Telugu Yearly Horoscope 2025 ఆంగ్ల నూతన సంవత్సరం సందర్బంగా 12 రాశుల వారికి రాబోయే పన్నెండు నెలల్లో జన్మ తేది/సూర్య రాశి ప్రకారం ఈ సంవత్సర రాశి ఫలాలు (Yearly Horoscope in Telugu) ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. 2025 Yearly rasi phalalu for all 12 zodiac signs.

మేషం (21 మార్చ్ – 19 ఏప్రిల్)

సంవత్సర ప్రారంభం నుండి కూడా అన్ని విధాలా చక్కటి అభివృద్ధి మరియు చక్కటి మార్పులు వీరు గమనించవచ్చు. ఆర్దికపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు ఊహించినదానికన్నా అధికంగా ఆదాయం సంపాదిస్తారు. విద్యార్థులు కలలు నెరవేరే సమయం. కొన్ని పనులు నత్తనడకన సాగినప్పటికీ లేదా పెండింగ్ పడినప్పటికీ సెప్టెంబర్ తర్వాత నుండి పుంజుకొంటాయి. స్థిరాస్తులు కొనాలనుకునే వారు ఈ సంవత్సరం ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏ వృత్తి లో ఉన్నా అవకాశాలని అందిపుచ్చుకొంటే చక్కటి విజయాలు నమోదు చేసుకోగలుగుతారు. వీరికి ప్రత్యేకమైన సూచన ఏమిటంటే అనవసరమైన విషయాలలో తలదూర్చడం వలన సమస్యలు ఎదురుకోవలసి వస్తుంది. ఈ విషయాన్నీ గుర్తుంచుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అలాగే ప్రతి చిన్న విషయానికి చికాకు కోపం తగ్గించుకోవడం మంచిది.

వృషభం ( 20 ఏప్రిల్- 20 మే)

శుభ అశుభ ఫలితాల మిశ్రమం గా ఉంటుంది. కొన్ని సందర్భాలలో సమస్యలు ఎదురైనప్పటికీ అలాగే పనులలో అవాంతరాలు ఎదురైనా ఎదురుకొని నిలబడగలుగుతారు. ముఖ్యం గా ఆర్థికపరంగా ఒడిదుడుకులు ఎదురుకోవలసి వస్తుంది. ఈ విషయం గమనించుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఖర్చులు నియంత్రణ లో ఉంచుకొని ఆచి తూచి ఆలోచించి అడుగు ముందుకు వేయడం మంచిది. ముఖ్యంగా షేర్లు స్పెక్కులేషన్స్ కి దూరంగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా పెద్దగా బాధించవు. మార్చ్ తర్వాత నుండి కొద్దిగా సమస్యల నుండి బయటపడగలిగే మార్గాలు కనబడతాయి. భవిష్యత్తు గురించి ఆలోచనలు అధికమవుతాయి. వీరు పాటించాల్సిన సూచన ఏమిటంటే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి ముఖ్యం గా దూరప్రయాణాలు. కోపాన్ని నియంత్రించుకొని, శాంతం గా ఉండే ప్రయత్నాలు చేయాలి.

మిథునం (21 మే – 20 జూన్)

ఈ సంవత్సరం చాలా మార్పులే సంభవిస్తాయి, అయితే అవి మంచి మార్పులే అవ్వడం విశేషం. కెరీర్ లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రొమోషన్స్ కి అవకాశం కలదు. విద్యార్థులు అనుకొన్నది సాధించగలుగుతారు, విదేశాలకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. వ్యక్తిగత జీవితం ఆనందం గా గడుస్తుంది. వీరు పాటించవలసిన సూచన ఏమిటంటే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఓర్పుని కోల్పోకండి అసంతృప్తి ని వదిలి పెట్టి వచ్చిన దానిని సాధించిన దానిని, ఉన్నదానిని ఆనందించడం ప్రారంభించండి. బుధవారం రోజు ఆవు కి పచ్చ గడ్డి తినిపించడం.

కర్కాటకం (21 జూన్ – 22 జులై)

కొద్దిగా కష్టపడగలితే చేస్తున్న వృత్తి లో తప్పకుండా మీరనుకొన్న విజయాలు సాధిస్తారు. అనుకోని ఖర్చులు అధికం గా ఉంటాయి, దీని వలన సమస్యలు ఆర్థికపరిస్థితి కొంత గందరగోళం గా తయారవుతుంది. ఎన్ని సమస్యలున్నా కుటుంబవ్యవహారాలు మీ బాధ్యతలు అన్ని కూడా ఆత్మవిశ్వాసం తో తట్టుకోగలుగుతారు. ఎక్కువగా ఆవేశపడి సంబంధాలని పాడు చేసుకోకపోవడం మంచిది. వీరు పాటించవలసిన సూచనలు రోడ్డు ప్రమాదాలు, గాయాలు, దెబ్బలు వంటి అవకాశాలు కలవు, కావున కొంత జాగ్రత్త వహించడం మంచిది. ప్రతి విషయం లో మీ మాటే నెగ్గించుకోవాలనే మొండితనం విడిచిపెట్టడం మంచిది. శనివారం రోజున శని గ్రహాన్ని పూజించడం మంచిది. గురువారం రోజున రావి చెట్టు కి పసుపు పూసి పూజించడం. ప్రతి నెల పౌర్ణమి రోజు చంద్రుడికి నీటి తో అర్ఘ్యం ఇచ్చి పూజించడం.

సింహం (23 జులై – 22ను ఆగష్టు)

పెద్దగా సమస్యలు ఏమి లేకుండా గడుస్తుంది, ఆశించనరీతిలో ఉద్యోగం లో ఎదుగుదల ఉంటుంది. కోరుకొన్న జాబ్ సాధించగలుగుతారు, వ్యాపారస్తులు కూడా అభివృద్ధి పథం లో సాగుతారు. ఆదాయం పెరగడం వలన పొదుపు చేయటం కూడా ప్లాన్ చేసుకొంటే మంచి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ, సంవత్సరం రెండో భాగం కొద్దిగా ఒడిదుడుకులు ఎదురుకోకతప్పదు. సమస్యలు మెల్లగా పెరిగే అవకాశం ఉంది. ఇది గమనించుకొని ఏ విషయాన్ని కూడా అశ్రద్ధ చేయకుండా ప్లాన్ చేసుకోవడం మంచిది. కానీ ఈ సమయం లో విదేశీ వ్యవహారాలు కలసి వస్తాయి. బంధువుల వలన కొద్దిగా మానసిక అశాంతి కి గురవుతారు. ఆరోగ్య విషయం లో అశ్రద్ధ వహించరాదు. ముఖ్యం గా పాటించవలసిన విషయాలు – ఆర్ధిక వ్యవహారాల లో తొందరపాటు వద్దు. కొత్త పరిచయాల విషయం లో జాగ్రత్త గా ఉండాలి. కొద్దిగా బెల్లం కుంకుమ కలిపి ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం మంచిది. స్నానం చేసే నీటి లో కొద్దిగా రోజ్ వాటర్ ని కలుపుకోవడమా మంచిది.

కన్య (23 ఆగష్టు – 22 అక్టోబర్)

ఇప్పటి వరకు ఏదైతే మిస్ అయ్యాం అనుకొంటున్నవన్నీ కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యం గా కెరీర్ కి సంబందించిన అవకాశాలు లభిస్తాయి వాటిని అంది పుచ్చుకొని ముందడుగు వేస్తే విజయం మీ సొంతమవుతుంది. కొంత రిస్క్ తీసుకొన్నా శుభఫలితాలు కలుగుతాయి. ప్రత్యర్థులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించినా విజయం సాధించలేరు. విదేశీ సంబంధమైన వృత్తులలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆదాయం ఉన్నప్పటికీ విపరీతమైన ఖర్చులు కూడా ఉంటాయి. దైవసంబంధిత కార్యక్రమాలలో తరచూ పాల్గొంటారు. కుటుంబంలో ఒక వ్యక్తి కొరకు డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. ముఖ్యం గా పాటించవలసిన సూచనలు – సంవత్సర రెండో భాగం లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొనే విషయం లో నిదానం వహించాలి. గురు గ్రహాన్ని పూజించడం వలన పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆవుకి గోధుమలు లేదా గోధుమ రొట్టెలు ఆహరం గా ఇవ్వడం, శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోసుకోవడం.

తుల (23 సెప్టెంబర్ – 22 అక్టోబర్)

ఉద్యోగస్తుల శ్రమని పనితనాన్ని పై స్థాయి వారు గుర్తిస్తారు, అందరి దగ్గర ప్రశంసలు అందుకొంటారు. ఎంత వేగం గా ప్రశంసలు అందుకొంటారో ఎక్కువ కాలం దీనిని ఆస్వాదించలేకపోతారు. ఎవరు ఏ వృత్తి లో ఉన్నా సవాళ్లు ఎదురుకోవలసి వస్తుంది. వీరి జీవితం లో ఈ సమయం లో చాలా మార్పులకి అవకాశం కలదు, మంచి చెడుల మిశ్రమం గా ఈ మార్పులు ఉంటాయి. పెట్టుబడుల విషయం లో జాగ్రత్త వహించాలి, రిస్క్ చేయడం తొందరపడటం మంచిది కాదు. సంవత్సరం ఆఖరు లో మీరు చేస్తున్న పనులలో విజయం సాధిస్తారు. సంబంధ బాంధవ్యాలు విషయం లో కొంత చికాకులు తప్పవు. ఏదైనా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొనేటప్పుడు తండ్రి సలహా కానీ లేక మీరు గురువు గా భావించే వారు పెద్దగా భావించే వారి సలహాలు తీసుకోవడం మంచిది. ముఖ్యం గా పాటించవలసిన సూచనలు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. ఎటువంటి సందర్భాలలో ఓర్పు ని కోల్పోకండి.

వృశ్చికం (23 అక్టోబర్ – 22 నవంబర్)

ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న పనులు, చేయాలనుకొన్న పనులు ఒకదాని తర్వాత ఒకటి పూర్తవుతూ వస్తాయి. ఆర్థికపరమైన అభివృద్ధి ఉంటుంది. ముఖ్యం గా వైవాహిక జీవితం ఆనందం గా ఉంటుంది. అన్నిట్లోనూ తమదైన ముద్రవేసుకొని విజయం సాధిస్తారు. మార్చి తర్వాత ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మానసికంగా కూడా కొంత ఒడిదొడుకులు ఏర్పడుతాయి. ఖర్చులు కూడా అధికమవుతాయి, లైఫ్ స్టైల్ లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైన నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. సంవత్సరం రెండో భాగం లో కుటుంబం లో చికాకులు కూడా పెరిగే అవకాశం కలదు, ఎదో ఒక విషయం మిమ్మల్ని కలచి వేస్తుంది, మీ ప్రమేయం లేకుండానే ఒక సమస్యలో ఇరుక్కొని అవకాశం కలదు. ముఖ్యంగా పాటించవలసిన సూచనలు – ఆహారపు అలవాట్లు అదుపులో ఉంచుకోవాలి ముఖ్యం గా జీర్ణ వ్యవస్థని నియంత్రణ లో ఉంచాలి. వృత్తిరీత్యా అవకాశాలని వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

ధనుస్సు (23 నవంబర్ – 22 డిసెంబర్)

మొదట్లో వృత్తికి సంబందించిన ఒడిదుడుకులు ఉంటాయి, రకరకాల సమస్యల్ని ఎదురుకోవలసి వస్తుంది. సమస్యల వలయంలా కనిపిస్తుంది, అయినప్పటికీ ముందు జాగ్రత్త గా ఆలోచించి జాగ్రత్తగా ముందడుగు వేయవలసి ఉంటుంది. స్థిరాస్తులు కొనే అవకాశాలు లభిస్తాయి, ఆర్ధికం గా మంచి అభివృద్ధి ఉంటుంది. మే తర్వాత పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఉద్యోగస్తులు అత్యుత్తమ ప్రతిభ ని కనబరుస్తారు. వ్యాపారస్తులు అన్ని సందర్భాలలో వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. క్రమం గా సమయం గడిచే కొద్దీ అన్ని వ్యవహారాలలో మంచి మార్పులు వచ్చి అన్నిట్లోనూ మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ముఖ్యం గా పాటించవలసిన సూచనలు – ఆరోగ్య విషయం లో జాగ్రత్త గా వ్యవహరించాలి.

మకరం (23 డిసెంబర్ – 22 జనవరి)

అన్ని రకాలుగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో ఊహించని రీతిలో విజయాలు అందుకొంటారు. మొదట్లో ఆర్ధికపరమైన సమస్యలు ఉన్నప్పటికీ క్రమంగా ఆదాయం పెంచుకోగలుగుతారు. ముఖ్యం గా ప్రభుత్వ సంబంధిత పనులు చేసేవారికి ఆదాయ వృద్ధి ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందం గా గడుస్తుంది. ఎప్పటి నుండో బాధపడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.
కొత్తగా చేపట్టిన పనులను ఎంతో ఉత్సాహం గా చేస్తారు. ముఖ్యంగా పాటించవలసిన సూచనలు – వ్యాపారస్తులు మరింత కష్టపడవలసి సమయం. ఉద్యోగస్తులు కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఎదురుచూడకుండా చేస్తున్న దాని మీదే ఫోకస్ చేయడం మంచిది.

కుంభం (23 జనవరి – 22 ఫిబ్రవరి)

చేపట్టిన అన్ని పనులు విజయవంతం గా పూర్తి చేయగలుగుతారు, ఎటువంటి పనినైనా చాకచక్యం గా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయాలలో చికాకులు ఉంటాయి, మానసిక అశాంతి ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్దలకి అవకాశం కలదు. సంవత్సర రెండవ భాగం లో పెట్టుబడుల విషయం లో తొందరపాటు పనికిరాదు, ఏ మాత్రం అజాగ్రత్త తో వ్యవహరించినా నష్టపోవలసి ఉంటుంది. అనుకోని ఖర్చులకి సిద్ధంగా ఉండడం మంచిది. ముఖ్యం గా పాటించవలసిన సూచనలు – అనవసరమైన రిస్క్ లకి దూరం గా ఉండడం మంచిది. ఆరోగ్య విషయం లో జాగ్రత్త వహించాలి.

మీనం (23 ఫిబ్రవరి – 20 మార్చ్)

కెరీర్ లో చక్కగా రాణిస్తారు. మీదైన ముద్రవేసుకొని అన్నిట్లో విజయం సాధిస్తారు. అందరితో సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలి. మీ లైఫ్ స్టైల్, ఆర్థిక విషయాలు చక్కగా ప్లాన్ చేసుకొంటారు. విదేశీసంబంధ వ్యాపారాలలో మంచి ఆదాయవృద్ధి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి. వైవాహిక జీవితం లో భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కలవు, దీనివలన మానసిక అశాంతి ఎక్కువవుతుంది. వ్యాపారానికి సంబందించిన నిర్ణయాలు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవడం మంచిది. ముఖ్యం గా పాటించవలసిన సూచనలు – మీకు తెలియకుండానే అనవసరమైన వివాదాలలో ఇరుక్కొనే అవకాశం కలదు. కావున, అన్ని విషయాలలో తలదూర్చడం మంచిది కాదు. లైఫ్ స్టైల్ మార్చుకోవడం వలన వచ్చే మార్పులని స్వీకరించి ముందుకు వెళ్ళాలి.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

Telugu Yearly Horoscope 2025 content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.

Telugu Calendar 2025 – పంచాంగం – App on Google Play

Telugu Calendar 2025 – Panchangam – App on Apple App Store

Categorized in: