Sri Bhagavatam – Magical Golden Deer .. Lakshman’s Border line

ఆశ్రమంలోని అరుగుపై కూర్చుని పూలను మాలగా కడుతున్న సీతాదేవి, బంగారు రంగు లేడిని చూసి ఆశ్చర్యపోతుంది. అది అటూ ఇటూ గెంతుతూ .. మెరుస్తూ ఉంటే మురిసిపోతుంది. తనకి ఆ లేడి కావాలని రాముడిని అడుగుతుంది. దానిని ఆశ్రమంలో పెంచుకుందామని చెబుతుంది. సీత ముచ్చటపడింది కదా అని రాముడు బయల్దేరతాడు. తాము ఎన్నో రోజులుగా అడవులలో తిరుగుతున్నామనీ , ఎప్పుడూ కూడా ఇలాంటి లేడిని చూడాలేదని లక్ష్మణుడు అంటాడు. ఇది రాక్షసమాయ కావొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు.

ఏదైనా సీత ముచ్చటపడింది కనుక తీసుకురావలసిందేనని రాముడు అంటాడు. సీతను జాగ్రత్తగా చూసుకోమనీ .. ఎలాంటి పరిస్థితుల్లోను ఆమెను ఒంటరిగా వదిలి వెళ్లవద్దని చెప్పి బంగారు లేడి కోసం వెళతాడు రాముడు. బంగారు లేడితో చాలా దూరం వెళ్లిన రాముడు .. ఆ లేడి వేగానికి అడ్డుకట్టవేయడం కోసం బాణం సంధిస్తాడు. దాంతో “హా సీతా .. హా లక్ష్మణా” అని రాముడి గొంతుకతో అరుస్తూ మారీచుడు ప్రాణాలు కోల్పోతాడు. దాంతో రాముడికి ఆపదవాటిల్లిందని సీత అనుకుంటుంది.

రాముడు ఏదో ప్రమాదంలో పడినట్టుగా ఉంది .. వెంటనే వెళ్లి కాపాడమని సీత ఆందోళన వ్యక్తం చేస్తుంది. అదంతా రాక్షస మాయ అనీ, రాముడికి ఏమీ కాదని లక్ష్మణుడు అంటాడు. రాముడి శౌర్యపరాక్రమాలను తాను ప్రత్యక్షంగా చూశాననీ, అందువలన ఆందోళన చెందవద్దని చెబుతాడు. అతని మనసులో ఏదో దురుద్దేశం ఉందనీ, అందువల్లనే ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకుంటున్నాడని అంటుంది. రాముడికి ఏదైనా జరిగితే తాను ప్రాణాలతో ఉండనని చెబుతుంది.

సీత మాటలు లక్ష్మణుడి మనసుకు ఎంతో కష్టం కలిగిస్తాయి. దాంతో ఆయన రాముడి కోసం వెళ్లాలనే నిర్ణయించుకుంటాడు. ఆశ్రమం ఎదురుగా తన చేతిలోని బాణంతో ఒక రేఖ గీస్తాడు. తాను రాముడితో కలిసి తిరిగి వచ్చేంతవరకూ ఆ గీత దాటవద్దని చెబుతాడు. మనసులో ఎలాంటి భయాందోళనలు పెట్టుకోకుండా ఆశ్రమంలోనే ధైర్యంగా ఉండమని చెప్పి బయల్దేరతాడు. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న రావణుడు, జంగమదేవర వేషంలో ఆశ్రమంలోకి అడుగుపెడతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Magical Golden Deer .. Lakshman’s Border line