Ramayanam – 53 : Vanar sena aggressive attack

రామలక్ష్మణులతో పాటు వానర వీరులంతా రావణ సైన్యంతో యుద్ధం చేస్తుంటారు. రావణ సైన్యంలో మహా బలవంతులైనవారిని ఎంచుకుని, ముందుగా వారిని సంహరించే ఆలోచనతో వానర వీరులు ముందుకు దూకుతుంటారు. పోరు భీకరంగా జరుగుతూ ఉంటుంది. ఒకవైపున వానర వీరులు గాయపడుతూ ఉండగా, మరో వైపున రాక్షస వీరులు నేలకి ఒరుగుతుంటారు. రాముడు ముందుగా చెప్పినట్టుగానే వానర వీరులు తమ సమూహాలను ధైర్యంగా ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఇక ప్రహస్తుడి ప్రణాళిక ప్రకారం రాక్షస వీరులు రంగంలోకి దిగుతూ ఉంటారు.

ఒక వైపున సుగ్రీవుడు .. మరో వైపున అంగదుడు .. వేరొక వైపున హనుమంతుడు రాక్షస వీరులపై విరుచుకుపడుతుంటారు. రాక్షసులు వారి ధాటికి తట్టుకోలేకపోతుంటారు. ఈ ముగ్గురు వానర వీరులు కూడా దొరికినవారిని దొరికినట్టుగా రెండు ముక్కలుగా విరిచేసి అవతల పారేస్తూ ముందుకు సాగుతుంటారు. వాళ్ల బల పరాక్రమాలను చూసి రాక్షసులు హడలిపోతుంటారు. తమ ఆయుధాలు వాళ్లని ఏమీ చేయలేకపోతుండటం చూసి ఆశ్చర్యపోతుంటారు.

వానర సైన్యమే కదా అవలీలగా తరిమికొట్టవచ్చుననుకుని రంగంలోకి దిగిన రాక్షసులకు చుక్కలు కనిపిస్తాయి. వాళ్లు సాధారణ వానరాలు కాదనీ, అందువల్లనే తాము వాళ్లని ఎదిరించి నిలవలేకపోతున్నామని రాక్షసులు భావిస్తారు. వానర వీరులు అవలీలగా బండరాళ్లను ఎత్తుతుండటం .. రథాలను సైతం ముక్కలుగా విరిచేస్తుండటం .. ఏనుగులకు సైతం ఇబ్బందిని కలిగిస్తుంటడం .. గుర్రాలను చీకాకు పరచడం చూసి రాక్షసులు నివ్వెరపోతారు. వానరులను నిలువరించడం కష్టమనే విషయం వాళ్లకి అర్థమైపోతుంది.

చిన్న చిన్న రాక్షస వీరులు వానర వీరుల కాళ్ల క్రిందపడి నలిగిపోతుంటారు. రాక్షసులకు ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా వానరులు దాడి చేస్తుంటారు. వానర వీరుల విజృంభణ కారణంగా ఆ ప్రాంతమంతా దుమ్ముధూళితో కప్పబడిపోతుంది. అసలు ఏం జరుగుతుందో తెలియని అయోమయానికి రాక్షసులు లోనవుతారు. విషయం తెలుసుకున్న రావణుడు, పథకం ప్రకారం తరువాత వరుసలోని రాక్షస వీరులను పంపించమని ప్రహస్తుడిని ఆదేశిస్తాడు. అదే విధంగా తన సోదరుడైన కుంభకర్ణుడిని నిద్రలేపమని మరి కొంతమంది సైనికులకు చెబుతాడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Ramayanam – 53 : Vanar sena aggressive attack

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2023 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2023 – Panchangam – App on Apple App Store

Categorized in: