Ramayanam – 61 : Sita agnipravesh

రావణాసురుడు సంహరించబడటంతో వానరులంతా సంబరాలు జరుపుకుంటారు. ఒక అధ్యాయం ముగిసిందన్నట్టుగా రామలక్ష్మణులు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. విభీషణుడి పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతాయి. రామలక్ష్మణులు దగ్గరుండి పట్టాభిషేక కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు. ఆ తరువాత విభీషణుడి ఆదేశం మేరకు అంతఃపుర కాంతలు సీతాదేవిని అక్కడికి తీసుకొస్తారు. ఆమెను చూడగానే రాముడు ఉద్వేగానికి లోనవుతాడు. రాముడు కనిపించగానే సీతాదేవి కన్నీళ్ల పర్యంతమవుతుంది.

రాముడు తన దగ్గరికి వచ్చి తనని ఆత్మీయంగా స్పర్శించి, తీసుకువెళతాడని సీతాదేవి భావిస్తుంది. కానీ రాముడు అక్కడే ఆసీనుడై ఉంటాడు. సీతను రక్షించడం కోసం మాత్రమే తాను వచ్చాననీ, ఆమెను తిరిగి స్వీకరించడం కోసం కాదని రాముడు అంటాడు. ఆ మాట వినగానే సీతాదేవి పిడుగుపాటుకు లోనవుతుంది. లక్ష్మణుడితో సహా వానరులంతా నివ్వెరపోతారు. విభీషణుడు కూడా ఆశ్చర్యపోతాడు. తాను స్పృహలో ఉండే మాట్లాడుతున్నానని రాముడు అంటాడు. భార్యను రక్షించడం భర్త ధర్మం, అందువలన ఆమెను రక్షించానని చెబుతాడు. ఇకపై ఆమె తనకి నచ్చిన చోటున తన జీవితాన్ని కొనసాగించవచ్చని అంటాడు.

సీతాదేవి కన్నీళ్ల పర్యంతమవుతుంది. తాను రావణుడి నగరంలో ఉన్నప్పటికీ, తన మనసు ఎప్పుడూ కూడా రాముడిని గురించే ఆలోచించిందని అంటుంది. తన భర్త తన గుణ విశేషాలను శంకిస్తున్నప్పుడు, తాను జీవించి ఉండటంలో అర్థం లేదని చెబుతుంది. వెంటనే చితిని పేర్చమనీ తనకి అగ్ని ప్రవేశమే తప్ప మరో మార్గమే లేదని సీతాదేవి అంటుంది. రాముడి మౌనం అందుకు అంగీకారమని భావించిన లక్ష్మణుడు అలాగే చేస్తాడు. జరుగుతున్నదంతా చూస్తూ, ఏమీ చేయలేక వానర వీరులంతా అలా చూస్తుండిపోతారు.

తాను నిరంతరం తన భర్తను గురించి మాత్రమే ఆలోచన చేసినట్టయితే, ఆయన జ్ఞాపకాలతోనే ఇంతకాలం గడిపిన దానైతే, తన భర్త పట్ల మాత్రమే తనకి ప్రేమానురాగాలు కలిగి ఉన్నట్టయితే, ఆ అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక అంటూ సీతాదేవి అగ్నిప్రవేశం చేస్తుంది. ఆ మంటల్లో నుంచి అగ్నిదేవుడు సీతను వెంటబెట్టుకుని బయటికి తీసుకువస్తాడు. సీతాదేవి మహా పతివ్రత అనీ, ఆమె యందు ఎలాంటి సందేహం అవసరం లేదని అగ్నిదేవుడు చెబుతాడు. ఆ విషయం తనకి తెలుసుననీ, ఈ లోకానికి తెలియజెప్పడం కోసమే అలా చేశానని సీతాదేవిని రాముడు అక్కున చేర్చుకుంటాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 61 : Sita agnipravesh

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: