Ramayanam – 51 : Ravana’s magic with Rama body
రామలక్ష్మణులు సువేల పర్వతంపై వానర వీరులతో ఉంటారు. ఏ క్షణంలోనైనా వాళ్లు విరుచుకుపడవచ్చును గనుక, ఈ లోగా సీత మనసు మార్చేయాలని రావణుడు అనుకుంటాడు. తన మాయోపాయంచే రాముడిని సంహరించినట్టుగా సీతకి చెప్పాలనుకుంటాడు. తన మాటలు ఆమె నమ్మదు గనుక, తన మాయతో ఖండించబడినట్టుగా కనిపించే రాముడి శిరస్సును సృష్టించి సీతను భయపెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఆ విధంగా చేయడం వలన సీత తన అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉందని భావిస్తాడు.
అశోకవనంలో సీతాదేవి ఒంటరిగా శ్రీరాముడిని తలచుకుంటూ కూర్చుని ఉంటుంది. అదే సమయంలో రావణుడు అక్కడికి వస్తాడు. సీత తన మనసు మార్చుకునే సమయం వచ్చిందని అంటాడు. ఏ రాముడైతే వచ్చి తనని కాపాడతాడని ఆమె ఎంతో ఆశతో ఎదురుచూస్తుందో ఆ రాముడే లేడని పెద్దగా నవ్వుతాడు. ఆ మాటకు సీతాదేవి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఆమె తీవ్రమైన కలవరపాటుకు లోనవుతుంది. ఆమె మనసు సముద్రంలా అల్లకల్లోల మవుతుంది. ఆమె కళ్లు కన్నీటి సరస్సులవుతాయి. అయినా రావణుడి వైపు కన్నెత్తి చూడకుండా అలాగే ఉండిపోతుంది.
పాపం రాముడు తనపై యుద్ధం చేయడానికి వచ్చాడనీ, కానీ ఇలా ప్రాణాలను కోల్పోతానని ఆయన ఊహించి ఉండడని రావణుడు అంటాడు. హనుమంతుడికీ, అంగదుడికి తాను ముందుగానే చెప్పి పంపించాననీ, వాళ్లు వినిపించుకోకపోవడం తన తప్పుకాదని చెబుతాడు. రామలక్ష్మణులు లంకానగరం ద్వారం దాటి రాలేరని ఆమెకి కూడా తాను ముందుగానే చెప్పాననీ, ఆమె కూడా తన శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసిందని అంటాడు. ఆమెకి ఈ విషయం బాధ కలిగిస్తుందని తెలిసినా చెప్పక తప్పడం లేదని అంటాడు.
తన సైన్యం ఒక్కసారిగా రామలక్ష్మణులపై విరుచుకు పడిందనీ, రాముడి శిరస్సును తమవాళ్లు ఖండించారని చెబుతాడు. రాముడిని కాపాడటానికి ప్రయత్నించిన వానర వీరులంతా చనిపోయారని అంటాడు. తన మాటలను ఆమె కొట్టిపారేస్తుందని తనకి తెలుసుననీ, అందువల్లనే ఆధారాలతో సహా వచ్చానని చెప్పి, ఖండించినట్టుగా కనిపించే రాముడి శిరస్సును ఆమెకి చూపుతాడు. అది చాలా సహజంగా ఉండటంతో, సీతాదేవి నిర్ఘాంతపోతుంది. ఒక్కసారిగా కూర్చున్న చోటునే కూలబడిపోతుంది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 51 : Ravana’s magic with Rama body
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.