Ramayanam – 69 : Sita sadness
లక్ష్మణుడు రథంపై వనాలలోకి తీసుకువెళుతూ ఉంటే ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగాడుతున్న వన్యప్రాణులను, పక్షులను చూసి సీతాదేవి సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. అయితే లక్ష్మణుడు ముభావంగా ఉండటం ఆమెకి అనుమానాన్ని కలిగిస్తుంది. అలా ఉండటానికి కారణం అడిగితే, మరేమీ లేదంటూ ఆయన దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఉంటాడు. రథం రాజ్యానికి దూరంగా, సుందర వనాలను విడిచి దట్టమైన అడవీ మార్గంలో వెళుతూ ఉండటం గమనించిన సీతాదేవి ఆందోళన చెందుతుంది.
కారడవులలోకి తాము వెళుతున్న విషయాన్ని లక్ష్మణుడికి సీత గుర్తుచేస్తుంది. రాముడు ఆమెను కారడవులలోనే దింపేసి రమ్మన్నాడంటూ లక్ష్మణుడు అసలు విషయం చెబుతాడు. అందుకు గల కారణాన్ని వివరిస్తాడు. జరిగింది తెలుసుకున్న సీతాదేవి శోకంలో మునిగిపోతుంది. రాముడు తనకి అసలు విషయం చెప్పకుండా పంపించడమే తనకి బాధను కలిగిస్తోందనీ, ఆయన తన ఉద్దేశాన్ని తనతో చెప్పేసి ఉంటే, ఆయన ఎలా చేయమంటే అలా చేసేదానినని అంటుంది.
రఘువంశ కీర్తి ప్రతిష్ఠలు కాపాడవలసిన బాధ్యత తనకి కూడా ఉందనీ, రాముడి నిర్ణయాన్ని తాను ఎలాంటి పరిస్థితుల్లోను కాదనే దానిని కానని అంటుంది. గర్భవతి అయిన ఇల్లాలిని అడవులలో ఒంటరిగా వదిలేయడం న్యాయమా? అని అడుగుతుంది. ఇంతకన్నా తనని అగ్నిలో దూకమని అంటే బాగుండేదని వాపోతుంది. గర్భవతిగా ఉన్న తాను పుట్టింటికి కూడా వెళ్లకుండా రాముడి పాదాలను ఆశ్రయించి ఉన్నందుకు తనకి చేసిన మేలు ఇదేనా? అని ప్రశ్నిస్తుంది. అడవులలో వదిలేసినందుకు తాను బాధపడటం లేదనీ, అపవాదువేసి వదిలి వెళుతున్నందుకు బాధగా ఉందని చెబుతుంది.
రాముడిని విడిచి తాను బ్రతుకలేననీ, తన ఆయువు తీరడం వల్లనే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని సీతాదేవి అంటుంది. దాంతో ఆమె ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందోనని లక్ష్మణుడు ఆందోళన చెందుతాడు. ఆమె తొందరపాటుతో ఏ నిర్ణయం తీసుకున్నా రాముడు పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటాయని అంటాడు. అందువలన సహనంతో మసలుకుంటూ, ఆమెపై పడిన అపవాదులో సత్యం లేదనే విషయాన్ని లోకం అర్థం చేసుకునేంతవరకూ ఓపిక పట్టమని కోరతాడు. ఆమె దగ్గర సెలవు తీసుకొని వెనుదిరుగుతాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 69 : Sita sadness
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.