Ramayanam – 50 : Rama tells to prepare for war
అంగదుడు ఎన్నిరకాలుగా చెప్పినా ఆ మాటలను రావణుడు చెవికి ఎక్కించుకోడు. రాముడు మహాపరాక్రమవంతుడే అయితే, ఇన్నిమార్లు ఇంత మందితో సంధి ప్రయత్నాలు చేయడం ఎందుకని రావణుడు అడుగుతాడు. ఇల్లు అలకగానే పండగ కాదనీ, సముద్రం దాటగానే విజయం వరించదని అంటాడు. ఇంద్రాది దేవతలపై యుద్ధం చేసిన రావణుడిని కవ్వించడం అవివేకమని చెబుతాడు. రామలక్ష్మణులను నమ్ముకుని వానరులంతా వెంట రావడం వాళ్ల అమాయకత్వానికి నిదర్శనమని అంటాడు.
ఇలాంటి రామలక్ష్మణులు వేల సంఖ్యలో వచ్చినా తాను ఇదే సమాధానం చెబుతానని అంటాడు. రావణుడు తన పరాక్రమాన్ని నమ్ముకుని ముందుకు వెళతాడనీ, బెదిరింపులకు భయపడి వెనకడుగు వేయడం రావణుడికి తెలియదని చెబుతాడు. రావణుడి సేనలు ఏ స్థాయిలో ముందుకు కదులుతాయి? రావణుడు యుద్ధరంగంలోకి దిగితే ఎలా ఉంటుంది? అనే విషయాలపై ఎలాంటి అవగాహన లేకుండా కాలు దువ్వుతున్న వానర వీరులను చూస్తుంటే తనకి జాలి కలుగుతుందని చెబుతాడు.
యుద్ధం రామలక్ష్మణులకు కొత్త కావొచ్చును గానీ, తనకి కాదని రావణుడు అంటాడు. తన ఆయుధాగారం, తన సైనిక బలం గురించి వాళ్లు తక్కువగా అంచనా వేయడమే ఇందుకు కారణమనే విషయం తనకి తోస్తుందని చెబుతాడు. వానర వీరుల దగ్గర ఉన్న అస్త్రాలన్నీ వృథా చేయడానికి తన కుమారుడు ఇంద్రజిత్తు ఒక్కడు సరిపోతాడని అంటాడు. తన సోదరుడైన కుంభకర్ణుడు యుద్ధ రంగంలో అడుగుపెడితే, వానరులెవరూ ఇకపై యుద్ధం ఊసు ఎత్తరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఏ క్షణంలో యుద్ధం మొదలుపెట్టినా తిప్పికొట్టడానికి రావణుడి సేనలు సిద్ధంగానే ఉన్నాయని తేల్చి చెబుతాడు.
వినాశ కాలం దాపరించిన్నప్పుడు ఎవరేమీ చెప్పినా తలకెక్కదని తనకి అర్థమైందని అంగదుడు అంటాడు. రామలక్ష్మణుల శౌర్యం, వానరవీరుల బలపరాక్రమాలను గురించి తెలియక అతను అలా మాట్లాడుతున్నాడనే విషయం తనకి అర్థమైందని చెబుతాడు. యుద్ధం మొదలైన తరువాత అతనికి ఈ విషయం అంచెలంచెలుగా బోధపడుతుందని తాను భావిస్తున్నానని అంటాడు. రాముడి బాణాలకు బలి ఇవ్వడానికి లంకను సిద్ధం చేయమని చెప్పి వెనుదిరుగుతాడు. అలా అక్కడి నుంచి తిరిగొచ్చిన అంగదుడు, జరిగిందంతా తమ వారికి వివరిస్తాడు. ఇక రావణుడికి మాటలతో చెబితే అర్థం కాదని భావించిన రాముడు, యుద్ధానికి సిద్ధంకమ్మని ఆదేశిస్తాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 50 : Rama tells to prepare for war
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.