Today rashi phahalu – 02 ఫిబ్రవరి 2023, గురువారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


కొత్త వ్యక్తుల పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలు వెల్లడిస్తారు. భూములు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఊహించని పురోగతి. ఉద్యోగులకు సమస్యలు కాస్త తీరతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు.. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు…….గులాబీ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు..నేరేడు. హయగ్రీవ స్తోత్రం పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఇంటాబయటా చికాకులు. రాబడికి మించిన ఖర్చులు మీదపడతాయి. మిత్రులు శత్రువులుగా మారతారు. ఆరోగ్యం పై కొంత జాగ్రత్తలు పాటించాలి. పుణ్యక్షేత్రాల సందర్శనం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార,వాణిజ్యవేత్తలకు మరింత ఒత్తిడులు. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటారు. రాజకీయవేత్తలు,సాంకేతిక నిపుణులకు చిక్కులు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు. అనుకూల రంగులు… ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు..పసుపు.. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


ముఖ్య వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. గృహం కొనుగోలు పై సందిగ్ధత తొలగుతుంది. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు. ఆ«థ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు విధులు తేలికపడతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు సమస్యలు తీరి ఊరట చెందుతారు. విద్యార్థులు స్వంత ఆలోచనలతో విజయం సాధిస్తారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకూల రంగులు……. ఎరుపు, గోధుమ. ప్రతికూల రంగు…తెలుపు. వేంకటేశ్వరస్వామిని ఆరాధించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


ఆకస్మిక ప్రయాణాలతో కొంత అలసట చెందుతారు. ఆరోగ్యం పై దృష్టి పెట్టడం మంచిది.. ఆదాయానికి మించి ఖర్చులు ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య కలహాలు పెరుగుతాయి. బంధువర్గం నుంచి ఒత్తిడులు, కొన్ని విమర్శలు. కార్యక్రమాలలో కొన్ని అవాంతరాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు కొంత ఇబ్బందిగా మారతాయి. ఉద్యోగులు విధుల పట్ల జాగ్రత్తలు పాటించాలి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు నిరుత్సాహం. విద్యార్థుల పై ఒత్తిడులు తప్పవు. మహిళలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అనుకూల రంగులు…… బంగారు, తెలుపు. ప్రతికూల రంగు..గులాబీ. ఆదిత్య హృదయం పఠించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


శుభకార్యాలు నిర్వహణ పై ఒక అంచనాకు వస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత అనుకూలత. కుటుంబ సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. సన్నిహితులతో ఆనందాన్ని పంచుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సంస్థల వికేంద్రీకరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగుల సేవలకు మంచి గుర్తింపు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు మరింత వెసులుబాటు కలుగుతుంది. విద్యార్థులు శక్తిని నిరూపించుకుంటారు. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు……. గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు..నేరేడు.. దత్తాత్రేయుని పూజించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


కార్యక్రమాలు చకచకా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం ఎంతో ఉపకరిస్తుంది.. ఆస్తుల వివాదాల నుండి గట్టెక్కే యత్నం ఫలిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు చురుగ్గా వ్యవహారాలు నడిపిస్తారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల పరిస్థితి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు కొత్త అవకాశాలు. విద్యార్థులు ఊహించని విద్యావకాశాలు సాదిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యులతో సఖ్యత. అనుకూల రంగులు……. నీలం, పసుపు. ప్రతికూల రంగులు…….తెలుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


ముఖ్యమైన కార్యక్రమాలు కొంత మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆప్తులతో విభేదాలు ఎదుర్కొంటారు. కాంట్రాక్టులు చేజారి నిరుత్సాహపడతారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు విధులు కత్తిమీద సాముగా ఉంటాయి. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు నిరుత్సాహమే. విద్యార్థుల అంచనాలలో పొరపాట్లు. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……. నీలం, పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. శివ స్తోత్రాలు పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులతో సతమతం. కుటుంబంలో సమస్యలు తప్పవు. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలలో కొన్ని అవాంతరాలు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులకు అనుకోని మార్పులు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు గందగోళం. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలు కొత్త సమస్యలు ఎదుర్కొంటారు.. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు..ఎరుపు.. సుబ్రహ్మణ్యాష్ట.కం పఠించండి..

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత అనుకూల పరిస్థితి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులు కష్టసాధ్యమైనా సాధిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు పెట్టుబడులను రెట్టింపు చేస్తారు.. ఉద్యోగులకు వివాదాలు తీరతాయి.. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి. అనుకూల రంగులు……. ఎరుపు, తెలుపు. ప్రతికూలరంగు…నీలం.. శివాలయంలో అభిషేకం చేయండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


చేపట్టిన కార్యక్రమాలలో మరింత పురోగతి. దూర ప్రాంత్రాల నుండి శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు నెలకొంటాయి. కాంట్రాక్టులకు శుభవర్తమానాలు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలు రాగలవు. ఉద్యోగులకు విధులు సాఫీగా సాగిపోతాయి.. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఒత్తిడులు అధిగమిస్తారు. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలం. మహిళలకు శుభవర్తమానాలు అందుతాయి. అనుకూల రంగులు……. నలుపు, తెలుపు. ప్రతికూల రంగు.ఆకుపచ్చ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


ఆర్థిక విషయాలలో తొందరపాటు వద్దు. బంధువులతో మనస్పర్థలు ఏర్పడి మనశ్శాంతి లోపిస్తుంది.. దూర ప్రయాణాలు ఉంటాయి. అనారోగ్య సూచనలు. ఆస్తి వివాదాలు నెలకొనే అవకాశాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఊహించిన లాభాలు అందుకోలేరు. ఉద్యోగాల్లో కొత్త విధులలో అవాంతరాలు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు నిరాశతోనే గడుపుతారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. మహిళలు కుటుంబ సమస్యలతో సతమతమవుతారు. అనుకూల రంగులు… గులాబీ, తెలుపు. ప్రతికూల రంగు..ఆకుపచ్చ.. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


ఆర్థిక పరిస్థితి అంతగా కలసిరాదు. ఇంటాబయటా సమస్యలు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలు ఉంటాయి. కొన్ని కార్యక్రమాలను చేసేదిలేక వాయిదా వేస్తారు. బంధువులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. నిరుద్యోగులు శ్రమ పడ్డా ఫలితం అందుకోలేరు. ఉద్యోగ బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు సాధారణ లాభాలు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు గందరగోళం. విద్యార్థులకు అంచనాలు తారుమారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు. అనుకూల రంగులు… నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు..నేరేడు.. గణపతిని పూజించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: