Today rashi phalalu – 26 ఫిబ్రవరి 2023, ఆదివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
రాబడి ఆశాజనకం, రుణబాధలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. నూతన వస్తు, వస్త్ర లాభాలు. వ్యాపారాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్లు. పారిశ్రామికవర్గాలకు నూతన అవకాశాలు. కళాకారులకు కొత్త ఆశలు. విద్యార్థులకు కోరుకున్న కోర్సులు అందుతాయి. మహిళలకు శుభ వర్తమానాలు. అనుకూల రంగులు……. గులాబీ, కాఫీ ప్రతికూల రంగు…ఎరుపు గణపతికి అభిషేకం చేయించుకోండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కుటుంబంలో చికాకులు. మానసిక ఆందోళన. భూములు, గృహం కొనుగోలు యత్నాలు వాయిదా. పనులలో ఆటంకాలు. ఆరోగ్యభంగం, ఔ«షధసేవనం. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారులకు లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు స్థానచలనం. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. కళాకారులకు అవకాశాలు తగ్గుతాయి. విద్యార్థులు మరింత శ్రద్ద చూపాలి. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు……. పసుపు, లేత ఎరుపు. ప్రతికూల రంగు.. ఆకుపచ్చ ఆదిత్య హృదయం పఠించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటాబయటా అనుకూలత. సన్నిహితులతో వివాదాలు తీరి సఖ్యత. భూవివాదాలు తీరి ఒడ్డున పడతారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి ఆహ్వానాలు రాగలవు. కళాకారులకు వివాదాలు తీరతాయి. విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మహిళలకు ఆస్తి లాభాలు. అనుకూల రంగులు… పసుపు, గులాబీ. ప్రతికూల రంగు… కాఫీ, విష్ణు సహస్రనామాలు పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు కొత్తగా ప్రారంబిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు దక్కించుకుంటారు. పారిశ్రామిక, సాంకేతికరంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు ఆహ్వానాలు. విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు… లేత పచ్చ, కాఫీ. ప్రతికూల రంగు… బంగారు, నరసింహ స్తోత్రాలు పఠిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించవచ్చు. కొన్ని పనులు ఎట్టకేలకు నెట్టుకొస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. మిత్రులతో విరోధాలు. వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి ఒడిదుడుకులు. కళాకారులకు కొంత నిరాశ. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినివ్వవు. మహిళలకు చికాకులు. అనుకూల రంగులు… ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు… గులాబీ, దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
కార్యక్రమాలు ఆకస్మికంగా విరమిస్తారు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. భూవివాదాలు నెలకొంటాయి. మిత్రులతో అకారణ వైరం. వ్యాపారాలలో స్వలμ లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లలో జాప్యం. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. కళాకారులకు ఇబ్బందులు. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం రాక నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబసమస్యలు. అనుకూల రంగులు… నీలం, తెలుపు. ప్రతికూల రంగు… కాఫీ, శివ స్తోత్రాలు పఠించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
నూతన విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి పట్టింది బంగారమే. కళాకారులకు ఊహించని అవకాశాలు. విద్యార్థులకు శుభవర్తమానాలు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. అనుకూల రంగులు… నలుపు, కాఫీ. ప్రతికూల రంగు… ఆకుపచ్చ దత్తాత్రేయుని పూజించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
పనుల్లో విజయం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కే అవకాశం. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహంగా ఉంటుంది. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. మహిళలకు కుటుంబంలోగౌరం. అనుకూల రంగులు… గులాబీ, ఎరుపు. ప్రతికూల రంగు… కాఫీ, దుర్గాదేవికి కుంకుమార్చనచేయండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
కొత్త రుణ యత్నాలు. మిత్రులే శత్రువులుగా మారతారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు మానసిక అశాంతి. కళాకారులకు గందరగోళ పరిస్థితి. విద్యార్థులకు అసంతృప్తి. మహిళలకు కుటుంబ సమస్యలు. అనుకూల రంగులు… లేత పసుపు, ఎరుపు. ప్రతికూల రంగు… బంగారు, హనుమాన్చాలీసా పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
ఆస్తి వివాదాలు నెలకొంటాయి. మిత్రులు, బంధువులతో విభేదాలు. చర్మ సంబంధిత రుగ్మతలు వేధిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాల్లో పనిభారం. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి పర్యటనలు వాయిదా. కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం కష్టమే. మహిళలకు కుటుంబంలో చికాకులు. షేర్ల విక్రయాలు మందగిస్తాయి. అనుకూల రంగులు… తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు… పసుపు, హనుమాన్కు పూజలు చేయండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. సోదరులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలు, రాబడి సంతృప్తినిస్తుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. లాభాలు తథ్యం. ఉద్యోగాలలో పదోన్నతి సూచనలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులకు అనూహ్య ఫలితాలు. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు… తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు… ఎరుపు విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు ఉంటాయి. బాధ్యతలు అధికమవుతాయి. ఉదర సంబంధిత రుగ్మతలు. వ్యాపారాలలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు ముందుకు సాగవు. కళాకారులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు… బంగారు,, ఆకుపచ్చ. ప్రతికూల రంగు… కాఫీ, కనకధారా స్తోత్రం పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com