Today rashi phalalu – 25 ఫిబ్రవరి 2023, శనివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
నూతన ఉద్యోగ యోగం. కుటుంబంలో శుభకార్యాలు. సన్నిహితుల సాయంతో పనులు పూర్తి. భార్యాభర్తల మధ్య ఎడబాటు తొలగుతుంది. రాబడి కొంత మెరుగుపడుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు అన్నింటా ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు సరైన గుర్తింపు లభిస్తుంది. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి ఒత్తిడులు తొలగుతాయి. విద్యార్థులకు అంచనాలు నిజం కాగలవు. మహిళలకు అశాంతి తొలగుతుంది. అనుకూలం…ఎరుపు, పసుపు.ప్రతికూలం…తెలుపు. గాయత్రీ ధ్యానం చేయండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఆకస్మిక ప్రయాణాలు. వ్యయప్రయాసలు. రాబడికి మించి ఖర్చులు. నిర్ణయాలలో కొంత నిదానం పాటించండి. ఆరోగ్య సమస్యలతో కొంత ఇబ్బందిపడతారు. సన్నిహితులు, బంధువులతో విరోధాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు సమస్యలు పెరుగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు చిక్కులు ఎదుర్కొంటారు. ఉద్యోగాల్లో విధుల్లో ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు మానసిక ఆందోళన. విద్యార్థులు కొత్త సమస్యలు ఎదురుకావచ్చు. మహిళలకు సోదరులతో వివాదాలు. అనుకూలం… తెలుపు, కాఫీ.ప్రతికూలం… గులాబీ. శివపంచాక్షరి పఠించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
శుభవర్తమానాలు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆదాయ వనరులు మరింత పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలను విస్తరిస్తారు. ఉద్యోగాల్లో మీ సమర్థతకు ప్రోత్సాహం లభిస్తుంది. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు కొత్త ఆశలు. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు ఆస్తిలాభం. అనుకూలం… గులాబీ, నేరేడు.ప్రతికూలం…ఆకుపచ్చ. శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
కార్యక్రమాలు జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు. ఆలోచనలు వెనువెంటనే అమలు చేస్తారు. రాబడి కాస్త పెరుగుతుంది. ఉద్యోగుల్లో పట్టుదల, ఓర్పు పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థలను ముందుకు తీసుకెళతారు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులు ఆహ్వనాలు అంది ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థుల యత్నాలు సఫలం. మహిళలకు గౌరవం పెరుగుతుంది. అనుకూలం… ఆకుపచ్చ, తెలుపు.ప్రతికూలం…నీలం. గణేశాష్టకం పఠించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. కార్యక్రమాలలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి బంధువులతో విభేదాలు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తల యత్నాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు సమస్యలు తప్పకపోవచ్చు. వైద్యులు, క్రీడాకారులకు వివాదాలు రావచ్చు. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు గందరగోళంగా ఉంటుంది. అనుకూలం… తెలుపు, గులాబీ.ప్రతికూలం…పసుపు. అంగారక స్తోత్రాలు పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. అవసరాలు మరింత పెరిగి రుణాలు చేయాల్సివస్తుంది. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. దూరప్రయాణాలతో కొంత ఇబ్బందిపడతారు. కాంట్రాక్టర్లకు చిక్కులు తప్పవు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొన్ని ఆటుపోట్లు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయ, పారిశ్రామివేత్తలకు నిరాశ తప్పదు. విద్యార్థులు కొంత ఓర్పుతో వ్యవహరించడం మంచిది. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూలం… గోధుమ, నీలం.ప్రతికూలం…చాక్లెట్. ఆంజనేయ దండకం పఠించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
పలుకుబడి పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆస్థి విషయాల్లో అగ్రిమెంట్లు. ఆదాయం ఆశించినస్థాయిలో ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు పెట్టుబడులు మరింత పెంచుతారు. ఉద్యోగులకు వివాదాలు సమసిపోతాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు ఆసక్తికర సమాచారం. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు ఊహించని గౌరవం పెరుగుతుంది. అనుకూలం… ఎరుపు, గులాబీ.ప్రతికూలం…కాఫీ. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. వ్యతిరేకుల నుంచి సైతం మాట సాయం అందుతుంది. వాహనాలు, నగలు కొంటారు. చిరకాల కోరిక నెరవేరుతుంది. పరిస్థితులను చక్కదిద్దుకుని ముందడుగు వేస్తారు. కార్యక్రమాలు సమయానుసారం పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు వివాదాలు తీరతాయి. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు శ్రమ ఫలిస్తుంది. విద్యార్థుల కృషి కొంత ఫలిస్తుంది. మహిళల ఆత్మవిశ్వాసం పెరిగి కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. అనుకూలం… గోధుమ, ఆకుపచ్చ.ప్రతికూలం…నీలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
వ్యతిరేకుల ద్వారా ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలపై కొంత నిరాశ చెందుతారు. కుటుంబసభ్యులతో విరోధాలు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు చిక్కులు తప్పవు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మరిన్ని చిక్కులు. ఉద్యోగులకు విధుల్లో కొంత ఆందోళన తప్పదు రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఎంత ప్రయత్నించినా వ్యవహారాలు ముందుకు సాగవు. విద్యార్థులకు కొంత ఇబ్బంది తప్పదు. మహిళలకు కుటుంబంలో చికాకులు.. అనుకూలం… ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూలం…తెలుపు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలలో ప్రతిబంధకాలు తప్పవు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులతో లేనిపోని వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు చిక్కుల్లో పడే సూచనలు. ఉద్యోగులు మరింత శ్రమ పడాలి. క్రీడాకారులు, వైద్యులపై మరింత భారం పడవచ్చు.. విద్యార్థులకు అవకాశాలపై నిరాసక్తత. మహిళలకు అంచనాలు తప్పుతాయి. అనుకూలం… నేరేడు, ఆకుపచ్చ.ప్రతికూలం…ఎరుపు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆర్థిక వ్యవహారాలలో అంచనాలు ఫలిస్తాయి. కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. వాహనాలు, నగలుు కొంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల్లో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులలో మరింత భరోసా కలుగుతుంది. మహిళలకు కీలక సమాచారం. అనుకూలం…నీలం, నేరేడు. ప్రతికూలం…కాఫీ. నృసింహస్తోత్రాలు పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని ఖర్చులు చేయడం మంచిది. ఏ కార్యక్రమమైనా కొంత జాప్యం తప్పదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. సోదరులతో తగాదాలు. ఒక సమాచారంతో డీలాపడతారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్ల శ్రమ వృథా కాగలదు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లేనిపోని చిక్కులు. ఉద్యోగాల్లో ఒత్తిడులు, పనిభారం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి శ్రమ ఫలించదు. విద్యార్థులకు సామాన్యంగా గడుస్తుంది. మహిళలకు అన్నింటికీ కొంత ఆందోళన చెందుతారు. అనుకూలం…గులాబీ, పసుపు. ప్రతికూలం…కాఫీ. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com