Sri Bhagavayam – Parasurama’s warning to Kartaviryarjuna
కామధేనువును బలవంతగా తన నగరానికి తీసుకువెళ్లడానికి కార్తవీర్యార్జునుడు సిద్ధపడతాడు. జమదగ్ని మహర్షి ఎన్ని విధాలుగా చెప్పినా ఆయన వినిపించుకోడు. అతిథి మర్యాదలు చేసినివారిని అవమానపరచడం .. ఆకలి తీర్చిన కామధేనువును స్వార్థంతో సొంతం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది కాదని జమదగ్ని అంటాడు. కామధేనువును కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని అడ్డుగా వేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతాడు. అవసరమైతే ఆయన ప్రాణాలు తీసైనా సరే, కామధేనువును తాను తీసుకెళతానని కార్తవీర్యార్జునుడు అంటాడు.
జమదగ్ని పట్ల అహంభావంతో వ్యవహరించి .. కామధేనువును తన వెంట తీసుకెళతాడు. ఆవు కోసం అరుస్తున్న దూడను చూస్తూ జమదగ్ని మహర్షి నిస్సహాయంగా ఉండిపోతాడు. మంచికిపోతే చెడు ఎదురుకావడమంటే ఇదేనని అనుకుంటాడు. భారమైన మనసుతో ఆయన కూర్చుని ఉండగా, అక్కడికి రేణుక వచ్చి ఆయన మనసు కుదుటపడేలా చేస్తుంటుంది. అదే సమయంలో అడవి నుంచి పరశురాముడు వస్తాడు. వస్తూనే తన తల్లిదండ్రులు అదోలా ఉండటం చూసి విషయమేమిటని అడుగుతాడు. దాంతో జరిగినదంతా రేణుకాదేవి వివరంగా చెబుతుంది.
అడవిలో ధర్మబద్ధమైన ఆశ్రమజీవితాన్ని గడుపుతూ, తపస్సులోనే ఎక్కువకాలం గడిపే తన తండ్రి పట్ల కార్తవీర్యార్జునుడు ఆ విధంగా వ్యవహరించడం పరశురాముడికి ఆగ్రహావేశాలను కలిగిస్తుంది. ఏ బాహుబలాన్ని చూసుకుని కార్తవీర్యార్జునుడు అంతటి అహంభావంతో ప్రవర్తించాడో, ఆ బాహువులను తాను తెగ నరుకుతానని చెప్పి పరశురాముడు అక్కడి నుంచి వెళతాడు. కార్తవీర్యార్జునుడు నగరానికి వెళ్లి తాను ఎవరన్నది చెబుతాడు .. ఎందుకు వచ్చిందీ చెబుతాడు. మర్యాదపూర్వకంగా తనకి కామధేనువును అప్పగించమని అంటాడు.
కార్తవీర్యార్జునుడు .. పరశురాముడి మాటలకు నవ్వుతాడు. ఆశ్రమవాసం చేసేవారికి అంతటి ఆవేశం పనికిరాదని చెబుతాడు. ఒక బ్రాహ్మణుడు తన నగరానికి వచ్చి తనని ఎదిరించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అంటాడు. గొడ్డలి వేసుకుని వచ్చేసినంత మాత్రాన తాను భయపడిపోతాననుకుంటే అది అమాయకత్వమే అవుతుందని చెబుతాడు. తన సహస్ర బాహుబలము గురించి తెలియక అతను అలా మాట్లాడుతున్నాడని అంటాడు. తనముందు రావణుడే నిలవలేకపోయాడని చెబుతాడు.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Sri Bhagavayam – Parasurama’s warning to Kartaviryarjuna