శ్రీ భాగవతం

202   Articles
202

పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో శ్రీ భాగవతం కథలని చదివి తెలుసుకోండి.

ఉత్తానపాదుడు అంతగా బాధపడుతుండటం చూసిన నారద మహర్షి, ఆయనలో మార్పు వచ్చినందుకు మనసులోనే సంతోష పడతాడు. ధృవుడి గురించి కంగారు పడవలసిన అవసరం లేదనీ, ఆయన క్షేమంగానే ఉన్నాడని నారద మహర్షి చెబుతాడు. ఆ మాట వినగానే ఉత్తానపాదుడి ముఖం ఒక్కసారిగా…

Continue Reading

శ్రీమన్నారాయణుడికి తెలియనిది లేదు .. అయినా ఆయన ధృవుడికి బాధ కలిగించిన విషయాన్ని ఆయన నోటి ద్వారానే వింటాడు. ఆయన ఏదైతే ఆశించి తపస్సు చేశాడో ఆ కోరిక తప్పక నెరవేరుతుందని చెబుతాడు. ఆయన తపస్సు తనని కదిలించి వేసిందనీ, అందుకే…

Continue Reading

నారద మహర్షి సూచనమేరకు ధృవుడు యమునా నదీ తీరంలోని “మధువనం” అనే ఒక విశాలమైన వృక్షం క్రింద కూర్చుని తపస్సు చేయడం మొదలుపెడతాడు. నారదమహర్షి చెప్పినట్టుగానే ధృవుడు తపస్సును కొనసాగిస్తూ ఉంటాడు. రోజులు గడుస్తున్నా కొద్దీ తన తపస్సును తీవ్రతరం చేస్తూ…

Continue Reading

ధృవుడు వడివడిగా నడచుకుంటూ వెళుతూ ఉండగా, ఆయన ఎదురుగా నారద మహర్షి వస్తాడు. ఎక్కడికి వెళుతున్నావని ధృవుడిని అడుగుతాడు. జరిగిన సంఘటన గురించి ఆ పిల్లవాడు నారద మహర్షికి చెబుతాడు. అందుకు నారదమహర్షి నవ్వేసి .. తపస్సు ఎలా చేయాలో తెలుసునా?…

Continue Reading

తండ్రి విషయంలో .. పిన్ని విషయంలో ధృవుడికి నిజం చెబితే ఆ పసిమనసు పాడైపోతుందని భావించిన సునీతి, ఆయన పిన్ని చెప్పిన మాట నిజమేనని అంటుంది. తండ్రి తొడపై కూర్చునే ముచ్చట తీరాలంటే శ్రీమహావిష్ణువు కోసం తపస్సు చేయాలనీ, అయన అనుగ్రహాన్ని…

Continue Reading

ధృవుడికి ఐదేళ్లు వస్తాయి .. తల్లి సునీతి తన కొడుకును ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. తల్లి చెప్పినట్టు వింటూ .. తింటూ అంతఃపురంలో ఆడుకుంటూ ఉంటాడు. తండ్రి అంటే కూడా ధృవుడికి ఎంతో ఇష్టం .. అయితే ఆయన మాత్రం…

Continue Reading

శ్రీమహావిష్ణువుకి ధృవుడు మహాభక్తుడు. ఐదేళ్ల వయసులోనే ఆయన శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం కఠోరమైన తపస్సును చేశాడు. అలా ఆ వయసులో ఆయన అంతటి తపస్సు చేయడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది. ధృవుడి తండ్రి పేరు “ఉత్తానపాదుడు” .. తల్లి…

Continue Reading

సుదర్శన చక్రం బారి నుంచి తనని కాపాడతారని బ్రహ్మదేవుడిని .. పరమశివుడిని ఆశ్రయించిన దుర్వాసుడికి నిరాశే ఎదురవుతుంది. దాంతో ఆయన ఇక తనని ఆ శ్రీమహావిష్ణువు రక్షించగలడనే ఉద్దేశంతో వైకుంఠానికి చేరుకుంటాడు. శ్రీమహా విష్ణువు కనిపించగానే తన పరిస్థితిని చెప్పుకుని కాపాడమని…

Continue Reading

అంబరీషుడిపైకి తాను ప్రయోగించిన కృత్య అనే రాక్షస శక్తిని సుదర్శన చక్రం సంహరించడం చూసి దుర్వాసుడు ఆశ్చర్యపోతాడు. అంతటి శక్తి సుదర్శన చక్రానికి లేదని కాదు .. అంతటి భక్తుడు అంబరీషుడు అనుకోకపోవడమే అందుకు కారణం. తన ప్రాణాలను కాపాడిన సుదర్శన…

Continue Reading

అంబరీషుడు ఎన్ని రకాలుగా నచ్చజెబుతున్నప్పటికీ, దుర్వాసుడు చల్లబడడు. అంబరీషుడు శాంతివచనలు పలుకుతున్నా కొద్దీ ఆయన ఆగ్రహంతో రగిలిపోతుంటాడు. పండితులు .. ఇతర రుషుల సమక్షంలో తనని అవమానపరిచిన అంబరీషుడిని అంతం చేయాలనే ఆయన నిర్ణయించుకుంటాడు. ఆ క్షణమే తన జుట్టులోని ఒక…

Continue Reading