు చాలావరకూ తగ్గుతాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు కొత్త అవకాశాలు. విద్యార్థులు సంతోషకరమైన ఫలితాలు పొందుతారు. మహిళలకు కుటుంబంలో విభేదాలు తొలగుతాయి. అనుకూల రంగులు….. తెలుపు, ఎరుపు. ప్రతికూల రంగు…నీలం. పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక లావాదేవీలపై కొంత నిరాశ. దూర ప్రయాణాలు. శత్రువులు పెరుగుతారు. సోదరులు, మిత్రులతో కలహాలు. కాంట్రాక్టర్లకు గందరగోళం. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొద్దిపాటి లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులకు ఒత్తిడులు, సమస్యలు. మహిళలకు నిరాశాజనకం. అనుకూల రంగులు….. గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు…పసుపు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com