Ramayanam – 68 : Rama directs to drop Sita in forest
సీతను అడవులలో దింపేసి రమ్మని రాముడు అనగానే ఆయన సోదరులు బిత్తరపోతారు. మహాసాధ్వీమణి అయిన ఆమెను తాను అడవులలో దింపి రాలేనని లక్ష్మణుడు అంటాడు. మహా ఇల్లాలికి ఇలాంటి పరీక్షలు పెట్టడం సరికాదని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఒక వైపున సింహాసనం త్యజించవద్దని అంటారు, మరో వైపున సీతను త్యజించవద్దని చెబుతారు. మరి వంశ గౌరవాన్ని కాపాడటం ఎలా? అని రాముడు అంటాడు. అందువలన తాను చెప్పినట్టుగా ఆమెను గంగానదీ తీరంలోని అడవులలో వదిలేసి రమ్మని అంటాడు.
తపోవనాలకి బయలుదేరమనే ఆదేశం రావడంతో, తన ముచ్చట తీర్చడం కోసమే రాముడు అలాంటి నిర్ణయం తీసుకున్నాడని సీతాదేవి భావిస్తుంది. రాముడి పాదాలకు నమస్కరించుకుని లక్ష్మణుడి వెంట బయల్దేరుతుంది. అసలు విషయం తెలియక అమాయకంగా లక్ష్మణుడితో వెళుతున్న ఆమెను చూసి రాముడు కుమిలిపోతాడు. రాజ్యాధికారమే లేకపోతే తాను కూడా సీత వెంట వెళ్లి ఉండేవాడినని అనుకుంటాడు. తరతరాలుగా వస్తున్న రాజ్యాధికారం తన చేతులు కట్టేసిందంటూ కన్నీళ్ల పర్యంతమవుతాడు.
సీతాదేవి అలా వెళ్లిన తరువాత ఈ విషయం కౌసల్యాదేవికి తెలుస్తుంది. తమ వంశ కీర్తి ప్రతిష్ఠలు పెంచిన సీతను ఎలా అడవులకు పంపించావని రాముడిని నిలదీస్తుంది. వినయ విధేయతలలో .. పెద్దలను గౌరవించడంలో .. భర్త అడుగుజాడలలో నడవడంలో సీతను మించినవారు లేరని అంటుంది. సీత రాకతోనే అయోధ్యకు కళ వచ్చిందనీ, సీత అడుగుపెట్టడం వల్లనే అయోధ్య సుభిక్షంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. వెంటనే ఆమెను వెనక్కి రప్పించమని అంటుంది.
సీత గర్భవతి, అలాంటి ఆమెను అడవులకు పంపించి అందరికంటే ఎక్కువగా బాధపడుతున్నది తానేనని రాముడు అంటాడు. సీతను విడిచి క్షణమైనా ఉండలేని తానే ఆమెను అడవులకు పంపించవలసి వస్తుందని ఏ రోజునా అనుకోలేదని చెబుతాడు. తనని వదిలి ఉండలేని సీతకు అసలు విషయం చెప్పకుండా ఆ అమాయకురాలిని వదిలేసి రమ్మనడానికి తాను ఎంతగా క్షోభ పడుతున్నది ఎవరికీ తెలియదని అంటాడు. రాజుగా ఒక నిర్ణయం తీసుకున్నాక, దానిని వెనక్కి తీసుకోకూడదనే విషయాన్ని స్పష్టం చేస్తాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 68 : Rama directs to drop Sita in forest
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.