బలరామకృష్ణులు ఏనుగును హతమార్చినప్పుడు కంసుడు కాస్త బలహీనపడతాడు. ఆ తరువాత ఆయన చాణూర, ముష్టికులపైనే నమ్మకం పెట్టుకుంటాడు. ఎంతోమంది మహా యోధులను వాళ్లు నేల కూల్చడాన్ని స్వయంగా చూసిన కారణంగా ఆయన వాళ్లపై చాలా ఆశలు పెట్టుకుంటాడు. వాళ్ల బారి నుంచి…
శ్రీ భాగవతం
పిల్లల నుండి పెద్దల వరకు సరళమైన తెలుగులో శ్రీ భాగవతం కథలని చదివి తెలుసుకోండి.
కంసుడు ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే చాణూర .. ముష్టికులతో కృష్ణుడి మల్లయుద్ధాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ మల్లయుద్ధాన్ని తిలకించడానికి మధుర వాసులంతా వస్తారు. మల్లయుద్ధంలో చాణూర .. ముష్టికులు ఆరితేరినవారు. అంతవరకూ వాళ్లకు అపజయమనేది తెలియదు. ఉక్కుతో తయారు చేసిన…
బలరామకృష్ణులు రాజవీధిలో నడుస్తూ ఉండగా, వాళ్లకి కురూపి అయిన “కుబ్జ” ఎదురుగా వస్తుంది. వివిధ రకాల లేపనాలతో ఆమె బలరామకృష్ణుల దగ్గరికి చేరుకుంటుంది. అనేక వంకరలు తిరిగిన శరీరం .. ముడతలు పడిన ముఖంతో ఉన్న “కుబ్జ”ను కృష్ణుడు పరిశీలనగా చూస్తాడు….
కంసుడు తమకి ఆహ్వానం పలకడంలోని అంతరార్థం గ్రహించిన బలరామకృష్ణులు, “మధుర”కు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కృష్ణుడి ఆదేశం మేరకు ఇతర గోపాలకులు కూడా వాళ్లతో బయల్దేరడానికి సిద్ధమవుతారు. యశోద నందుల దగ్గర సెలవు తీసుకుని, మధురకు బయల్దేరతారు. వాళ్లు మధురానగరంలోకి ప్రవేశిస్తూ ఉండగానే,…
కంసుడి ఆదేశం మేరకు అక్రూరుడు బృందావనానికి బయల్దేతారాడు. రథం బృందావనంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి అక్కడి ప్రకృతి అందాలను చూసి ఆయన ముగ్ధుడవుతాడు. పరమాత్ముడైన కృష్ణుడు అడుగుపెట్టడం వల్లనే అక్కడి వాతావరణం అంత అందంగా .. ఆహ్లాదంగా ఉందని ఆయన అనుకుంటాడు….
కృష్ణుడిని ఒక పథకం ప్రకారం అంతమొందించాలి .. ఈ సారి తన ప్రయత్నం వృథా కాకూడదు. అంచెల పద్ధతిలో మహా వీరులను .. యోధులను ఉంచాలి. అవసరమైనప్పుడు క్షణాల్లో వాళ్లు రంగంలోకి దిగాలి. తన కనుసైగ కోసం వాళ్లంతా కాచుకుని ఉండాలి….
రోజులు గడుస్తున్నా కొద్దీ కంసుడు తీవ్రమైన ఆందోళనకు .. అసహనానికి లోనవుతుంటాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఎంతమంది అసురులను పంపించినా ప్రయోజనం లేకుండగా పోవడంతో దిగాలు పడిపోతుంటాడు. ఎలాగైనా ఆ కృష్ణుడిని అంతం చేయాలి? తాను బలహీన పడుతున్న కొద్దీ…
బృందావన వాసులంతా కూడా తమ ఊళ్లో భయంకరంగా రంకెలు వేస్తూ ఎద్దు రూపంలో తిరిగింది రాక్షసుడు అని తెలుసుకుని ఆశ్చర్యపోతారు. ఆ ఎద్దును కృష్ణయ్య హతమార్చాడని తెలిసి ఆనందిస్తారు. ఆ ఎద్దును అంతకుముందు ఎక్కడా చూడకపోవడం వలన తమకి అనుమానం వచ్చిందనీ,…
అరిష్టాసురుడు బృందావనం పొలిమేరలు దాటేసి లోపలికి వస్తూనే, కృష్ణుడి అంతం చూసిన తరువాతనే తిరిగి పొలిమేర దాటి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయం తెలియని గోపాలకులంతా బలరామకృష్ణులతో కలసి, ఆవులను తోలుకుంటూ అడవికి వెళతారు. ఎప్పటిలానే ఆవుల మందలను విశాలమైన మైదానంలో…
కృష్ణుడిని అంతమొందించమని తాను పంపిస్తున్న వాళ్లంతా ఆ కృష్ణుడి చేతిలోనే హతమవుతుండటం కంసుడిని ఆందోళనకు గురిచేస్తుంది. దాంతో ఆయన తీవ్రంగా ఆలోచన చేయడం మొదలుపెడతాడు. “పూతన” దగ్గర నుంచి తాను పంపించిన వాళ్లంతా మహా బలవంతులు. మాయా రూపంలో ఎలాంటి శత్రువునైనా…