Ramayanam – 86 : Lord Rama goes for yaga ashwa

లవకుశుల చేతిలో శత్రుఘ్నుడు, లక్ష్మణుడు ఇద్దరూ కూడా పరాజితులవుతారు. యాగాశ్వం, రాముడి సోదరులు మునికుమారుల అధీనంలోనే ఉంటారు. ఈ విషయం తెలిసి రాముడు ఆశ్చర్యపోతాడు. రావణుడిని, మేఘనాథుడిని ఎదిరించిన లక్ష్మణుడు మునికుమారులను ఎదురించి నిలవలేకపోవడం ఆయనను విస్మయానికి గురిచేస్తుంది. ఇక లవణాసురుడిని అత్యంత ధైర్యసాహసాలతో ఎదిరించిన శత్రుఘ్నుడు కూడా మునికుమారుల ధాటికి సొమ్మసిల్లడం ఆయనను అయోమయంలో పడేస్తుంది.

దాంతో రాముడు ఇక తనే నేరుగా వెళ్లి ఆ మునికుమారుల నుంచి యాగాశ్వాన్నీ, తన సోదరులను విడిపించాలని నిర్ణయించుకుంటాడు. అశ్వమేధయాగం నిర్వహిస్తున్న రాముడే స్వయంగా రంగంలోకి దిగుతుండటం పట్ల అంతా కూడా నివ్వెరపోతారు. ఈ సమస్యకి ఇంతకు మించిన పరిష్కారం మరొకటి లేదని భావించిన రాముడు, సైన్యం వెంటరాగా ఆ మునిబాలకులు ఉండే ప్రాంతానికి బయల్దేరతాడు. ఎంతో సుకుమారంగా అనిపించే ముని బాలకులు, విలువిద్యలో ఇంతటి నైపుణ్యాన్ని ఎలా కనబరుస్తున్నారనే విషయంపైనే రాముడి ఆలోచనలు సాగుతుంటాయి.

అయోధ్యలోని అంతఃపురంలో కౌసల్యాదేవి ఆందోళన చెందుతూ ఉంటుంది. ఎవరో మునికుమారులు అశ్వాన్ని బంధించడమేమిటి? వాళ్లు లక్ష్మణ శత్రుఘ్నులను సైతం ఎదిరించడం ఏమిటి? స్వయంగా రాముడే బయల్దేరి వెళ్లడం ఏమిటి? అనే ఆలోచనలు ఆమెను కలవరపాటుకు గురిచేస్తూ ఉంటాయి. దాంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోననే ఆందోళనకు ఆమె లోనవుతుంది. కూతురైన శాంత ఆమెకు ధైర్యం చెబుతుంది.

రాముడి రథం అడవుల గుండా సాగుతూ ఉంటుంది. ఆ అడవులు చూడగానే ఆయనకి మనసంతా అదోలా అవుతుంది. మనసులో ఏదో తెలియని అలజడి కలుగుతూ ఉంటుంది. ప్రకృతి సోయగాలు తన మనసుకు ఎంతమాత్రం ఆనందాన్ని కలిగించకపోవడాన్ని ఆయన గమనిస్తాడు. అలా అనేక ఆలోచనలు ఆయనను ముసురుతూ ఉండగానే, లవకుశులున్న ప్రదేశానికి రాముడు చేరుకుంటాడు. యాగాశ్వం ఒక చెట్టుకు కట్టబడి ఉండటాన్ని చూస్తాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 86 : Lord Rama goes for yaga ashwa

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: