Today rashi phahalu – 12 జనవరి 2023, గురువారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
![aries-mesha-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/aries-mesha-rasi.png)
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
కార్యక్రమాలలో కొద్దిపాటి ఆటంకాలు. బంధువులు, స్నేహితులతో విభేదాలు. వివాదాలకు దూరంగా ఉండండి. దేవాలయాలు సందర్శిస్తారు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు కష్టమే. ఉద్యోగులకు చికాకులు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు వివాదాలు. విద్యార్థులు ఎంత కృషి చేసినా ఫలించదు. మహిళలకు మనోధైర్యం తగ్గుతుంది. అనుకూల రంగులు…… బంగారు, గులాబీ. ప్రతికూల రంగు…తెలుపు. నరసింహ స్తోత్రాలు పఠించండి.
![taurus-vrushabha-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/taurus-vrushabha-rasi.png)
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ మార్పులు ఉంటాయి. రాజకీయవేత్తలు,వైద్యులకు నిరాశాజనకమే. విద్యార్థుల కృషి ఫలించక మదనపడతారు. మహిళలకు కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకూల రంగులు…… కాఫీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు…నేరేడు. గణపతిని పూజించండి.
![gemini-mithuna-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/gemini-mithuna-rasi.png)
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఆర్థిక పరిస్థితిలో అనుకూలత. కార్యక్రమాలు కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. దూరప్రయాణాలు సంభవం. అప్రయత్న కార్యసిద్ధి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాల వెంట పరుగులు తీస్తారు. ఉద్యోగాల్లో ఇబ్బందులు, సమస్యలు తొలగుతాయి రాజకీయవేత్తలు, ఐటీ నిపుణులకు అనుకూలత. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. మహిళలకు ఆస్తి వివాదాలు తొలగుతాయి. అనుకూల రంగులు…… కాఫీ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…గులాబీ. గణపతిని పూజించండి.
![cancer-karkataka-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/cancer-karkataka-rasi.png)
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనుకోని ఖర్చులతో సతమతమవుతారు. కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. భార్యాభర్తల మధ్య కలహాలు. దేవాలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు పెట్టుబడుల్లో నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు స్థానచలన సూచనలు. కళాకారులు, వైద్యులకు కొన్ని చిక్కులు. విద్యార్థులు మునుపటి కంటే శ్రద్ధ వహించాలి. మహిళలకు నిరాశ తప్పదు. అనుకూల రంగులు…… ఎరుపు, గోధుమ. ప్రతికూల రంగు …ఆకుపచ్చ. హనుమాన్ చాలీసా పఠించాలి.
![leo-simha-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/leo-simha-rasi.png)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. ఆదాయం మరింత సంతృప్తినిస్తుంది. వస్తులాభాలు ఉండవచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలు మరింతగా లాభాలు పొందుతారు. ఉద్యోగులకు విధులు తేలిగ్గా కొనసాగుతాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు ఏదీ సాధ్యంకాదు అన్నట్లుంటుంది. విద్యార్థులు ఒకటికి రెండు అవకాశాలు సాధిస్తారు. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు…… ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు…తెలుపు. కనకదుర్గాదేవిని పూజించండి.
![virgo-kanya-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/virgo-kanya-rasi.png)
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
కుటుంబ సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. భార్యాభర్తల మధ్య అపోహలు రావచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అంతగా లాభించవు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులు సమస్యల వలయంలో చిక్కుకుంటారు. విద్యార్థులకు గందరగోళం. మహిళలకు ఒక సమాచారం కొంత ఆందోళన కలిగిస్తుంది. అనుకూల రంగులు…… నీలం, నలుపు. ప్రతికూల రంగు…ఆరెంజ్. అన్నపూర్ణాష్టకం పఠించండి.
![libra-tula-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/libra-tula-rasi.png)
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కార్యసిద్ధితో ఉత్సాహంగా గడుపుతారు. కీలకమైన సమాచారం అందుతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగుతాయి. కాంట్రాక్టులు చేపడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశాలు. రాజకీయవేత్తలు, ఐటీ నిపుణులకు శుభవర్తమానాలు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు ఆస్తిలాభాలు ఉండవచ్చు. అనుకూల రంగులు…… బంగారు, గులాబీ. ప్రతికూల రంగు…నేరేడు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
![scorpio-vruschika-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/scorpio-vruschika-rasi.png)
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ పై చర్చలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన మిత్రులు పరిచయమవుతారు. వాహనాలు,స్థిరాస్తులు కొంటారు. ఆత్మీయలు నుంచి అతికీలక విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొత్త సంస్థలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు విధుల్లో కొంత ఊరట. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఆహ్వానాలు. విద్యార్థులు పట్టుదలతో కొన్ని విజయాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. అనుకూల రంగులు….. ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…గులాబీ. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.
![saggitarius-dhanu-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/saggitarius-dhanu-rasi.png)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
కార్యక్రమాలు నిదానంగా పూర్తి కాగలవు. సోదరులు, స్నేహితుల నుండి ఊహించని వివాదాలు రావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆదాయం అంతగా కనిపించదు. కాంట్రాక్టర్లకు లేనిపోని చికాకులు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు సమీకరణలో అవాంతరాలు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఏకాగ్రతతతో ముందుకు సాగాలి. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు. అనుకూల రంగులు…… తెలుపు, లేత నీలం. ప్రతికూల రంగు…పసుపు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
![capricorn-makara-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/capricorn-makara-rasi.png)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడంలో విఫలం చెందుతారు. కొత్తగా అప్పులు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయాలలో సోదరులతో మాట పట్టింపులు. భార్యాభర్తల మధ్య అకారణంగా తగాదాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సంస్థలను నడిపించడం భారం కావచ్చు. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు మనశ్శాంతి లోపిస్తుంది. ఉద్యోగులకు అనుకోని మార్పులు. విద్యార్థులు మందకొడిగా గడుపుతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు. అనుకూల రంగులు…… గులాబీ, నీలం. ప్రతికూల రంగు…నేరేడు. హనుమాన్ చాలీసా పఠించండి.
![aquarius-kumbha-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/aquarius-kumbha-rasi.png)
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
యత్నకార్యసిద్ధి. భార్యాభర్తల మధ్య అపార్ధాలు, అపోహలు తీరి పరస్పర అవగాహన పెంచుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఎంతటి వారినైనా ఆకట్టుకునే స్వభావం ఉంటుంది. అనుకున్న రాబడి చేకూరుతుంది. ఉద్యోగులకు విధులు మరింత తేలికపడతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు స్థిరమైన అభిప్రాయాలతో ముందుకు సాగుతారు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు.. విద్యార్థుల చిరకాల కోరిక నెరవేరుతుంది. మహిళలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అనుకూల రంగులు…… గులాబీ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…పసుపు. ఆదిత్య హృదయం పఠించండి.
![pisces-meena-rasi](https://shubamangalam.com/wp-content/uploads/2022/10/pisces-meena-rasi.png)
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది. కొన్ని శుభవార్తలు అంది ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు సమకూరతాయి. కార్య జయం. రావలసిన బాకీలు అందుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు మరింత సంతోషకరంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులు మరింత మనోబలంతో కార్యసాధకులు కాగలరు. మహిళలకు కుటుంబంలో గౌరవం లభిస్తుంది. అనుకూల రంగులు…… గులాబీ, కాఫీ. ప్రతికూల రంగు…నలుపు. గణపతిని పూజించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com