శ్రీ భాగవతం

201   Articles
201

పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో శ్రీ భాగవతం కథలని చదివి తెలుసుకోండి.

అనవసరంగా కృష్ణుడిని అనుమానించినందుకు సత్రాజిత్తు పశ్చాత్తాప పడతాడు. నలుగురిలో ఆయనను అనరాని మాటలు అన్నందుకు బాధపడతాడు. కృష్ణుడిని ద్వేషిస్తూ .. ఆయన పట్ల సత్యభామకు గల ప్రేమానురాగాలను అర్థం చేసుకోలేకపోయినందుకు ఆవేదన చెందుతాడు. ఇందుకు శతధన్వుడు .. ప్రసేనజిత్తు ఇద్దరూ కారణమేనని…

Continue Reading

సత్రాజిత్తు తనపై వేసిన నింద నిజం కాదని నిరూపించడం కోసం .. కృష్ణుడు తన పరివారంతో అడవుల్లోకి వెళతాడు. అలా ఆయన దట్టమైన అడవుల్లోకి వెళ్లిన తరువాత, ప్రసేనుడికి సంబంధించిన వస్త్రాలు ఒక చోట కనిపిస్తాయి. అక్కడి నుంచి సింహం పాదాల…

Continue Reading

కృష్ణుడి దగ్గరికి సత్రాజిత్తు వెళతాడు .. ఆయన ఆగ్రహావేశాలతో ఉండటం చూసిన కృష్ణుడు అయోమయానికి లోనవుతాడు. ఏం జరిగిందని అడుగుతాడు. చేసినదంతా చేసి ఏమీ తెలియనివాడి మాదిరిగా నటించవద్దంటూ సత్రాజిత్తు మండిపడతాడు. విషయమేవిటో అర్థంకాక అతనివైపు ప్రశ్నార్థకంగా చూస్తాడు. కృష్ణుడు మాయదారి…

Continue Reading

ఒక వైపున కృష్ణుడు .. సత్యభామను పెళ్లాడాలని భావించడం, మరో వైపున “శ్యమంతకమణి”ని గురించి అడగడం సత్రాజిత్తుకు ఆందోళన కలిగిస్తుంది. కృష్ణుడు మహా మాయావి కనుక, ఏ క్షణంలోనైనా ఆయన సత్యభామను సొంతం చేసుకోవచ్చును. అలాగే తన నుంచి “శ్యమంతకమణి”ని కూడా…

Continue Reading

సత్రాజిత్తు మొదటి నుంచి కూడా సూర్యభగవానుడికి మహా భక్తుడు. అనునిత్యం సూర్యోపాసన తరువాతనే ఆయన దైనందిన కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి. ఆయన ఒక్కగానొక్క కూతురు సత్యభామ. ఆమె అందచందాలను గురించి కృష్ణుడు వింటాడు. ఇక ఆమె మనసులో కూడా ఆయనే ఉంటాడు….

Continue Reading

కృష్ణుడు .. రుక్మిణి దంపతులు ప్రేమకు ప్రతీకలుగా, మమతానురాగాల మాలికలుగా వెలుగొందుతుంటారు. క్షణమైనా కృష్ణుడిని విడిచి ఉండలేని రుక్మిణీదేవి ఆయన సేవలోనే కాలం గడుపుతూ ఉంటుంది. తన వాళ్లందరినీ తన కోసం వదులుకుని వచ్చిన కారణంగా, ఆమె మనసుకు ఎలాంటి కష్టం…

Continue Reading

విదర్భ దేశానికి చెందిన “కుండినపురము” నుంచి రుక్మిణీదేవిని అపహరించిన కృష్ణుడు, ఆమెను వెంటబెట్టుకుని ద్వారక చేరుకుంటాడు. రుక్మిణీదేవిని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించిన ద్వారకవాసులు సంతోష సంబరాల్లో మునిగిపోతారు. రుక్మిణీ కృష్ణుల కల్యాణానికి చకచకా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ప్రజలంతా కూడా తమ…

Continue Reading

విదర్భలోని “కుండిన నగరం”లో రుక్మిణీ కల్యాణానికి ఏర్పాట్లు జరుగుతుంటాయి. శిశుపాలుడు తన పరివారంతో అక్కడికి చేరుకుంటాడు. రాజలాంఛనాలతో ఆయన పరివారానికి వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. మరో వైపున రుక్మిణీదేవిని పెళ్లి కూతురుగా అలంకరిస్తారు. తాను చెప్పిన సమయానికి కృష్ణుడు వస్తాడా…

Continue Reading

“విదర్భ” రాజ్యాన్ని భీష్మకుడు అను రాజు పరిపాలిస్తూ ఉంటాడు .. ఆయన కుమార్తెనే “రుక్మిణీ దేవి”. ఆమె సౌందర్యాన్ని గురించి తెలిసిన దగ్గర నుంచి ఆమెనే పెళ్లి చేసుకోవాలని కృష్ణుడు అనుకుంటాడు. ఇక కృష్ణుడి రూపం .. ఆయన వీరోచిత కార్యాలను…

Continue Reading

శిశుపాలుడు “చేది” దేశానికి రాజు .. దమఘోషుడు .. సాత్వతిలకు జన్మించినవాడు. కృష్ణుడికి సాత్వతి మేనత్త అవుతుంది. శిశుపాలుడు పుట్టినప్పుడు ఆయన రూపం చాలా వికృతంగా ఉండేది. మూడు కన్నులు .. నాలుగు చేతులతో ఆయన జన్మించాడు. చూడటానికి ఆయన చాలా…

Continue Reading