Ramayanam – 3 : Ram Lakshman follows Vishwamitra
రాక్షస సంహారం చేయడానికిగాను రాముడిని వెంట తీసుకెళతానని ఎప్పుడైతే విశ్వామిత్రుడు అన్నాడో, దశరథుడు ఉలిక్కి పడతాడు. రాక్షస సంహారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాననీ, తాను వస్తానని దశరథుడు అంటాడు. తాను రాముడి కోసం వచ్చాననీ, రాముడిని తనవెంట పంపించమని విశ్వామిత్రుడు కోరతాడు. ఆ మాటతో దశరథుడు మరింత ఆందోళనకు లోనవుతాడు. రాముడికి ఇంకా పసితనం పోలేదనీ, అలాంటి రాముడు రాక్షస సంహారం ఎలా చేయగలడని అంటాడు. ఆ మాటకు విశ్వామిత్రుడు అసహనానికి లోనవుతాడు.
యాగ రక్షణకి తగినవాడు రాముడని భావించే తాను వచ్చాననీ, అది ఇష్టం లేకపోతే తాను వెళ్లిపోతానని విశ్వామిత్రుడు అంటాడు. ఆయన కోపిష్టి అని తెలిసిన దశరథుడు, మరింత కంగారుపడిపోతాడు. రాముడు విలువిద్యను పూర్తి చేశాడుగానీ, ఎవరితో ఇంతవరకూ యుద్ధం చేసింది లేదని అంటాడు. రాక్షస మాయల పట్ల అతనికి ఎలాంటి అవగాహన లేదని చెబుతాడు. అతణ్ణి పంపించింది మొదలు తన మనసు .. మనసులో ఉండదని అంటాడు. అందువలన తనని తీసు కెళ్లమని కోరతాడు. ఇక దశరథుడిని ఒప్పించడం తన వలన కాదని భావించిన విశ్వామిత్రుడు వెంటనే పైకి లేస్తాడు.
అది గమనించిన వశిష్ఠ మహర్షి .. కాసేపు ఓపిక పట్టమని విశ్వామిత్రుడిని కోరతాడు. ఆ తరువాత ఆయన దశరథుడి దగ్గరికి వచ్చి ఆయనకి నచ్చజెబుతాడు. రాముడిని తీసుకువెళ్లడమనేది విశ్వామిత్రుడి వ్యక్తిగత కారణాల కోసం కాకపోవచ్చని అంటాడు. లోక కళ్యాణాన్ని కోరి విశ్వామిత్రుడు ఇలా చేస్తూ ఉండొచ్చునని చెబుతాడు. రాముడిని మహా వీరుడిగా తీర్చిద్దడం కూడా ఆయన ఉద్దేశమై ఉంటుందని అంటాడు. అందువలన రాముడిని గురించిన ఆందోళన చెందవలసిన పనిలేదనీ, నిస్సందేహంగా పంపించవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు.
వశిష్ఠుడి మాటలకు దశరథుడి మనసు కొంత కుదుటపడుతుంది. తపోబల సంపన్నుడైన విశ్వామిత్రుడి నీడలో రాముడికి ఎలాంటి అపాయం జరిగే అవకాశం లేదని అర్థం చేసుకుంటాడు. అందువలన రాముడిని పంపించడానికి భయపడవలసిన అవసరం లేదని గ్రహిస్తాడు. విశ్వామిత్రుడికి తన అంగీకారాన్ని తెలియజేస్తాడు. తండ్రి ఆదేశం మేరకు రాముడు విల్లంబులు చేతబట్టి విశ్వామిత్రుడి వెంట బయల్దేరతాడు. అతణ్ణి విడిచి ఉండలేని లక్ష్మణుడు కూడా రాముడిని అనుసరిస్తాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 3 : Ram Lakshman follows Vishwamitra
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.