Today rashi phahalu – 02 జనవరి 2023, సోమవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
![aries-mesha-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/aries-mesha-rasi.png)
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
బంధువుల తోడ్పాటుతో పనులు చక్కదిద్దుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవప్రతిష్ఠలకు లోటు రాదు. ఆకస్మిక ధన లాభం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు. ఉద్యోగులకు మంచి ఆదరణ లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు నూతనోత్సాహం. విద్యార్థులకు మరింత ప్రోత్సాహం. మహిళలకు ఆస్తి విషయంలో లాభాలు. అనుకూల రంగులు……. గులాబీ, ఎరుపు. ప్రతికూల రంగు…నీలం. ఆంజనేయ దండకం పఠించండి.
![taurus-vrushabha-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/taurus-vrushabha-rasi.png)
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
వ్యయప్రయాసలు ఎదుర్కొంటారు. మానసిక ఆందోళనత ఎటూపాలుపోదు. రాబడి నిరాశ కలిగిస్తుంది. కొన్ని కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పవు.. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సాదాసీదా లాభాలు ఉంటాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు. చిత్రపరిశ్రమవారు, క్రీడాకారులకు నిరుత్సాహం. విద్యార్థులు శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. మహిళలకు కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. విద్యార్థులకు అంచనాలు కొన్ని తప్పుతాయి. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, నేరేడు. ప్రతికూల రంగు…గులాబీ. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
![gemini-mithuna-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/gemini-mithuna-rasi.png)
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
కార్యక్రమాలు పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు తెరపడుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. సేవాకార్యక్రమాలలో చురుగ్గా వ్యవహరిస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. వైద్యులు, క్రీడాకారులు స్వయం నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు ఒక సంతోషకర సమాచారం. అనుకూల రంగులు……. ఎరుపు, నీలం ప్రతికూల రంగు…తెలుపు. గణేశాష్టకం పఠించండి.
![cancer-karkataka-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/cancer-karkataka-rasi.png)
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు కలసి ఉత్సాహంగా గడుపుతారు. మీ ఆహ్వానాలను ప్రముఖులు అంగీకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వివాహయత్నాలు ఫలించి ముందుకు సాగుతారు. ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు తెలివిగా వ్యవహరించి చిక్కులు అధిగమిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు నూతనోత్సాహం. అనుకూల రంగులు…….పసుపు, కాఫీ. ప్రతికూల రంగు…నలుపు. అంగారక స్తోత్రాలు పఠించండి.
![leo-simha-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/leo-simha-rasi.png)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది. దూర ప్రయాణాలు సంభవం. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. కుటుంబంలో కొందరితో మనస్పర్థలు రావచ్చు. ఇంటర్వ్యూలు నిరాశ కలిగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్నేహితులు మీ పై ఒత్తిడులు పెంచుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తల యత్నాలలో అవాంతరాలు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు శ్రమాధిక్యం. విద్యార్థులు కాస్త ఊరట చెందుతారు. మహిళలకు ఆస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. అనుకూల రంగులు……. గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
![virgo-kanya-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/virgo-kanya-rasi.png)
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
కొన్ని కార్యక్రమాలలో కొంత జాప్యం. ఆర్థిక ఇబ్బందులు, రుణదాతల ఒత్తిడులు. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు. కుటుంబసభ్యులతో అభిప్రాయబేధాలు. తొందరపాటు మాటల వల్ల వివాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సాదాసీదాగా సాగే కాలం. ఉద్యోగులు విధి నిర్వహణ పట్ల బాధ్యతగా మెలగాలి. రాజకీయవేత్తలు, క్రీడాకారుల యత్నాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులు ఒక కీలక సమాచారం అందుకుంటారు. ఉద్యోగులకు పని భారం నుండి విముక్తి. అనుకూల రంగులు…….గులాబీ, పసుపు. ప్రతికూల రంగు…నీలం. హనుమాన్ఛాలీసా పఠించండి.
![libra-tula-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/libra-tula-rasi.png)
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
నూతన ఉద్యోగాల్లో చేరతారు. ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య పరస్పరం అవగాహన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాలు తీరి ప్రయోజనం పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. చిత్రపరిశ్రమ వారు, సాంకేతికవర్గాలకు శుభదాయకమైన సమయం. విద్యార్థులకు ఫలితాలు కొంత నిరుత్సాహం. మహిళలకు ఆస్తి వివాదాలు పరిష్కారం. అనుకూల రంగులు……. ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. కనకధారా స్తోత్రాలు పఠించండి.
![scorpio-vruschika-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/scorpio-vruschika-rasi.png)
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. తెలివిగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనగోలు చేస్తారు. గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు అధికమొత్తంలో లాభాలు. రాజకీయవేత్తలు, క్రీడాకారుల యత్నాలలో పురోగతి. విద్యార్థులు కోరుకున్న విధంగా అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు మానసిక ప్రశాంతత. అనుకూల రంగులు…….పసుపు. ఎరుపు. ప్రతికూల రంగు..నీలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
![saggitarius-dhanu-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/saggitarius-dhanu-rasi.png)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
అనుకోని ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో విరోధాలు నెలకొనే అవకాశం. పనులు నత్తనడకన సాగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఎంత ప్రయత్నించినా రాబడి కనిపించదు. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు అనుకూల పరిస్థితి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు సంభవం. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు పరీక్షాకాలంగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. మహిళలు మానసిక ప్రశాంతత లేక ఇబ్బందిపడతారు. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు.. శివాష్టకం పఠించండి.
![capricorn-makara-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/capricorn-makara-rasi.png)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
వ్యవహారాల్లో ఆటంకాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. ఆలోచనలు ఏ మాత్రం స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. గృహ నిర్మాణ యత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలు కొంత తగ్గిస్తారు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థులు అవకాశాల ఎంపికలో తొందరపడతారు. మహిళలకు మానసిక ఆందోళ’. అనుకూల రంగులు…….ఆకుపచ్చ, నేరేడు. ప్రతికూల రంగు…గులాబీ. నృసింహ స్తోత్రాలు పఠించండి.
![aquarius-kumbha-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/aquarius-kumbha-rasi.png)
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
వ్యతిరేకుల నుంచి సైతం సహాయం అందుతుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. చిన్ననాటి స్నేహితుల కష్టసుఖాలు విచారిస్తారు. అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. ఆదాయం కొంత తగ్గుదల అయినాఅవసరాలకు లోటురాదు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సంస్థల ప్రగతి సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగులు శ్రమపడాల్సిన సమయం. రాజకీయ,పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు తొలగుతాయి. విద్యార్థులు ఎలాంటి అవకాశమైనా సద్వినియోగం చేసుకుంటారు. మహిళలకు శుభవార్తలు అందుతాయి. అనుకూల రంగులు…… నీలం, తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. గణేశాష్టకం పఠించండి.
![pisces-meena-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/pisces-meena-rasi.png)
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమాలలో జాప్యం. బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు. ఆరోగ్యపరంగా చికాకులు. మానసిక అశాంతి. ప్రత్యర్థులు పెరుగుతారు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారస్తులు,వాణిజ్యవేత్తలకు లాభాలు ఆశించినంతగా కనిపించవు. ఉద్యోగులకు స్థానచలనం. వైద్యులు, చిత్రపరిశ్రమ వారు కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటారు. విద్యార్థులకు చిక్కులు. మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు. అనుకూల రంగులు…….ఆకుపచ్చ, నేరేడు. ప్రతికూల రంగు…ఎరుపు. గణేశాష్టకం పఠించండి. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakunda