Today rashi phahalu – 11 జనవరి 2023, బుధవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
![aries-mesha-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/aries-mesha-rasi.png)
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక ఇబ్బందులు తలనెప్పిగా మారతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఒప్పందాలు కొన్ని రద్దుచేసుకుంటారు. సోదరులు, మిత్రులతో విభేదాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అంతగా ఉండవు.. ఉద్యోగులకు అనుకోని మార్పులు సంభవం. కళాకారులు, రాజకీయవేత్తలు కొంత ఆందోళనకు గురవుతారు. విద్యార్థులు మరింత కష్టపడితేనే ఫలితం. మహిళలకు నిరాశ తప్పదు. అనుకూల రంగులు……పసుపు, తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. గణపతిని పూజించండి.
![taurus-vrushabha-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/taurus-vrushabha-rasi.png)
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కుటుంబంలో ఒడిదుడుకులు. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త సమస్యలు. ఉద్యోగులకు పనిఒత్తిడులు. వ్యవసాయదారులు, చిత్రపరిశ్రమ వారికి సామాన్యంగా ఉంటుంది.. విద్యార్థులు మరింత జాగ్రత్తగా ముందుకు సాగాలి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……. తెలుపు, కాఫీ. ప్రతికూల రంగు…గులాబీ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
![gemini-mithuna-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/gemini-mithuna-rasi.png)
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
నూతన ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. అతిముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. కొన్ని బాకీలు సైతం వసూలవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు అనుకున్న మేర లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఊహించని మార్పులు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు పడ్డ శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులు ఊహించని విధంగా అవకాశాలు సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభాలు. అనుకూల రంగులు…… గులాబీ, కాఫీ. ప్రతికూల రంగు…పసుపు. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.
![cancer-karkataka-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/cancer-karkataka-rasi.png)
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
వ్యయప్రయాసలు తప్పవు. కార్యక్రమాలలో మరింతగా అవాంతరాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలతో సతమతం. బంధువులతో తగాదాలు. రాబడి కొంత తగ్గి నిరాశ చెందుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు అంతగా కలసిరావు. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులకు శ్రమాధిక్యం. విద్యార్థులకు చిక్కులు. మహిళలకు కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. అనుకూల రంగులు…… నలుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…తెలుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
![leo-simha-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/leo-simha-rasi.png)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
కార్యక్రమాలు అనుకున్న సమయానికి సజావుగా సాగుతాయి. బంధువుల నుంచి ఆస్తి లేదా ధనలాభ సూచనలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పాత సంఘటనలు మరింతగా గుర్తుకు తెచ్చుకుంటారు. కాంట్రాక్టర్లకు అనుకూలమైన కాలం. వ్యాపార, వాణజ్యవేత్తలు సంస్థల అభివృద్ధిపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాల్లో కొంత అనుకూల పరిస్థితి. పారిశ్రామికవేత్తలు,వైద్యులకు ఉత్సాహవంతమైన రోజు. విద్యార్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు పొందుతారు. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు…… ఆకుపచ్చ. గులాబీ. ప్రతికూల రంగు…ఎరుపు. ఆదిత్య హృదయం పఠించాలి.
![virgo-kanya-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/virgo-kanya-rasi.png)
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
స్నేహితులతో అకారణంగా తగాదాలు. కార్యక్రమాలను శ్రమ భరించలేక విరమిస్తారు. కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు. రాబడి అంతగా ఉండదు. ఉద్యోగాల్లో అదనపు పనిభారం. వ్యాపార, వాణిజ్యవేత్తలు సాధారణ లాభాలు అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులకు వ్యయప్రయాసలు తప్పవు. విద్యార్థులు నిరాశ చెందుతారు. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు…… నీలం, గులాబీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది
![libra-tula-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/libra-tula-rasi.png)
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు. ఇంటిలో శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగయత్నాలలో కదలికలు. ఆదాయం మరింత ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. ఉద్యోగాల్లో విధులు మరింత చక్కదిద్దుతారు. రాజకీయవేత్తలకు కొంత అనుకూలత. విద్యార్థులు శ్రమ ఫలించి ముందుకు సాగుతారు. మహిళలు సంతోషకరమైన వార్తలు వింటారు. అనుకూల రంగులు…… కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు. దత్తాత్రేయుని పూజించండి.
![scorpio-vruschika-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/scorpio-vruschika-rasi.png)
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. భార్యాభర్తల మధ్య అపోహలు, మనస్పర్థలు తొలగుతాయి. స్నేహితులతో సంతోషం గడుపుతారు. శుభకార్యాలకు తగిన ప్రణాళిక సిద్ధం చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అనుకున్న లాభాలు రాగలవు. ఉద్యోగులకు ఊహించని అభివృద్ధి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు సమస్యలు తీరతాయి. విద్యార్థులు కొత్త అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. అనుకూల రంగులు…… ఎరుపు, గులాబీ. ప్రతికూల రంగు…తెలుపు. హనుమాన్ చాలీసా పఠించండి.
![saggitarius-dhanu-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/saggitarius-dhanu-rasi.png)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
కార్యక్రమాలలో కొన్ని ఆటంకాలు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు వేధిస్తాయి. నిర్ణయాల్లో తొందరపాటు తగదు. ఆలోచనలను సరైన దిశలో అమలు చేయలేక ఇబ్బందిపడతారు. రాబడి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చికాకులు. ఉద్యోగులకు అనుకోని మార్పులు. సాంకేతిక నిపుణులు, చిత్ర పరిశ్రమ వారు శ్రమ అధికమైన ఇబ్బందిపడతారు. విద్యార్థులు ఎంత నిదానంగా సాగితే అంత మంచిది. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు…… పసుపు, లేత ఎరుపు. ప్రతికూల రంగు…నీలం. శివాష్టకం పఠించండి.
![capricorn-makara-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/capricorn-makara-rasi.png)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
కార్యక్రమాలు కొన్ని మందకొడిగా సాగుతాయి. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించండి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఇతరుల నుండి ఒత్తిడులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు కొత్త సమస్యలు. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు…… బంగారు, తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. సూర్యారాధన మంచిది.
![aquarius-kumbha-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/aquarius-kumbha-rasi.png)
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ముఖ్య కార్యక్రమాలలో ఊహించని విజయం సాధిస్తారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. గతంలో దూరమైన కొందరు స్నేహితులు కలుస్తారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుని అవసరాలు తీర్చుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులు తమ పట్టును నిలుపుకుని గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి చిక్కులు వీడతాయి. విద్యార్థులకు సమస్యల నుండి విముక్తి. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు…… నీలం,ఆకుపచ్చ. ప్రతికూల రంగు…తెలుపు. వేంకటేశ్వరస్వామిని పూజించండి.
![pisces-meena-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/pisces-meena-rasi.png)
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉత్సాహంతో కార్యక్రమాలు వేగంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిని దారిపెట్టుకుని రుణభారాల నుండి విముక్తి పొందుతారు. వ్యతిరేకులు కూడా మీపట్ల సానుభూతి వ్యక్తం చేసి సహాయపడతారు. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. ఇంటి, వాహనయోగాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అనుకున్న లాభాలు లభిస్తాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఒత్తిడులు తేలిగ్గా అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు నిరాశ నుండి బయటపడతారు. విద్యార్థులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు…… ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు…నేరేడు. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com