Sri Bhagavatam – Parasuram’s father orders him to kill his mother

జమదగ్ని మహర్షి .. రేణుకాదేవి ఆశ్రమ జీవితం గడుపుతూ ఉంటారు. ఆ దంపతులకు ఐదుగురు కుమారులు .. వారిలో చివరివాడు పరశురాముడు. పరశురాముడు తన తపస్సుచే పరమేశ్వరుడిని మెప్పించి “గండ్ర గొడ్డలి”ని ఆయుధంగా పొందుతాడు. ఎప్పుడూ ఆయన పరశువును ధరించి ఉండటం వలన పరశురాముడు అయ్యాడు. జమదగ్ని ఐదుగురు కుమారులు కూడా తమ తల్లిదండ్రులను ఎంతో ప్రేమానురాగాలతో సేవిస్తూ ఉంటారు. వాళ్ల ఆశ్రమంలో “కామధేనువు” ఉంటుంది. దానిని వాళ్లంతా ప్రాణసమానంగా చూసుకుంటూ ఉంటారు.

జమదగ్ని భార్య రేణుకాదేవి మహా పతివ్రత .. తన భర్త పూజా కార్యక్రామాలకి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అనునిత్యం ఆమెనే చేస్తూ ఉంటుంది. ప్రతిరోజూ నదికి వెళ్లి తన పాతివ్రత్య మహిమతో నదీ తీరంలోని ఇసుకతోనే ఒక కుండను తయారు చేసి పూజాభిషేకాలకు అవసరమైన నీటిని పట్టుకుని వస్తూ ఉంటుంది. అలా ఒకసారి ఆమె నదికి వెళుతుంది. అక్కడ ఒక రాజు తన పరివారంతో పాటు వచ్చి ఆ నదిలో స్నానం చేస్తూ ఉండటం చూస్తుంది. ఆ తరువాత ఆమె ఇసుకతో కుండను తయారు చేయడానికి ప్రయత్నిస్తే కుండ తయారు కాదు.

రేణుకాదేవి పవిత్రత దెబ్బ తినడం వలన, ఇసుకతో కుండా ఎంతకూ తయారు కాదు. పూజకి వేళ మించిపోతుండటంతో, జమదగ్ని కోపంతో భార్య రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఆశ్రమంలోకి ఆమె అడుగుపెడుతూ ఉండగానే, ఆలస్యానికి గల కారణం ఏమిటని అడుగుతాడు. ఆయన స్వరంలోని తీవ్రతకి రేణుకాదేవి భయపడిపోతుంది. కారణం ఆమె చెప్పకపోవడంతో, ఆయనే దివ్య దృష్టితో చూస్తాడు. ఆయనకి విషయం అర్థమవుతుంది. రేణుక మనసు చలించిన కారణంగా, ఇకపై తన సేవలకు ఆమె పనికిరాదని చెబుతాడు.

జమదగ్ని వెంటనే తన పెద్ద కుమారుడిని పిలిచి రేణుక తలను ఖండించమని ఆదేశిస్తాడు. ఆ పని తాను చేయలేనని చెప్పేసి అతను వెళ్లిపోతాడు. మిగతా ముగ్గురు కుమారులు కూడా, తమకి జన్మనిచ్చిన తల్లి శిరస్సును ఖండించలేమని సమాధానమిస్తారు. దాంతో జమదగ్ని మహర్షి .. పరశురాముడిని పిలుస్తాడు. వెంటనే అతని తల్లి తలను ఖండించమని ఆజ్ఞాపిస్తాడు. మారుమాట లేకుండా తన చేతిలోని గొడ్డలితో తల్లి తలను ఖండిస్తాడు. అప్పుడు శాంతించిన జమదగ్ని మహర్షి, ఏం కావాలో కోరుకోమని పరశురాముడిని అడుగుతాడు. దాంతో పరశురాముడు తన తల్లిని తిరిగి బ్రతికించమని కోరతాడు. అలా ఆయన తన తల్లిని తిరిగి బ్రతికించుకుంటాడు.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Parasuram’s father orders him to kill his mother