Ramayanam – 49 : Angada warns Ravana
రావణుడి సభామందిరంలోకి అంగదుడు ధైర్యంగా ప్రవేశిస్తాడు. వచ్చింది రాముడి సైన్యానికి చెందిన వానరవీరుడే అయినా, ఆ వీరుడికి సంబంధించిన వివరాలు తెలియక రావణుడు ప్రశ్నార్థకంగా చూస్తాడు. అది గ్రహించిన అంగదుడు తన పేరును చెబుతాడు. తాను వాలి పుత్రుడనని అంటాడు. గతంలో ఒకసారి వాలి చేతిలో రావణుడు పరాజితుడవుతాడు. వాలి బాహువులలో నుంచి బయటపడటానికి రావణుడు నానా తిప్పలు పడతాడు. వాలి పరాక్రమాన్ని అంగీకరించి, క్షమించమని చెప్పి బయటపడతాడు. ఆ విషయాన్ని అంగదుడు గుర్తుచేయడంతో రావణుడు కాస్త తడబడతాడు.
వచ్చింది వాలి పుత్రుడు అని తెలియగానే రావణుడు మంచి మాటలతో అతని ఆవేశాన్ని చల్లార్చడానికి ప్రయత్నిస్తాడు. వాలి వంటి మహాబలవంతుడి కొడుకైన అతను తనకి సహాయంగా ఉంటే, అతను కోరుకున్నది ఇస్తానని చెబుతాడు. సాధారణ మానవులైన రామలక్ష్మణులకు సేవ చేయడం వలన అతనికి ఒరిగేదేమీ ఉండదని స్పష్టం చేస్తాడు. కిష్కింధకు అంగదుడిని రాజును చేస్తాననీ, భవిష్యత్తులో అతని పదవికి ఎవరివలన ఎలాంటి ప్రమాదం లేకుండా తాను చూసుకుంటానని హామీ ఇస్తాడు. తెలివైనవాడే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడని అంటాడు.
రావణుడి మాటల పట్ల అంగదుడు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. రాజ్యం పట్ల, పదవుల పట్ల అతనికిలా తనకి ఎలాంటి వ్యామోహాలు లేవని అంగదుడు అంటాడు. అలాంటి వ్యామోహాలు ఉంటే ఇంత కష్టపడి ఇంతదూరం రానని చెబుతాడు. స్వామి కార్యంపై వచ్చి స్వకార్యాన్ని చక్కబెట్టే తత్వం తనది కాదని స్పష్టం చేస్తాడు. తప్పుదారిన వెళుతున్నావని చెప్పడానికి వస్తే, తననే తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మానుకోమని అంటాడు. కోరికలు, ఆశలు లేనివారు ఎవరికీ లొంగరనే విషయాన్ని మరిచిపోవద్దని చెబుతాడు.
రాముడి మాటగా తాను ఒక విషయాన్ని చెప్పడానికి వచ్చాననీ, ముందుగా ఆ మాటను ఆలకించమని అంటాడు. సీతమ్మను అపహరించడం ధర్మం కాదనీ, దూతగా వచ్చిన హనుమంతుడి తోకకు నిప్పుపెట్టడం సరైనది కాదని అంటాడు. ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకుని రాముడి పాదాలను ఆశ్రయిస్తే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని చెబుతాడు. రాముడు క్షమించకపోతే ఇక అతనికి క్షమాభిక్ష పెట్టేవారు ముల్లోకాల్లోను లేరని హెచ్చరిస్తాడు. ఇది రాముడి వైపు నుంచి జరుగుతున్న చివరి ప్రయత్నమనీ, దీనిని వృథా చేసుకుంటే అతణ్ణి కాపాడగలిగేవారు ఉండరని చెబుతాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 49 : Angada warns Ravana
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.