రుక్మి మనవరాలైన “రుక్మలోచన”తో శ్రీకృష్ణుడి మనవడైన అనిరుద్ధుడి వివాహం జరుగుతుంది. ఓ రోజున ఆ నూతన దంపతులను ఆశీర్వదించడానికి నారద మహర్షి ద్వారక వస్తాడు. ఆ దంపతులకు తన ఆశీస్సులను అందజేస్తాడు. అనిరుద్ధుడితో మాట్లాడుతూ నారదుడు బాణాసురుడి ప్రస్తావన తీసుకువస్తాడు. బాణాసురిడి…
పురాణాలు
Puranalu – %term% – Ramayanam, Mahabharatham, Sri Bhagavatam, Karthika Puranam and Sthala Puranam mythological stories are written by our dedicated team in an easy-to-understand telugu language which can be read by people of all age groups.
బలిచక్రవర్తి కుమారుడైన “బాణాసురుడు” .. “శోణపురము”ను పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన మహాశివ భక్తుడు .. ప్రతినిత్యం శివపూజ తరువాతనే ఆయన దైనందిన కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి. మహాపరాక్రమవంతుడైన బాణాసురుడు, తన రాజ్యంవైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా ఉండాలనే ఉద్దేశంతో పరమశివుడిని గురించి…
పారిజాత వృక్షాన్ని భూలోకానికి తరలించడానికి ప్రయత్నిస్తున్న శ్రీకృష్ణుడిపై దేవేంద్రుడు మండిపడతాడు. క్షీరసాగర మథనంలో తమకి లభించిన పారిజాత వృక్షాన్ని దొంగచాటుగా తరలించడం భావ్యం కాదని చెబుతాడు. నరకాసురుడి బారి నుంచి దేవలోకాన్ని కాపాడిన కృష్ణుడు, అదే దేవలోకం నుంచి పారిజాత వృక్షాన్ని…
సత్యభామ ముచ్చటపడిన విధంగానే “నందన ఉద్యానవనం”లోని పారిజాత వృక్షాన్ని పెకిలించడానికి కృష్ణుడు సిద్ధపడతాడు. అది చూసిన కాపలాదారులు పరుగు పరుగున అక్కడికి వస్తారు. ఆ పారిజాత వృక్షం “శచీదేవి”కి ప్రాణ సమానమనీ, దానిని పెకిలించే ప్రయత్నాలు మానుకోమని కోరతారు. ఈ విషయం…
సత్యభామకు ఇచ్చిన మాట మేరకు దేవలోకం నుంచి “పారిజాతవృక్షం” తీసుకురావడానికి సత్యభామ సమేతుడై కృష్ణుడు బయల్దేరతాడు. సత్యభామ సమేతంగా కృష్ణుడు తమ లోకానికి రావడం పట్ల దేవేంద్రుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ దంపతులను సాదరంగా ఆహ్వానిస్తాడు. దేవేంద్రుడు ఆ దంపతులను…
నారద మహర్షి తెచ్చిన పారిజాత పుష్పాన్ని రుక్మిణీదేవి సిగలో కృష్ణుడు అలంకరిస్తాడు. దాంతో ఆమె ఆనందంతో పొంగిపోతుంది. తన పట్ల కృష్ణుడి ప్రేమానురాగాలకు మురిసిపోతుంది. భర్త పాదాలకు నమస్కరించుకుని, ఆయన మనసులో తనకి అంతటి స్థానాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతుంది. అలా…
నరకాసురుడు మరణించడంతో లోకులంతా కూడా తేలికగా ఊపిరి పీల్చుకుంటారు. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్న తమకి కృష్ణుడి కారణంగా విముక్తి కలిగినందుకు ఆనందిస్తారు. ఇక తమ జీవితంలో నుంచి కష్టాలు .. భయాలు .. చీకట్లు తొలగిపోయాయని భావించి…
కృష్ణుడికి .. నరకాసురిడికి మధ్య జరుగుతున్న సంభాషణను వింటున్న సత్యభామ సహనం కోల్పోతుంది. నరకాసురుడు అవమానకరంగా మాట్లాడుతుంటే, అంతగా బుజ్జగించవలసిన అవసరం ఏవుందని సత్యభామ అంటుంది. నరకాసురుడు యుద్ధమే కోరుకుంటున్నప్పుడు వారించవలసిన అగత్యం ఏవుందని అడుగుతుంది. ఇప్పటికే నరకాసురుడు ఎక్కువగా మాట్లాడే…
కృష్ణుడు ఎన్నివిధాలుగా చెప్పినా వినిపించుకోకుండా నరకాసురుడు సంగ్రామానికి సిద్ధపడతాడు. తనతో యుద్ధం చేసే సాహసం చేయలేకనే మంచి మాటలతో మాయ చేయడానికి ప్రయత్నిస్తున్నావంటూ అవమానకరంగా మాట్లాడతాడు. కృష్ణుడు ఒంటరిగా కాకుండా సత్యభామను యుద్ధానికి తీసుకురావడం గురించి ఎద్దేవా చేస్తాడు. ఇంతకుముందు అతని…
కృష్ణుడు తనని ఎదిరించడానికి సిద్ధమవుతున్నాడనే విషయం తెలియగానే నరకాసురుడు నవ్వుకుంటాడు. ఒక గోపాలకుడు తనని ఎదిరించడానికి పూనుకోవడమా? తాను ఇంద్రాది దేవతలను ఎదిరించిన విషయం తెలిసి కూడా ముందడుగు వేయడమా? నరకాసురిడితో యుద్ధం అంటే గోపికలతో కలిసి నాట్యం చేయడం కాదనే…
