Today rashi phahalu – 08 ఫిబ్రవరి 2023, బుధవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఆకస్మిక ప్రయాణాలు. రాబడికి మించిన ఖర్చులు. స్నేహితులతో అకారణంగా విభేదాలు.. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు అంతగా కలసిరావు. కాంట్రాక్టులు చేజారతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు వ్యయప్రయాసలు. ఉద్యోగులకు చికాకులు తప్పవు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు నిరుత్సాహం. విద్యార్థులు మరింతగా శ్రమించాలి. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు……. కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. శివ పంచాక్షరి పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

బంధువర్గంతో అకారణంగా తగాదాలు. దూర ప్రయాణాలు సంభవం. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. కష్టం తప్ప ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొంత గందరగోళంగా గడుపుతారు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు శ్రమాధిక్యం. విద్యార్థులు అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు……. ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు..పసుపు.. నరసింహ స్తోత్రాలు పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


పలుకుబడి పెరుగుతుంది. సోదరులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. కార్యక్రమాలు చకచకా సాగుతాయి. బంధువులతో గౌరవమర్యాదలు పొందుతారు. నూతన వస్తు లాభాలు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు నూతన విద్యలలో అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి. అనుకూల రంగులు……. గులాబీ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…కాఫీ. దుర్గామాతను అర్చించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఆదాయం తగ్గి కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది. శ్రమకు ఫలితం అంతగా కనిపించదు. దూర ప్రయాణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఆటుపోట్లు ఎదురుకావచ్చు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు మానసిక ఆందోళ న. విద్యార్థులకు నిరుత్సాహపూరితంగా ఉంటుంది. మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. అనుకూల రంగులు……. గోధుమ, నీలం. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. దత్తాత్రేయుని పూజించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. సన్నిహితుల సాయంతో కార్యక్రమాలు పూర్తి. ముఖ్య సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య మరింత సయోధ్య కుదురుతుంది. ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తీరి ఉపశమనం లభిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు తగిన మొత్తంలో లాభాలు రాగలవు. ఉద్యోగులకు విధుల్లో ప్రశంసలు, అభినందనలు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు సత్కారాలు అందుకుంటారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు……. ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు…నేరేడు. దుర్గామాత స్తోత్రాలు పఠించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. వ్యయప్రయాసలు ఎదురైనా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. రాబడి నిరుత్సాహపరుస్తుంది. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. సన్నిహితులతో వివాదాలు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలు తగ్గిస్తారు. ఉద్యోగాల్లో చికాకులు మరింత పెరుగుతాయి. క్రీడాకారులు, వైద్యులకు సాధారణంగా కొనసాగుతుంది. విద్యార్థుల యత్నాలు నత్తనడకన సాగుతాయి. మహిళలకు కుటుంబసభ్యుల నుంచి విమర్శలు . అనుకూల రంగులు……. గులాబీ, కాఫీ. ప్రతికూల రంగు..నీలం. గణపతిని పూజించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


అందరిలోనూ గౌరవం, పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో జరిపే చర్చలు ఫలిస్తాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆస్తి విషయాలలో చిక్కులు అధిగమిస్తారు.. ఆదాయం ఆశించినస్థాయిలో ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవేత్తలు, వైద్యులకు ఆదరణ పెరుగుతుంది. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు విశేష గుర్తింపు. అనుకూల రంగులు……. ఎరుపు, గులాబీ. ప్రతికూల రంగు…తెలుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

దూర ప్రాంతాల నుంచి ముఖ్యసమాచారం. ఆలోచనలపై ఒక నిర్ణయానికి వస్తారు. బంధువుల నుంచి సమస్యలు తీరతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు చాకచక్యంగా సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగాల్లో విధులను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు సత్తా చాటుకుంటారు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. మహిళలకు శుభవర్తమానాలు. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు. అనుకూల రంగులు……. గులాబీ, కాఫీ. ప్రతికూల రంగు..నేరేడు. హనుమ స్తోత్రాలు పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


దీర్ఘకాలిక సమస్యలతో కుస్తీపడతారు. కార్యక్రమాలలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో విరోధాలు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. వ్యతిరేకుల నుండి కొత్త సమస్యలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగులకు వివాదాలు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారుల ఆశలు ఫలించవు. విద్యార్థులకు గందరగోళ పరిస్థితి. మహిళలకు కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకూల రంగులు……. ఎరుపు, గులాబీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నిరుత్సాహమే. ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది.. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు సామాన్యంగా గడుస్తుంది. విద్యార్థులకు ప్రయత్నాలు అనుకూలించవు. మహిళలకు నిరాశాజనకంగా ఉంటుంది. అనుకూల రంగులు…… కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు…ఎరుపు. దుర్గామాతకు కుంకుమార్చనలు చేయించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


కార్యజయంతో ఉత్సాహం పెరుగుతుంది. ఇంటాబయటా ప్రశంసలు. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. చిన్ననాటి స్నేహితులనుు కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. భూములు, ఆభరణాలు కొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులు విధుల పట్ల ఏకాగ్రత పెంచుకుంటారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ప్రయత్నాలు సఫలం. విద్యార్థులకు కలలు నెరవేరతాయి. మహిళలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకూల రంగులు…… నీలం, నలుపు. ప్రతికూల రంగు…గులాబీ. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


ఉన్నత వ్యక్తులతో పరిచయాలు. ఆదాయం మరింత ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. వ్యాపార, వాణిజ్యవేత్తల లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు.. మహిళలకు భూలాభం. అనుకూల రంగులు…… గులాబీ , లేత పసుపు. ప్రతికూల రంగు..నలుపు.. శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: