Ramayanam – 89 : Sita thanks Valmiki maharshi
రాముడు తన బిడ్డలైన లవకుశులను దగ్గరకి తీసుకుంటాడు. తొలిసారిగా వాళ్లు తండ్రి అక్కున చేరతారు. తండ్రి స్పర్శ చేత వాళ్లు ఆనందానుభూతులు పొందుతారు. లవకుశులు తమ తండ్రి అక్కున చేరడం చూసి సీతమ్మ ఆనందంతో పొంగిపోతుంది. లవకుశులు తమ తండ్రి చెంతకు చేరుకోవాలని ఎంతోకాలంగా తాను కంటున్న కల నిజమైనందుకు పొంగిపోతుంది. తన ఆశ నెరవేరేలా చేసిన భగవంతుడికి మనసులోనే ఆమె కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.
అయోధ్య నుంచి నిండు గర్భవతిగా తాను అడవులకు రావడం .. ఒంటరిగా అడవులలో ఆకలి దప్పులతో అలమటిస్తున్న తనకి వాల్మీకి మహర్షి ఆశ్రయాన్ని ఇవ్వడం .. తాను సీతాదేవిననే విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఆయన తనకి రక్షణ కల్పించడం .. అక్కడి ఆశ్రమవాసంలో నిరంతరం రామనామం తన మనసు కుదుటపడేలా చేయడం .. లవకుశులు జన్మించడం .. వాళ్ల ఆలనాపాలనా .. రామాయణ కథాకావ్యాన్ని వాళ్లు గానం చేయడం అవన్నీ ఆమె కళ్ల ముందు కదలాడతాయి.
ఇన్ని కష్టాలలలో తనకి ధైర్యం చెబుతూ నిలిచిన వాల్మీకి మహర్షికి ఆమె మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. ఆమె అలా తలచుకుంటూ ఉండగానే అక్కడికి వాల్మీకి మహర్షి వస్తాడు. సీతారాములు ఆయనకి నమస్కరిస్తారు. సీతారాములను ఒక చోటున చూసిన ఆయన, అవ్యక్తమైన ఆనందానికి లోనవుతాడు. కారడవులలో ఒంటరిగా ఉన్న తనకి అండగా నిలిచిన ఆయనకి సీతమ్మ తల్లి ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదంతా కూడా రామయ్య అనుగ్రహమేనని వాల్మీకి మహర్షి సెలవిస్తాడు.
సీతాదేవి ఎంతటి మహా ఇల్లాలు అనే విషయం తనకి తెలుసుననీ, కానీ ఒక రాజుగా లోక నిందలకు గురికాకూడదనే ఉద్దేశంతోనే సీతాదేవి విషయంలో అలాంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని రాముడు చెబుతాడు. ధర్మం – ఆదర్శం ఈ రెండూ కూడా సీతారాములుగా ఉద్భవించాయనీ, వాళ్ల కారణంగా వాటి గొప్పతనం ఈ లోకానికి తెలిసిందని వాల్మీకి అంటాడు. కనుక జరిగినదానికి సీతారాములు చింతించవలసిన అవసరం లేదని చెబుతాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 89 : Sita thanks Valmiki maharshi
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.