Today rashi phalalu – 12 ఫిబ్రవరి 2023, ఆదివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఊహించని సహాయం. సంఘంలో ప్రత్యేకత చాటుకుంటారు. వాహనాలు,ఆభరణాలు కొంటారు. కుటుంబ సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టర్లకు అంచనాలు కొన్ని తప్పుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాల వేటలో విజయం సాధిస్తారు. ఉద్యోగాల్లో విధులు మరింత తేలిక పడతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలలో పురోగతి. విద్యార్థులకు అన్నింటా విజయమే. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. అనుకూల రంగులు…ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు..నేరేడు. ఆదిత్య హృదయం పఠించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఉత్సాహంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. శ్రమకు ఫలితం దక్కుతుంది. బంధువులతో చర్చలు ఫలిస్తాయి. సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం. విద్యార్థులకు మంచి ఫలితాలు. మహిళలకు ఉత్సాహాన్నిచ్చే సమాచారం అందుతుంది. అనుకూల రంగులు.. నీలం, బంగారు. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. కనకధారా స్తోత్రం పఠించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
వ్యవహారాలు మందగిస్తాయి. ఖర్చులు పెరిగి అప్పులు చేస్తారు. ప్రయాణాలు విరమిస్తారు. ముఖ్య నిర్ణయాలలో నిదానం పాటించండి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొంత గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. మహిళలకు కొన్ని ఇబ్బందులు తప్పవు. అనుకూల రంగులు.. ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు..నీలం. నవగ్రహా స్తోత్రం పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
అనుకోని ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో విభేదాలు. కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వ్యవహారాల్లో కొన్ని సమస్యలు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. పనులలో అవరోధాలు తప్పవు. వ్యాపార, వాణిజ్యవేత్తలు మరింత నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒడిదుడుకులు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులు నిరుత్సాహంతోనే గడుపుతారు. విద్యార్థులకు అవకాశాలు తప్పిపోతాయి. మహిళలకు ఆరోగ్యసమస్యలు. అనుకూల రంగులు. ఆకుపచ్చ, బంగారు. ప్రతికూల రంగు..నీలం. శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
భార్యాభర్తల మధ్య సయోధ్య. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. రాబడి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగాల్లో క్లిష్ట పరిస్థితులు తొలగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు మరింత పుంజకుంటారు. పారిశ్రామిక,రాజకీయవేత్తలకు ఆహ్వానాలు రాగలవు. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలకు సంతోషకరమైన వార్తలు. అనుకూల రంగులు.. బంగారు, తెలుపు. ప్రతికూల రంగు..నేరేడు. వేంకటేశ్వరస్వామిని పూజించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ఆర్థిక వ్యవహారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. రుణాలు చేస్తారు. ఇంటా బయటా సమస్యలతో సతమతం. దూరప్రయాణాలు ఉండవచ్చు. సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగాల్లో కొంత అసంతృప్తి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు సమస్యలు ఎదురుకావచ్చు. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. అనుకూల రంగులు.. గోధుమ పసుపు. ప్రతికూల రంగు..తెలుపు. అంగారక స్తోత్రం పఠించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఎదుటవారిని మాటలతో ఆకట్టుకుంటారు. బంధుమిత్రులతో వివాదాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నూతనోత్సాహం. ఉద్యోగులు పొరపాట్లు సరిదిద్దుకుంటారు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. అనుకూల రంగులు.. గులాబీ, బంగారు. ప్రతికూల రంగు..కాఫీ. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
అనుకోని ప్రయాణాలు. ఆదాయానికి మించి ఖర్చులు చేయాల్సి వస్తుంది. కుటుంబ సమస్యలు వే«ధిస్తాయి. కొద్దిపాటి ఆరోగ్యసమస్యలు తప్పకపోవచ్చు. నిర్ణయాలలో నిదానం అవసరం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీల్లో ఆటుపోట్లు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు గందరగోళ పరిస్థితులు. విద్యార్థులు మరింత శ్రమపడితే ఫలితం ఉంటుంది. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు.. కాఫీ, ఎరుపు. ప్రతికూలరంగు..నలుపు. ఆంజనేయ దండకం పఠించండి..
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు సంతోషాన్నిస్తాయి. ఉద్యోగాల్లో కొన్ని సమస్యల పరిష్కారం. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు కీలక సమాచారం అందుకుంటారు. మహిళలకు మరింత గౌరవం పెరుగుతుంది. అనుకూల రంగులు.. తెలుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు..గులాబీ. కాలభైరవాష్టకం పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
వ్యవహారాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. రాబడి పెరిగి అప్పులు తీరతాయి. అంచనాలు నిజమవుతాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాల్లో విధుల్లో భారం. వైద్యులు, చిత్రపరిశ్రమ వారిపై ఒత్తిడులు తొలగుతాయి. విద్యార్థులకు అనుకోని అవకాశాలు. మహిళలకు శుభసమయం. అనుకూల రంగులు.. ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు..నేరేడు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. లేనిపోని ఖర్చులు ఎదురై ఇబ్బంది పడతారు. ఇంటాబయటా సమస్యలు పెరుగుతాయి. ఆత్మీయులు ఒత్తిడులు పెంచుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మరింత సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి పర్యటనలు వాయిదా. విద్యార్థులకు నిరాశాజనకంగా ఉంటుంది. మహిళలకు స్వల్ప అనారోగ్యం. అనుకూల రంగులు.. నీలం, తెలుపు. ప్రతికూల రంగు..ఎరుపు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ప్రయాణాల్లో ఆటంకాలు . ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపార, వాణిజ్యవేత్తలు మరింత ఆలోచనతో ముందుకు సాగాలి. ఉద్యోగాల్లో పనిభారం తప్పదు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు కొత్త సమస్యలు. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు మానసిక ఆందోళన పెరుగుతుంది. అనుకూల రంగులు.. గోధుమ, పసుపు. ప్రతికూల రంగు.. ఆకుపచ్చ. విష్ణు ధ్యానం చేయండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com