పారిజాత వృక్షాన్ని భూలోకానికి తరలించడానికి ప్రయత్నిస్తున్న శ్రీకృష్ణుడిపై దేవేంద్రుడు మండిపడతాడు. క్షీరసాగర మథనంలో తమకి లభించిన పారిజాత వృక్షాన్ని దొంగచాటుగా తరలించడం భావ్యం కాదని చెబుతాడు. నరకాసురుడి బారి నుంచి దేవలోకాన్ని కాపాడిన కృష్ణుడు, అదే దేవలోకం నుంచి పారిజాత వృక్షాన్ని…
శ్రీ భాగవతం
పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో శ్రీ భాగవతం కథలని చదివి తెలుసుకోండి.
సత్యభామ ముచ్చటపడిన విధంగానే “నందన ఉద్యానవనం”లోని పారిజాత వృక్షాన్ని పెకిలించడానికి కృష్ణుడు సిద్ధపడతాడు. అది చూసిన కాపలాదారులు పరుగు పరుగున అక్కడికి వస్తారు. ఆ పారిజాత వృక్షం “శచీదేవి”కి ప్రాణ సమానమనీ, దానిని పెకిలించే ప్రయత్నాలు మానుకోమని కోరతారు. ఈ విషయం…
సత్యభామకు ఇచ్చిన మాట మేరకు దేవలోకం నుంచి “పారిజాతవృక్షం” తీసుకురావడానికి సత్యభామ సమేతుడై కృష్ణుడు బయల్దేరతాడు. సత్యభామ సమేతంగా కృష్ణుడు తమ లోకానికి రావడం పట్ల దేవేంద్రుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ దంపతులను సాదరంగా ఆహ్వానిస్తాడు. దేవేంద్రుడు ఆ దంపతులను…
నారద మహర్షి తెచ్చిన పారిజాత పుష్పాన్ని రుక్మిణీదేవి సిగలో కృష్ణుడు అలంకరిస్తాడు. దాంతో ఆమె ఆనందంతో పొంగిపోతుంది. తన పట్ల కృష్ణుడి ప్రేమానురాగాలకు మురిసిపోతుంది. భర్త పాదాలకు నమస్కరించుకుని, ఆయన మనసులో తనకి అంతటి స్థానాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతుంది. అలా…
నరకాసురుడు మరణించడంతో లోకులంతా కూడా తేలికగా ఊపిరి పీల్చుకుంటారు. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్న తమకి కృష్ణుడి కారణంగా విముక్తి కలిగినందుకు ఆనందిస్తారు. ఇక తమ జీవితంలో నుంచి కష్టాలు .. భయాలు .. చీకట్లు తొలగిపోయాయని భావించి…
కృష్ణుడికి .. నరకాసురిడికి మధ్య జరుగుతున్న సంభాషణను వింటున్న సత్యభామ సహనం కోల్పోతుంది. నరకాసురుడు అవమానకరంగా మాట్లాడుతుంటే, అంతగా బుజ్జగించవలసిన అవసరం ఏవుందని సత్యభామ అంటుంది. నరకాసురుడు యుద్ధమే కోరుకుంటున్నప్పుడు వారించవలసిన అగత్యం ఏవుందని అడుగుతుంది. ఇప్పటికే నరకాసురుడు ఎక్కువగా మాట్లాడే…
కృష్ణుడు ఎన్నివిధాలుగా చెప్పినా వినిపించుకోకుండా నరకాసురుడు సంగ్రామానికి సిద్ధపడతాడు. తనతో యుద్ధం చేసే సాహసం చేయలేకనే మంచి మాటలతో మాయ చేయడానికి ప్రయత్నిస్తున్నావంటూ అవమానకరంగా మాట్లాడతాడు. కృష్ణుడు ఒంటరిగా కాకుండా సత్యభామను యుద్ధానికి తీసుకురావడం గురించి ఎద్దేవా చేస్తాడు. ఇంతకుముందు అతని…
కృష్ణుడు తనని ఎదిరించడానికి సిద్ధమవుతున్నాడనే విషయం తెలియగానే నరకాసురుడు నవ్వుకుంటాడు. ఒక గోపాలకుడు తనని ఎదిరించడానికి పూనుకోవడమా? తాను ఇంద్రాది దేవతలను ఎదిరించిన విషయం తెలిసి కూడా ముందడుగు వేయడమా? నరకాసురిడితో యుద్ధం అంటే గోపికలతో కలిసి నాట్యం చేయడం కాదనే…
భూలోకంలో నరకాసురుడి ఆగడాలకు అడ్డుకట్టలేకుండా పోతుంది. ఎవరూ యజ్ఞయాగాదులు నిర్వహించరాదని ఆయన ప్రకటిస్తాడు. అంతేకాదు .. ఎవరూ కూడా హరినామ స్మరణ చేయరాదనే శాసనం చేస్తాడు. తన ఆదేశాలను వ్యతిరేకించిన వారిని చెరసాలలో వేయిస్తుంటాడు. తన శాసనాలను ధిక్కరించినవారిని చిత్రహింసలకు గురిచేస్తూ…
రుక్మిణీదేవి .. జాంబవతి .. సత్యభామను వివాహమాడిన కృష్ణుడు, ఆ తరువాత కాళింది .. మిత్రవింద .. నాగ్నజితి .. భద్ర .. లక్షణను కూడా వివాహమాడతాడు. అష్ట భార్యలు అలగకుండగా కృష్ణుడు వాళ్లకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. అయితే సత్యభామకు…