Ramayanam – 57 : Rama kills Kumbhakarna

వానర వీరులు, రాక్షసులు భీకరంగా యుద్ధం చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ ప్రదేశమంతా అదురుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుకు కారణం ఏమై ఉంటుందా అని రామలక్ష్మణులు ఆలోచన చేస్తుంటారు. ఒక భీకరమైన ఆకారం పెద్ద పెద్ద అంగాలు వేస్తూ అటుగా రావడం చూస్తారు. వచ్చేది కుంభకర్ణుడని విభీషణుడు చెబుతాడు. కుంభకర్ణుడు మహాబలవంతుడనీ, ఆయనను అంతం చేయడం ఆలస్యమైతే, వానర వీరులను పెద్ద సంఖ్యలో కోల్పోవలసి వస్తుందని హెచ్చరిస్తాడు. దాంతో రామలక్ష్మణులు అప్రమత్తమవుతారు.

కుంభకర్ణుడు వస్తూ వస్తూనే వానర వీరులపై పడతాడు. పెద్ద పెద్ద బండరాళ్లను ఎత్తి వానరులపై విసురుతూ ఉంటాడు. వృక్షాలను పెకిలించి వాటిని వానరులపై పడేస్తుంటాడు. ఆయన పాదాల క్రిందపడి చాలామంది వానరులు నలిగిపోతుంటారు. తన బాహువులతో బంధించే ఆయన చాలా మంది వానర వీరులను చంపేస్తూ ఉంటాడు. వానర వీరులు సైతం ఆయనను కట్టడి చేయలేకపోతారు. లక్ష్మణుడు ఆయనపైకి వరస బాణాలు వదులుతాడు. ఆ బాణాల గాయాలు ఆయనను ఏమీ చేయలేకపోతాయి.

వానరులు విసిరే బలమైన ఆయుధాలు, పదునైన ఆయుధాలు కుంభకర్ణుడిని తాకి నేల రాలిపోతుంటాయి. ఆయన కాళ్లపై గదలతో వానరులు అదే పనిగా మోదుతుంటారు. అంతటి బలమైన దెబ్బలను కూడా ఆయన పెద్దగా పట్టించుకోకుండా, వాళ్లను తొక్కుకుంటూ ముందుకు వెళుతుంటాడు. ఇక ఉపేక్షించి లాభం లేదని భావించిన రాముడు, కుంభకర్ణుడిపై బాణ ప్రయోగం చేస్తాడు. ఆ బాణం తగలడమే ఆలస్యం, మొదలు నరికిన తాటి చెట్టులా కుంభకర్ణుడు కూలిపోతాడు.

కుంభకర్ణుడు మరణించగానే వానరులంతా ఆనందంతో గంతులు వేస్తారు. భయంతో తమని పరుగులు పెట్టించిన కుంభకర్ణుడు చనిపోవడంతో వాళ్లంతా తేలికగా ఊపిరి పీల్చుకుంటారు. కుంభకర్ణుడి మరణవార్త రావణుడికి తెలుస్తుంది. దాంతో ఆయన ఆవేదన చెందుతాడు. నిద్ర మధ్యలో తన సోదరుడిని యుద్ధానికి పంపించినందుకు ఎంతగానో బాధపడతాడు. మహా బలవంతుడైన తన సోదరుడిని కడతేర్చిన రామలక్ష్మణులకు తన కుమారుడైన ఇంద్రజిత్తు తగిన గుణపాఠం చెప్పగలడని భావించి ఆయనను రంగంలోకి దింపుతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 57 : Rama kills Kumbhakarna

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: