Today rashi phahalu – 03 జనవరి 2023, మంగళవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయాల్లో చికాకులు. వ్యాపారులు, వాణిజ్యవేత్తలు పెట్టుబడుల పై మరింత నిదానం పాటించండి. ఉద్యోగాల్లో చిక్కులు . పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఆశించిన అవకాశాలు దూరమై నిరాశ చెందుతారు. విద్యార్థులకు పరీక్షాకాలంగా ఉంటుంది. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు……. తెలుపు, ఎరుపు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
పట్టుదలగా అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. అందరిలోనూ మంచి పేరు గడిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. ఆలయాల సందర్శనం. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు అనుకున్న విధంగా లాభాలు. ఉద్యోగులు ఉత్సాహంగా విధి నిర్వహణ చేస్తారు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులు ఆహ్వానాలు అందుకుంటారు. అనుకూల రంగులు……. గులాబీ, పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. శివాష్టకం పఠించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
కుటుంబంలో చికాకులు. ఆదాయం కొంత నిరాశ కలిగిస్తుంది. సన్నిహితులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు పాటించండి. అధికంగా విశ్రాంతి తీసుకోవడం మంచిది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభనష్టాలు సమస్థాయిలో ఉంటాయి. ఉద్యోగులకు స్థానమార్పు ఉండవచ్చు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు చిక్కులు. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, ఎరుపు. ప్రతికూల రంగు…తెలుపు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కలసి వస్తాయి. కొన్ని విషయాలలో మీమాటకు ఎదురుండదు. ఆర్థిక లాభాలు గడిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్లు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థుల అంచనాలు కొంతమేర ఫలిస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. అనుకూల రంగులు……. గులాబీ, తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు. వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి సహాయం. ఆప్తులతో ముఖ్య విషయాలపై చర్చలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం ఉండి ఎదుటవారికి సైతం సాయం అందిస్తారు. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు భాగస్వాములు సహకరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు ఉత్సాహపూరితంగా ఉంటుంది. విద్యార్థులు మరిన్ని అవకాశాలు సాధిస్తారు. మహిళలకు వివాదాలు సర్దుబాటు కాగలవు. అనుకూల రంగులు……. నలుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు..కాఫీ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
రుణ భారాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యపరమైన చికాకులు. ఎంతకష్టించినా ఫలితం ఉండదు. బంధువులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. విశ్రాంతిలోపంతో ఆరోగ్య సమస్యలు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగాల్లో మార్పులు. పారిశ్రామిక, కళారంగాల వారికి ఒడిదుడుకులు. విద్యార్థులు శ్రమమరింత పెంచుకోవాలి. అనుకూల రంగులు……. పసుపు, గులాబీ. ప్రతికూల రంగు…పసుపు. ఆదిత్య హృదయం పఠించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగదాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతగా సంతృప్తినీయదు. ఉద్యోగులు పనిభారం మీద పడి సతమతమవుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు మరింత ఆచితూచి అడుగువేయాలి. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు కొత్త సమస్యలు. విద్యార్థుల కృషి ఆశించిన స్థాయిలో ఫలించదు. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు……. ఎరుపు, గోధుమ. ప్రతికూల రంగు…నేరేడు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. దైవ దర్శనాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ది. వాహనాలు కొనుగోలు చేస్తారు. రాబడి రెండుమూడు విధాలుగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల అభివృద్ఖికి శ్రమపడతారు. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు విచిత్ర సంఘటనలు. విద్యార్థులు సొంత ఆలోచనలతో ముందుకు సాగుతారు. మహిళలకు ఆహ్వానాలు. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. ఆంజనేయ దండకం పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. సమావేశాల పట్ల ఆసక్తి చూపుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆహ్వానాలు కొంత ఆశ్చరపరుస్తాయి. అవసరాలకు అనుగుణంగా సొమ్ము అందుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు పట్టింది బంగారమే. విద్యార్థులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మహిళలకు మనస్సు తేలికపడుతుంది. అనుకూల రంగులు…. గులాబీ, లేత ఆకుపచ్చ. ప్రతికూల రంగు…ఎరుపు. శివాష్టకం పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం కలవరపరుస్తుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు కష్టసాధ్యం. ఉద్యోగాల్లో ఆటుపోట్లు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు ఇబ్బందికరమైన పరిస్థితులు. విద్యార్థులు ఓర్పుతో ముందకు సాగడం మంచిది. మహిళలకు సోదరులతో కలహాలు. అనుకూల రంగులు……. కాఫీ, నీలం. ప్రతికూల రంగు…గులాబీ. శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆకస్మిక ప్రయాణాలు. వ్యయప్రయాసలు. ఇంటాబయటా ప్రతికూలత. వ్యవహారాలు మందగిస్తాయి. అనుకున్నదొక్కటి జరిగేది ఒకటిగా ఉంటుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లేనిపోని సమస్యలు. ఉద్యోగులకు ఒత్తిడులు అధికం. ఆరోగ్యంపై ప్రధానంగా శ్రద్ధ వహించడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. క్రీడాకారులు, వైద్యులకు విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులు అవకాశాలపై తొందరపడరాదు. మహిళలు ఆశనిరాశల మధ్య గడుపుతారు. అనుకూల రంగులు……. గులాబీ, తెలుపు. ప్రతికూల రంగు…పసుపు. హయగ్రీవ స్తోత్రాలు పఠిచండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
వ్యూహాత్మకంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అత్యంత తెలివిగా వ్యవహరించి ఎంతటి సమస్యనైనా అధిగమిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. భూ, గృహ యోగాలు. పరిచయాలు పెరుగుతాయి. రాబడి ఆశాజకనకంగా ఉంటుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తల సమస్యలు పరిష్కారం. ఉద్యోగులు విధి నిర్వహణలో చురుగ్గా పాల్గొంటారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు ఒత్తిడుల నుండి బయపడతారు. విద్యార్థులు మేథస్సును ఉపయోగించి అవకాశాలు సొంతం చేసుకుంటారు. మహిళలకు మనో నిబ్బరం పెరుగుతుంది. అనుకూల రంగులు……. ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు…నీలం. గణేశాష్టకం పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com