Ramayanam – 55 : Vanar sena kills demons
ఒక వైపు నుంచి వానర వీరులు రాక్షసులను సంహరిస్తూనే, మరో వైపు నుంచి లంకానగరాన్ని చుట్టుముడుతూ ఉంటారు. ఇటు వానర వీరులలో కొందరు, అటు రాక్షసులలో కొందరు తీవ్రంగా గాయపడతారు. వానరసేన మున్ముందుకు వస్తుండటంతో రావణుడి వైపు నుంచి ధూమ్రాక్షుడు, వజ్రదంష్ట్రుడు, అకంపనుడు ఒకరి తరువాత ఒకరుగా యుద్ధభూమిలోకి దిగుతారు. వారి పరాక్రమాన్ని చూసి ముందుగా వానరులు భయపడతారు. కానీ రాముడిని తలచుకుని ధైర్యంగా ముందుకు దూకుతారు.
అలా హనుమంతుడి చేతిలో ధూమ్రాక్షుడు, అకంపనుడు .. అంగదుడి చేతిలో వజ్ర దంష్ట్రుడు ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఈ మహావీరులు నేల కూలారని తెలియగానే రావణుడు నివ్వెరపోతాడు. ఎంతోమంది మహాయోధులను మట్టి కరిపించగలిగే వీరులు వానరుల చేతిలో ప్రాణాలు పోగొట్టుకోవడం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొదటిసారిగా ఆయనకి వానరవీరుల పరాక్రమం పై నమ్మకం పెరుగుతూ ఆందోళన మొదలవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగమని సైన్యాధిపతి అయిన ప్రహస్తుడిని ఆదేశిస్తాడు.
రావణుడికి అనేక విజయాలను తెచ్చిపెట్టిన ప్రహస్తుడు, ఆయన ఆదేశించడమే ఆలస్యం రంగంలోకి దిగుతాడు. యుద్ధం ఎలా మొదలు పెట్టాలో .. ఎవరిని ముందుగా లక్ష్యంగా చేసుకుని ఎటువైపు నుంచి సంహారాన్ని చేస్తూ వెళ్లాలో ఆయనకి బాగా తెలుసు. ఒక వైపు నుంచి తాను యుద్ధం చేస్తూనే, మరో వైపు నుంచి తన సైన్యంలో ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు పరిగెత్తించడంలో ఆయన ఆరితేరినవాడు. శత్రువులు తమ వ్యూహాన్ని మార్చుకునేలోగానే కడతేర్చడంలో సిద్ధహస్తుడు. అలాంటి ప్రహస్తుడు మెరుపు వేగంతో యుద్ధభూమిలోకి ప్రవేశిస్తాడు.
ప్రహస్తుడు వస్తూ వస్తూనే తన యుద్ధ నైపుణ్యాన్ని చూపడం మొదలుపెడతాడు. ఆయన పరాక్రమానికీ ఆయుధాలను ఉపయోగించే నేర్పుకు వానరులు తట్టుకోలేక కకావికలమై పోతుంటారు. ప్రహస్తుడి యుద్ధ నైపుణ్యాన్ని గురించి రామలక్ష్మణులకు విభీషణుడు వివరిస్తాడు. దాంతో ప్రహస్తుడి విషయంలో వానర వీరులను రామలక్ష్మణులు అప్రమత్తం చేస్తారు. దాంతో వాళ్లంతా కూడా ప్రహస్తుడిపై దృష్టి పెడతారు. ఆయన వలన వానరవీరుల సంఖ్య తగ్గకుండా నియంత్రం చేయడం మొదలుపెడతారు. తన ధైర్యసాహసాలతో వానరులతో గగ్గోలు పెట్టించిన ప్రహస్తుడు, చివరికి నీలుడు చేతిలో ప్రాణాలు వదులుతాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ధర్మాన్ని ఆచరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గమే “రామాయణం”. ఆ రామాయణంని ఎంతోమంది కవులు,రచయితలు తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివినవి కొన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో అందించడానికి చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Ramayanam – 55 : Vanar sena kills demons
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.