Ramayanam – 48 : Angada was an ambassador on behalf of Rama
రామలక్ష్మణులు, వానరవీరులు అంతా కూడా వారధి దాటేసి లంకానగర సరిహద్దుల్లో కాలు పెడతారు. అక్కడి సువేల పర్వతంపై రాముడు బస చేస్తాడు. సుదీర్ఘ ప్రయాణం కారణంగా అలసిన వానరవీరులు కొంతసేపు అక్కడ విశ్రమిస్తారు. ఆ తరువాత అంతా సమావేశమవుతారు. ఇక ఆలస్యం చేయడం భావ్యం కాదనీ, రావణుడిపై యుద్ధానికి సమరశంఖం పూరిద్దామని రాముడితో అంటారు. ఒక్కసారిగా రావణుడి నగరాన్ని చుట్టుముట్టి శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేద్దామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. రాముడి అనుమతి కోసం తామంతా వేచిచూస్తున్నామని అంటారు.
రావణుడికి మరోమారు అవకాశం ఇద్దామని రాముడు అంటాడు. రావణుడు తాను చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇద్దామనీ, అప్పటికి కూడా ఆయన ధోరణిలో మార్పు రాకపోతే రణమే శరణ్యమని చెబుతాడు. అందుకోసం తాము ఏం చేయాలని వానర వీరులు అడుగుతారు. రావణుడి దగ్గరకు వాలి కొడుకైన అంగదుడు వెళ్లి సంధి ప్రయత్నం చేస్తాడనీ, ఆ ప్రయత్నం ఫలించకపోతే తాము ముందుగా అనుకున్నట్టుగానే చేద్దామని అంటాడు. అందుకు వానర వీరులంతా అంగీకరిస్తారు. లక్ష్మణుడు కూడా అన్నగారి నిర్ణయం సరైనదేనని అంగీకరిస్తాడు.
రామలక్ష్మణులు సముద్రం దాటుకుని వచ్చిన విషయం రావణుడికి తెలుస్తుంది. కోట్లాదిమంది వానరవీరులు ఆయనకి తోడుగా ఉన్నారని వేగులు చెప్పగా రావణుడు వింటాడు. ఆ వానరులంతా కూడా ఒకరిని మించిన బలవంతులుగా ఒకరు కనిపిస్తున్నారని చెప్పడంతో అయోమయంలో పడతాడు. వానర సైన్యం అంతా ఒక సముద్రంలా కనిపిస్తున్నప్పటికీ, కొన్ని సమూహాలుగా ఉన్నారని తెలిసి ఆలోచనలో పడతాడు. బలమైన నాయకత్వంలో ఆ సమూహాలు విరుచుకుపడటానికి సిద్ధంగా ఉన్నాయని తెలిసి ఆందోళన చెందుతాడు. ఆ వానరులలో ఎవరికీ ప్రాణభయం లేదనీ, యుద్ధం చేయడానికి ఒకరిని మించిన ఉత్సాహం మరొకరు చూపుతున్నారని తెలిసి ఆశ్చర్యపోతాడు.
రావణుడు తన వేగుల ద్వారా తెలిసిన విషయాలను గురించి, సేనాధిపతి అయిన ప్రహస్తుడితో చర్చిస్తాడు. ఏ క్షణంలోనైనా యుద్ధం మొదలుకావొచ్చనీ, అందుకు అవసరమైన సన్నాహాలు సిద్ధం చేయమని ఆదేశిస్తాడు. సైనికబలగాలను అప్రమత్తం చేయమని చెబుతాడు. జరగనున్న యుద్ధాన్ని గురించిన వ్యూహాలను పన్నడానికి మేధావులతో సమావేశమవుతాడు. వాళ్లందరితో కలిసి రావణుడు మాట్లాడుతూ ఉండగా, అంగదుడు లోపలికి అడుగుపెడతాడు. మరో వానరుడు తన సభామందిరంలోకి ప్రవేశించడం చూసి రావణుడు విస్మయానికి లోనవుతాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 48 : Angada was an ambassador on behalf of Rama
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.