Ramayanam – 82 : Lava fell unconscious

యాగాశ్వం విషయంలో ఎంతగా చెప్పినా లవుడు వినిపించుకోకపోవడంతో, శత్రుఘ్నుడు యుద్ధానికి దిగుతాడు. ఇద్దరూ బాణాలను సంధించడం మొదలుపెడతారు. ఒకరిని మించిన శక్తివంతమైన అస్త్రాలను ఒకరు ప్రయోగిస్తూ ఉంటారు. ఒక మునికుమారుడు ఇంతటి శక్తివంతమైన అస్త్రాలను సంధించడం, విలువిద్యలో అంతటి నైపుణ్యాన్ని కలిగి ఉండటం శత్రుఘ్నుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ విషయాన్ని గురించి ఆయన ఆలోచిస్తూనే బాణాలను వదులుతూ ఉంటాడు.

శత్రుఘ్నుడి వెంట చేరిన సైన్యమంతా ఆందోళన చెందుతూ ఉంటారు. బాలకుడు ఏదో బెదిరిస్తే భయపడి యాగాశ్వాన్ని అప్పగిస్తాడని అనుకుంటే, ఇంత పెద్ద యుద్ధం చేస్తుండటం వాళ్లకి వింతగా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. మునికుమారులంతా కూడా లవుడి వెనక చేరతారు. ఏం జరుగుతుందా అని వాళ్లంతా ఎంతో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. లవుడు మాత్రం ఎంతమాత్రం అలసిపోకుండా బాణాలను సంధిస్తూనే ఉంటాడు.

శత్రుఘ్నుడు ఆలోచన చేస్తాడు, అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని వదిలి ఆ బాలకుడిని కట్టడి చేయకపోతే కష్టమైపోతుందనే విషయం ఆయనకి అర్థమైపోతుంది. దాంతో ఆ అస్త్రాన్ని లవుడిపై ప్రయోగిస్తాడు. బాలకుడైన లవుడు ఆ అస్త్రం ప్రభావం కారణంగా స్పృహ కోల్పోతాడు. లవుడి దగ్గరికి వచ్చిన శత్రుఘ్నుడు అతని వైపు పరిశీలనగా చూస్తాడు. ఆ బాలకుడిలో క్షత్రియ లక్షణాలు కనిపిస్తూ ఉండటం గమనిస్తాడు.

శత్రుఘ్నుడి ఆదేశం మేరకు సైనికులు యాగాశ్వాన్ని విడిపిస్తారు. అడవిలో తనతో పోరాడి ఓడిన ఆ బాలుడిని అక్కడే వదిలివేయలేక, ఆయన తన రథంపై తీసుకువెళుతుంటాడు. ఈ విషయం కుశుడికి తెలిసి కలవరపాటుకు లోనవుతాడు. ఎవరు వచ్చారు? లవుడిని ఎక్కడికి తీసుకువెళుతున్నారు? అనే అయోమయానికి లోనవుతాడు. లవుడిని రక్షించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి బయల్దేరతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 82 : Lava fell unconscious

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: