Ramayanam – 81 : Lava confronts Shatrughna

అశ్వమేధ యాగానికి సంబంధించిన యాగాశ్వాన్ని లవుడు బంధిస్తాడు. దానిని విడిపించడానికి ప్రయత్నించిన సైనికులను ఎదిరిస్తాడు. రాముడి గురించి, ఆయన సోదరుడైన శత్రుఘ్నుడి గురించి చెప్పినా లవుడు వెనకడుగు వేయకపోవడం ఆ సైనికులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దాంతో వాళ్లంతా శత్రుఘ్నుడు ఆగిన చోటుకు వెళతారు. వాళ్లంతా ఆందోళనతో ఉండటం చూసిన ఆయన, విషయమేమిటని అడుగుతాడు.

ఒక బాలకుడు యాగాశ్వన్ని బంధించాడనీ, వదలమని చెబితే వినిపించుకోవడం లేదని అంటారు. అయోధ్యకి చెందిన అశ్వమని చెప్పినా, శత్రుఘ్నుడు వస్తాడని చెప్పినా భయపడటం లేదని అంటారు. చూడటానికి మునికుమారుడిలానే ఉన్నప్పటికీ, రాకుమారుడిలా మాట్లాడుతున్నాడని చెబుతారు. కత్తులు దూసినా తమని తన బాణాలతో తరిమికొట్టాడని అంటారు. ఒక ముని కుమారుడు అంతటి పరాక్రమాన్ని చూపడం శత్రుఘ్నుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

దాంతో తనే స్వయంగా రంగంలోకి దిగుతాడు. ఆ బాలకుడు ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని ఆ దిశగా వెళతాడు. మిగతా సైన్యం అతనిని అనుసరిస్తుంది. లవుడు అశ్వాన్ని బంధించి, ఆ పక్కనే విల్లంబులు ధరించి కూర్చుని ఉంటాడు. శత్రుఘ్నుడు నేరుగా లవుడి దగ్గరకు వెళతాడు. యాగాశ్వాన్ని తనకి అప్పగించమనీ, దానిని బంధించడం తప్పని లవుడితో చెబుతాడు. అతను బాలకుడు కావడం వలన తాను మాటలతో చెబుతున్నానని అంటాడు.

తాను వీరమాత పుత్రుడనని లవుడు చెబుతాడు. బెదిరిస్తే భయపడటం, పారిపోవడం వంటివి తనకి తెలియవని అంటాడు. అందువలన అనవసరమైన మాటలతో కాలయాపన చేయకుండా వెనుదిరిగి వెళ్లమని చెబుతాడు. ఆ మాటలకు శత్రుఘ్నుడు నివ్వెరపోతాడు. రఘువంశ వీరుల గురించి నీకు తెలియదు, వాళ్లు విల్లంబులు చేతబడితే ఎలా ఉంటుందన్నది కూడా తెలియదు. అందువలన ఎందుకు చెబుతున్నది అర్థం చేసుకుని అశ్వాన్ని విడిచి పెట్టమని అంటాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 81 : Lava confronts Shatrughna

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: