Ramayanam – 77 : Aswamedhayaga planning
వాల్మీకి ఆశ్రమంలో లవ కుశులు ఎదుగుతూ ఉంటారు. రామాయణ కథా కావ్యంలోని విశేషాలను వాళ్లకు ఎప్పటికప్పుడు తెలియజెపుతూ, సీతారాముల ఆదర్శ జీవితాన్ని వాళ్లకు అర్థమయ్యేలా వాల్మీకి మహర్షి చెబుతుంటాడు. దాంతో రాముడి ధర్మనిరతి .. త్యాగనిరతి .. ఆయన ధైర్యసాహసాల పట్ల వాళ్లకి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. అలాగే సీతమ్మతల్లి ఔన్నత్యం గురించి వాళ్లు పూర్తిగా అర్థం చేసుకుంటారు. సీతారాముల గొప్పతనాన్ని గురించి శ్రావ్యంగా ఆలపించడం నేర్చుకుంటారు. అది చూసి సీతమ్మ ఎంతో సంతోషిస్తుంది.
రామకథను ఊరూరా ప్రచారం చేయమని లవకుశులను వాల్మీకి మహర్షి ఆదేశిస్తాడు. ఆ విధంగా వారి జీవితానికి ఒక సార్ధకత లభించేలా చేసుకోమని చెబుతాడు. అందుకు ఆ పిల్లలు ఇద్దరూ ఆనందంగా అంగీకరిస్తారు. ఇదిలా ఉండగా అయోధ్యలో “అశ్వమేథ యాగం” జరపడానికి అవసరమైన ఏర్పాట్లు చకచకా జరిగిపోతుంటాయి. రాముడి సోదరులు దగ్గరుండి తగిన ఏర్పాట్లు చేస్తుంటారు. వాళ్ల నుంచి ఆహ్వానాన్ని అందుకున్న వానరవీరులు, విభీషణుడు కూడా అక్కడికి చేరుకుంటారు.
వివిధ ప్రదేశాల నుంచి మహర్షులు, మునులు, బ్రాహ్మణులు అంతా కూడా అయోధ్యానగరానికి చేరుకుంటూ ఉంటారు. వాళ్లకి కావలసిన వసతి సౌకర్యాలను చూడటంలో భరతుడు తదితరులు నిమగ్నమై ఉంటారు. వచ్చిన వాళ్లందరికీ ఇవ్వవలసిన కానుకలు కూడా సిద్ధమైపోతాయి. అయోధ్య నగరమంతా కూడా ఎంతో సందడిగా కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే వారితో కోలాహలంగా ఉంటుంది. అయోధ్య ప్రజలంతా ఎంతో సంతోషంగా ఒక పండుగ జరుగుతుందన్నట్టుగా ఉంటారు.
అశ్వమేథ యాగం జరుగుతున్నందుకు రాముడికీ, కౌసల్యాదేవికి సంతోషంగా ఉన్నప్పటికీ, సీతాదేవి లేకుండా ఆ యాగాన్ని నిర్వహిస్తున్నందుకు బాధపడుతూనే ఉంటారు. ఎంతమంది స్త్రీలు అంతఃపురంలో తిరుగుతున్నా, ఎంతమంది స్త్రీలు తమకి తోచిన పనులు చేస్తున్నా సీతాదేవి కళకు సమానులు కాగలరని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది. సీతాదేవి లేని సందడిని ఊహించడం అమాయకత్వమని ఆవేదన చెందుతుంది. రాముడు కూడా అదే విధమైన ఆలోచనతో జరుగుతున్న పనులను యాంత్రికంగా చూస్తుంటాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 77 : Aswamedhayaga planning
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.