Ramayanam – 59 : Ravana’s son Indrajit killed

ఇంద్రజిత్తుకి బ్రహ్మదేవుడు ఒక రథాన్ని వరంగా ఇస్తాడు. ఇంద్రజిత్తు ఆ రథాన్ని అధిరోహించాలంటే ముందుగా ఆయన నికుంభిల హోమం పూర్తిచేయవలసి ఉంటుంది. అలా హోమం చేసి ఆ రథాన్ని అధిరోహించిన ఇంద్రజిత్తును ఎవరూ జయించలేరు. రామలక్ష్మణులను ఎదిరించడం కోసం ఇంద్రజిత్తు నికుంభిల హోమం చేయడం మొదలు పెడతాడు. ఈ విషయాన్ని గ్రహించిన విభీషణుడు, ఆ మాటను రామలక్ష్మణులకు చెబుతాడు. ఇంద్రజిత్తు ఆ హోమం పూర్తిచేస్తే కష్టమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు.

ఆ మాట వినగానే లక్ష్మణుడు తాను వెళ్లి ఇంద్రజిత్తును హతమారుస్తాననీ, అందుకు అనుమతిని ఇవ్వమని కోరతాడు. రాముడు అందుకు అంగీకరించడంతో, ఆయన ఆశీస్సులు అందుకుని విభీషణుడితో కలిసి బయల్దేరతాడు. హనుమంతుడు, అంగదుడు కూడా వాళ్లను అనుసరిస్తారు. ఒక గుహలో రహస్యంగా కూర్చుని ఇంద్రజిత్తు నికుంభిల హోమం చేస్తూ ఉంటాడు. ఆయన ఆ హోమం చేయకుండా వాళ్లు అవరోధాన్ని కల్పిస్తారు. దాంతో ఆగ్రహావేశాలకు లోనైన ఇంద్రజిత్తు వాళ్లతో యుద్ధానికి దిగుతాడు.

హనుమంతుడితో కొంతసేపు యుద్ధం చేసిన ఇంద్రజిత్తు, ఆ తరువాత లక్ష్మణుడిపై బాణాల వర్షాన్ని కురిపించడం మొదలు పెడతాడు. కంటికి కనిపిస్తూ యుద్ధం చేయడం వీరుని లక్షణమనీ, ఆకాశంలో దోబూచులాట ఆడుతూ యుద్ధం చేయడం పిరికివారి లక్షణమని లక్ష్మణుడు అంటాడు. దాంతో లక్ష్మణుడి ఎదురుగా వచ్చి ఇంద్రజిత్తు యుద్ధం చేయడం మొదలుపెడతాడు. ఇద్దరి మధ్య పోరు భీకరంగా సాగుతుంటుంది. లక్ష్మణుడు తన దగ్గర గల ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించడం వలన, ఇంద్రజిత్తు చైతన్యాన్ని కోల్పోతాడు.

అది గమనించిన విభీషణుడు ఇక ఆలస్యం చేయకుండా వరుస బాణాలను వదలమని చెబుతాడు. దాంతో లక్ష్మణుడు తన సోదరుడైన రాముడిని మనసులో తలచుకుని, తన సోదరుడు ధర్మపరుడే అయితే ఈ బాణం ఇంద్రజిత్తును సంహరించాలని మనసులో అనుకుని వదులుతాడు. అంతే ఆ బాణం నేరుగా వెళ్లి ఇంద్రజిత్తు శిరస్సును ఖండిస్తుంది. మాయా యుద్ధంతో వానర సేనలను ముప్పతిప్పలు పెట్టిన ఇంద్రజిత్తు మరణం, వాళ్లందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వానర వీరులు జేజేలు పలుకుతూ లక్ష్మణుడిని రాముడి దగ్గరకు తీసుకొస్తారు. ఆయన లక్ష్మణుడిని ఎంతగానో అభినందిస్తాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 59 : Ravana’s son Indrajit killed

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: