Today rashi phahalu – 03 ఫిబ్రవరి 2023, శుక్రవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
నూతన ఉద్యోగయత్నాలు కలసి వస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బాకీలు సైతం వసూలవుతాయి. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు తగినంతగా లాభాలు. ఉద్యోగులకు ఊహించని మార్పులు. చిత్ర పరిశ్రమ వారు, వైద్యుల కల నెరవేరుతుంది. విద్యార్థులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. మహిళలకు ఆస్తి లాభాలు. అనుకూల రంగులు…….గులాబీ, కాఫీ. ప్రతికూల రంగు.. ఆకుపచ్చ. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఆర్థిక ఇబ్బందులు తలనొప్పిగా మారతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఒప్పందాలలో జాప్యంతో కొన్ని రద్దుచేసుకుంటారు. సోదరులు, మిత్రులతో విభేదాలు. ఇంటి నిర్మాణాల్లో ప్రతిబంధకాలు. మీ ఆలోచనలు, అభిప్రాయాల పై కుటుంబంలో వ్యతిరేకత. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు విధులు ఇబ్బందికరంగా ఉండవచ్చు. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు సామాన్యస్థితి. విద్యార్థులు శ్రమ పడాలి. మహిళలకు నిరాశ తప్పదు. అనుకూల రంగులు……. పసుపు, తెలుపు. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. గణపతిని పూజించండి.

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
పనులు సకాలంలో పూర్తి కాగలవు. కుటుంబంలో శుభకార్యాలకు ప్రణాళిక సిద్ధం చేస్తారు.. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగ యత్నాలలో కదలికలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాల్లో కొత్త విధులు దక్కించుకుంటారు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు అనుకూల వాతావరణం. విద్యార్థులు ఏ నిర్ణయం తీసుకున్నా అనుకూలిస్తుంది. మహిళలు సంతోషకరమైన వార్తలు వింటారు. అనుకూల రంగులు……. కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు.. ఎరుపు. దత్తాత్రేయుని పూజించండి.

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
కుటుంబంలో సమస్యలు వేధిస్తాయి. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం ఇబ్బందిపెట్టవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు మరింత నిదానం పాటించాలి. ఉద్యోగులకు స్థానమార్పులు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు అయోమయ స్థితి. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……. తెలుపు, కాఫీ. ప్రతికూల రంగు.. ఎరుపు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
కార్యక్రమాలు అనుకున్న సమయానికి సజావుగా సాగుతాయి. బంధువుల నుంచి ధనలాభ సూచనలు. ఆర్థిక లావాదేవీలు మరింత మెరుగ్గా ఉంటాయి. పాత సంఘటనలు నెమరువేసుకుంటారు. కాంట్రాక్టర్లకు అనుకూల పరిస్థితులు. వ్యాపార, వాణిజ్యవేత్తలు స్వీయ ఆలోచనలతో ముందడుగు వేస్తారు. ఉద్యోగాల్లో వివాదాలు తీరి ఊరట చెందుతారు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థుల కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు……. ఆకుపచ్చ. గులాబీ. ప్రతికూల రంగు..పసుపు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దూరమైన ఆప్తులను తిరిగి రప్పించుకుంటారు. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. స్నేహితులతో సంతోషం గడుపుతారు. శుభకార్యాలకు తగిన ప్రణాళిక సిద్ధం చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగులకు వివాదాలు తీరతాయి. సాంకేతిక నిపుణులు, క్రీడాకారులకు శుభవార్తలు. విద్యార్థులు ప్రతిభ చాటుకుంటారు. మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. అనుకూల రంగులు……. ఎరుపు, గులాబీ. ప్రతికూల రంగు.. నేరేడు. హనుమాన్ ఛాలీసా పఠించండి.

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
మిత్రులతో అకారణంగా తగాదాలు. కార్యక్రమాలు మధ్యలోనే విరమిస్తారు. కాంట్రాక్టులు చేజారవచ్చు. రాబడి పై నిరాశ చెందుతారు. ఉద్యోగాల్లో అదనపు పనిభారం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సామాన్యస్థితి. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులకు వ్యయప్రయాసలు తప్పవు. విద్యార్థులు మరింత నిదానం పాటించడం మంచిది. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు……. నీలం, గులాబీ. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
వ్యయప్రయాసలు ఎదుర్కొంటారు. కార్యక్రమాలు ఆటంకాలతో నిలిచిపోతాయి. దూర ప్రయాణాలు ఉండవచ్చు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. బంధువులతో మాటపట్టింపులు, రాబడి కొంత తగ్గి నిరాశ చెందుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు శ్రమ అధికంతో అవకాశాలు సాధిస్తారు. విద్యార్థుల కృషి ఫలించదు. మహిళలకు కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. అనుకూల రంగులు……. నలుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు..నీలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
కార్యక్రమాలను ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు. పాత మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకుని అప్పుల బారి నుండి బయటపడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు తగ్గుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు మరిన్ని విజయాలు చేకూరతాయి. విద్యార్థుల శ్రమ ఫలించే సమయం. మహిళలకు శుభ వర్తమానాలు. అనుకూల రంగులు……. నీలం,ఆకుపచ్చ. ప్రతికూల రంగు…. గులాబీ. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
ఉత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకుని అవసరాలు తీర్చుకుంటారు. వ్యతిరేకులు కూడా మిత్రులుగా మారతారు. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలం. వ్యాపార, వాణిజ్యవేత్తలు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రతిభ చాటుకుంటారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఇబ్బందుల నుండి బయటపడతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు……. ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు..నేరేడు. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ముఖ్య కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. ఆరోగ్య, కుటుంబ సమస్యలతో డీలాపడతారు. నిర్ణయాల్లో తొందరపాటు తగదు. ఆలోచనల పై ఎటూ తేల్చుకోలేరు. రాబడి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చికాకులు. ఉద్యోగులకు అనుకోని మార్పులు. సాంకేతిక నిపుణులు, క్రీడాకారులకు కొత్త సమస్యలు. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు……. పసుపు, లేత ఎరుపు. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. శివాష్టకం పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
కార్యక్రమాలు మరింత మందకొడిగా సాగుతాయి. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం పై ప్రధానంగా దృష్టి పెట్టాలి. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త చిక్కులు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు ఒత్తిడులు. విద్యార్థులు నిదానంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……. బంగారు, తెలుపు. ప్రతికూల రంగు.. నీలం. గణపతి స్తోత్రాలు పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com