Ramayanam – 33 : Hanuman goes to Lanka
రాముడి నామస్మరణ చేస్తూ ఆకాశంలో హనుమంతుడు రివ్వున సాగుతుంటాడు. సముద్రంలో ఉన్న మైనాకుడు అనే పర్వతం హనుమంతుడిని చూస్తుంది. వెంటనే సముద్రం పైభాగానికి వస్తుంది. సముద్ర గర్భం నుంచి తన ఎదురుగా పెరుగుతూ వస్తున్న పర్వతాన్ని చూసి, అదంతా రాక్షస మాయ అని హనుమంతుడు అనుకుంటాడు. కానీ అంతలో ఆ పర్వత రాజం హనుమంతుడికి వినయపూర్వకంగా నమస్కరిస్తుంది. తన శిఖరంపై కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్లమని కోరుతుంది. రామకార్యాన్ని పూర్తి చేసేంతవరకూ విశ్రమించనని ప్రతిజ్ఞ చేశాననీ, అందువలన ఆగడం కుదరదని చెప్పేసి ఒకసారి ఆత్మీయంగా ఆ పర్వతాన్ని స్పృశించి హనుమంతుడు ముందుకు సాగుతాడు.
అలా హనుమంతుడు సముద్రం మీదుగా ఆకాశ యానం చేస్తూనే, దూరం నుంచి లంకానగరాన్ని చూస్తాడు. ఎత్తయిన భవనాలతో, వృక్షాలతో ఉన్న ఆ లంకానగరాన్ని చూస్తూ, ఆ నగరం ముఖద్వారం చెంత దిగుతాడు. నేరుగా లోపలికి వెళ్లడం వలన అనవసరమైన తలనొప్పులు ఎదురవుతాయనే ఉద్దేశంతో లంకానగరం ప్రధాన ద్వారం దగ్గరే దిగేసి, ఒకసారి అంతా పరిశీలనగా చూస్తుంటాడు. అదే సమయంలో ఆయనకి భయంకరమైన ఒక నవ్వు వినిపిస్తుంది. తన ఎదురుగా చిన్న పర్వతంలా కనిపిస్తున్న లంకిణిని చూస్తాడు. భీకరమైన తన రూపాన్ని చూసి, ఒక వానరుడు బెదరకపోవడం ఆమెకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఎంతో కాలంగా తాను లంకానగరానికి కాపలా కాస్తూ ఉన్నాననీ, కానీ ఇంతవరకూ ఎప్పుడూ ఎవరూ అటుగా రాలేదని అంటుంది. ఇంతకాలానికి ఒక వానరుడు రావడం చూశానని చెబుతుంది. తనని చూస్తేనే ప్రాణాలు పోతాయని అనుకుంటూ ఉంటే, తన ఎదురుగా ధైర్యంగా నిలబడటం తమాషాగా అనిపిస్తుందని చెబుతుంది. ఆ వానరానికి మూడటం వల్లనే అటుగా వచ్చిందనే విషయం తనకి అర్థమైందంటూ హనుమంతుడిపై విరుచుకుపడుతుంది. లంకిణి బారి నుంచి తప్పించుకుంటూనే, అదను చూసి ఆమె శిరస్సుపై హనుమంతుడు బలంగా మోదుతాడు. దాంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలుతుంది.
అలా నేల కూలిన లంకిణి నెమ్మదిగా కళ్లు తెరుస్తుంది. తన ఎదురుగా కొండలా ఉన్న హనుమంతుడిని చూస్తుంది. ఒక వానరవీరుడి చేతిలో ఓడిపోయినప్పుడే తనకి ఆ బానిసత్వం నుంచి విముక్తి కలుగుతుందనే శాపం ఉందనీ, అది నేటితో తీరిపోయినందుకు ఆనందంగా ఉందని అంటుంది. ఒక వానరవీరుడు అడుగుపెట్టడంతోనే లంకానగరానికి వినాశనం మొదలవుతుందని తాను విన్నది నిజం కానుందని చెప్పేసి హనుమంతుడికి దారి వదులుతుంది. దాంతో హనుమంతుడు ముందుకు కదులుతాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 33 : Hanuman goes to Lanka
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.