Today rashi phahalu – 04 జనవరి 2023, బుధవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఆకస్మిక ప్రయాణాలతో కొంత ఉక్కిరిబిక్కిరి. కార్యక్రమాలు పూర్తి చేసేందుకు శ్రమిస్తారు. కొందరు వ్యతిరేకుల ద్వారా చికాకులు ఎదురవుతాయి. కొన్ని వివాదాలు తలనొప్పి గా మారవచ్చు. ఉద్యోగ యత్నాలకు ఆటంకాలు. కాంట్రాక్టర్లకు మానసిక అశాంతి. ఏ పనీ ముందుకు సాగని వైనం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఆశించినమేర లాభాలు కష్టసాధ్యమే. ఉద్యోగులకు విధి నిర్వహణలో నిరుత్సాహం. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కొంత నిరుత్సాహపడతారు. విద్యార్థులకు శ్రమతప్పదు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ఆదరణ తగ్గుతుంది. అనుకూల రంగులు…..తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు…కాఫీ. శ్రీ రామరక్షా స్తోత్రం పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువర్గంతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు తీరతాయి. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులను దక్కించుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు విశేష లాభదాయకం. ఉద్యోగులు సమస్యల నుండి గట్టెక్కుతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు శుభవార్తలు. విద్యార్థులకు నూతన అవకాశాలు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. అనుకూల రంగులు…… పసుపు, తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు. శ్రీ మహా విష్ణు ధ్యానం పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


కార్యక్రమాలు కొన్ని శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆదాయానికి మించి ఖర్చులతో సతమతం. బంధువులతో అకారణంగా విభేదాలు. నిరుద్యోగులు అంచనాలు తప్పుతారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నిరాశ తప్పదు. ఉద్యోగులకు పనిభారం తప్పదు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కొన్ని గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు. విద్యార్థులు చేతికందిన అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు అనారోగ్యం. అనుకూల రంగులు…… నీలం, కాఫీ. ప్రతికూల రంగు…పసుపు. శ్రీ ఆంజనేయస్తుతి పఠించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు అధిగమిస్తారు. శుభకార్యాలకు కొంత డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబసభ్యుల సూచనలు పాటించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులతో ఉల్లాసంగా, సందడిగా గడుపుతారు. ఆలోచనలు వెనువెంటనే అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి చక్కబడి ఊరట లభిస్తుంది. కొన్ని వివాదాలు నెలకొన్నా సర్దుకుంటాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాల బాట పడతారు. ఉద్యోగులకు విధులు వేగవంతంగా సాగుతాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు నూతనోత్సాహం. విద్యార్థులు మరింత∙ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలకు సన్మానాలు జరుగుతాయి. అనుకూల రంగులు…… ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. శివాష్టకం పఠించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


స్నేహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు.. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగుపడతాయి. విలువైన వస్తు లాభాలు ఉండవచ్చు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. కాంట్రాక్టర్లకు కొంత శ్రమైనా ఫలితం కనిపిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు కష్టాల నుండి గట్టెక్కుతారు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు మరింత ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు. మహిళలకు సోదరులతో విభేదాలు సర్దుబాటు కాగలవు. అనుకూల రంగులు…… నీలం, గులాబీ. ప్రతికూల రంగు…తెలుపు. ఆంజనేయ దండకం పఠించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


ఆర్థిక లావాదేవీలపై నిరాశ కలుగుతుంది. బంధువుల అందిన సమాచారంతో నిరాశ చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యం పై ప్రధానంగా దృష్టి పెట్టండి. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొన్ని అంచనాలలో పొరపాట్లు. ఉద్యోగులకు చేపట్టిన బాధ్యతలు తలకుమించిన భారంగా మారవచ్చు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు స్వంత ఆలోచనలతో ముందడుగు వేయడం మంచిది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు కొత్త సమస్యలు రావచ్చు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం తప్పదు. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు….. నీలం, నలుపు. ప్రతికూల రంగు…ఎరుపు. ఆదిత్య హృదయం పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. రాబడికి మించిన ఖర్చులు తప్పవు. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహించండి. కొన్ని కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. గత సంఘటనలను గుర్తుకు తెచ్చుకుని ఆశ్చర్యపడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఆశించినమేర లాభాలు కష్టమే. ఉద్యోగులకు కొత్త వివాదాలు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహం. విద్యార్థులు కొన్ని పొరపాట్లు దొర్లి గందరగోళంలో పడతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు. అనుకూల రంగులు…… ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు…నీలం. గణపతి స్తోత్రాలు పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఆర్థిక విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. చేపట్టిన కార్యక్రమాలు అత్యంత నిదానంగా సాగుతాయి. ఆప్తులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. మీ ఆలోచనలు ఎంతగా ప్రయత్నించినా కొలిక్కి రావు. బాధ్యతల పై ఎంత తప్పించుకున్నా సాధ్యపడదు. ఆధ్యాత్మికవేత్తలను కలుసుకుని వారి సందేశాలను ఆలకిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం మరింత పెరుగుతుంది. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులకు ఒత్తిడులు అధికం. మహిళలు సమస్యల వలయంలో చిక్కుకుంటారు. అనుకూల రంగులు……నేరేడు, పసుపు. ప్రతికూల రంగు…గులాబీ. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


ఆర్థిక పరిస్థితి మీ అంచనాల మేరకు ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ఉత్సాహాన్నిస్తాయి. కొత్త ఉద్యోగాలలో ప్రవేశిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడుల విషయంలో గందగోళం తొలగుతుంది. ఉద్యోగాల్లో ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు అనుకున్న ప్రయత్నాలు సాధిస్తారు. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు…… ఎరుపు, గోధుమ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. శ్రీ కృష్ణ స్తోత్రాలు పఠించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


కుటుంబంలో సమస్యలు మరింత వేధిస్తాయి.. ఆర్థిక ఇబ్బందులతో అవస్థ పడతారు. ఆలోచనలు ఎంతకీ కొలిక్కి రాక ఇబ్బందిపడతారు. ఇంటాబయటా విమర్శలతో గడుపుతారు. కొన్ని కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. ఒక ప్రకటన నిరుద్యోగులకు కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సమస్యలు. ఉద్యోగాల్లో కొత్త వివాదాలు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు సామాన్య స్థితి. విద్యార్థులు శ్రమ పడతారు. మహిళల అంచనాలు తారుమారు. అనుకూల రంగులు…… కాఫీ, పసుపు. ప్రతికూల రంగు…ఎరుపు. శ్రీ హయగ్రీవ ధ్యానం మంచిది.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


ఆర్థిక వ్యవహారాలు సామాన్యస్థితిలో ఉంటుంది. ఇంటాబయటా కొంత వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. కుటుంబసభ్యులతో అకారణ విరో«ధాలు. ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలు ఉంటాయి. కాంట్రాక్టులు చేజారవచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు కొన్ని మార్పులు జరిగే అవకాశం. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులకు ఆశలు నెరవేరడం కష్టమే. మహిళలకు ఆరోగ్య సమస్యలు. అనుకూల రంగులు…… ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు. ఆదిత్య హృదయం పఠించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


ఉత్సాహంతో ముఖ్య కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు అంతగా కలసిరావు. కొన్ని సమస్యలు కొంతమేర తీరతాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య కొద్దిపాటి వివాదాలు. ముఖ్య నిర్ణయాల పై తొందరపాటు వద్దు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు కష్టసాధ్యం. ఉద్యోగులకు వివాదాలు తప్పవు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు శ్రమాధిక్యం. విద్యార్థులు నిరాశ చెందుతారు. మహిళలకు అయినవారితో విభేదాలు. అనుకూల రంగులు…… బంగారు, తెలుపు. ప్రతికూల రంగు…గులాబీ. శ్రీ శివ స్తోత్రాలు పఠించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: