Today rashi phalalu – 14 ఫిబ్రవరి 2023, మంగళవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
వ్యతిరేకులు కొందరు మీ కార్యక్రమాలకు ఆటంకాలు కల్పిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఏకాగ్రత లోపిస్తుంది. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. కష్టానికి ఫలితం దక్కదు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపండి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తల లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త చిక్కులు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు మౌనం మంచిది. విద్యార్థుల శ్రమ ఆంతగా ఫలించదు. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు……. ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు…నలుపు. శ్రీ మహావిష్ణు స్తోత్రాలు పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
నూతన మిత్రుల పరిచయం. శుభకార్యాలకు విశేషంగా ఖర్చులు. వివాదాల నుంచి బయటపడతారు. అందరిలోనూ గౌరవం పొందుతారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగులకు హుషారుగా గడుస్తుంది. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు అందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. మహిళలకు సన్మానాలు. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు. గణపతి స్తోత్రాలు పఠించండి.

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
భవిష్యత్తు పై కొత్త ఆశలు కలుగుతాయి. విచిత్రమైన సంఘటనలు. వాహనాలు, స్థలాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా ఉన్న వివాదాలు తీరతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగాల్లో కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలు విస్తృతం చేస్తారు. పారిశ్రామిక,రాజకీయవేత్తలకు శుభవార్తా శ్రవణం. విద్యార్థులకు అత్యంత ఆసక్తికరమైన సమాచారం. మహిళలకు ఉత్సాహపూరితంగా ఉంటుంది. అనుకూల రంగులు……. పసుపు, కాఫీ. ప్రతికూల రంగు… గులాబీ. శ్రీ కృష్ణ స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
కార్యక్రమాలు కొన్ని నిలిచిపోతాయి. బంధువులతో తప్పని విరోధాలు. ఆరోగ్యభంగం, విశ్రాంతి తీసుకుంటారు. ఆదాయం తగ్గుదలతో నిరాశ చెందుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త సమస్యలు. ఉద్యోగాల్లో అనుకోని చిక్కులు. విధుల్లో గందరగోళం. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు నిరుత్సాహం. స్నేహితుల నుంచి సైతం అపవాదులు ఎదురవుతాయి. విద్యార్థులకు అవకాశాలపై సందిగ్ధత. మహిళలు కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. అనుకూల రంగులు…. ఆకుపచ్చ, పసుపు. ప్రతికూల రంగు…నేరేడు. శివనామ స్తోత్రం పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఆర్థిక వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఖర్చులు కూడా పెరుగుతాయి. స్నేహితులు సైతం వ్యతిరేకులుగా మారే సూచనలు. భవిష్యత్తు కొంత గందరగోళంగా కనిపిస్తుంది. వివాదాలు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలు స్వల్ప లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు విధుల్లో కొత్త చిక్కులు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులు కొన్ని అవకాశాలపై నిరాశ చెందుతారు. మహిళలు తొందరపాటు నిర్ణయాలతో కొంత ఇబ్బంది పడతారు. అనుకూల రంగులు…. ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు…పసుపు. ఆంజనేయస్తుతి మంచిది.

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి. ఆర్థిక లావాదేవీలు ఊహించిన విధంగానే ఉంటాయి. మీలో పట్టుదల పెరుగుతుంది. వాక్చాతుర్యంతో ప్రముఖులను సైతం ఆకట్టుకుంటారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు తగినంతగా పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు బాధ్యతలు కొంత తగ్గే సూచనలు. క్రీడాకారులు, శాస్త్రవేత్తల ప్రయత్నాలు నిదానిస్తాయి. విద్యార్థుల కృషి ఫలించే సమయం. మహిళలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అనుకూల రంగులు…. నలుపు, బంగారు. ప్రతికూల రంగు…తెలుపు. దుర్గా స్తోత్రాలు పఠించండి.

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కుటుంబ సభ్యులతో తగాదాలు. ఎంతగా కృషి చేసినా పనులు ముందుకుసాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వాహనాల విషయంలో తొందరపాటు వద్దు. ఆదాయం కొంత తగ్గే సూచనలు. ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు విస్తరణ ఏర్పాట్లలో వేగం తగ్గుతుంది. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు నిరాశలోనే గడుపుతారు. విద్యార్థులకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు. అనుకూల రంగులు…. గులాబీ, లేతనీలం. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఇంటిలో శుభకార్యాలపై చర్చిస్తారు. కాంట్రాక్టులు ఊహించని విధంగా దక్కుతాయి. భార్యాభర్తలు పరస్పర అవగాహనతో కొన్ని సమస్యలు అధిగమిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆదాయం మరింత అనుకూలిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలపై మరింత దృష్టి పెడతారు. ఉద్యోగాల్లో అన్ని విధాలా అనుకూలత ఉంటుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలు తమ సత్తాను నిరూపించుకునేందుకు తగిన సమయం. విద్యార్థులు అవకాశాలపై సంతృప్తి చెందుతారు. మహిళలకు ఉత్సాహపూరితంగా ఉంటుంది. అనుకూల రంగులు…. నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…గులాబీ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఆకస్మిక ప్రయాణాలు. అంచనాలు తప్పి నిరుత్సాహం చెందుతారు. కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగులకు విధుల్లో చికాకులు పెరుగుతాయి. క్రీడాకారులు, వైద్యులకు కొంత మందకొడిగా నడుస్తుంది. విద్యార్థులు అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు ఆరోగ్యభంగం. అనుకూల రంగులు…. ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవప్రతిష్టలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో∙ఊపిరిపీల్చుకుంటారు. సన్నిహితులతో వివాదాలు తీరి ఊరటచెందుతారు. భూములు, గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు మరింత లాభాలు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రీడాకారులు, వైద్యులకు కలసివచ్చేకాలమనే చెప్పాలి. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడతారు. అనుకూల రంగులు…. తెలుపు,కాఫీ ప్రతికూల రంగు…నేరేడు. వేంకటేశ్వరస్తుతి మంచిది.

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
నూతన విద్యావకాశాలు దక్కుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితులు సైతం అన్నింటాసహాయపడతారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. అనుకున్న కార్యక్రమాలు జాప్యం లేకుండా పూర్తి కాగలవు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలు వేగవంతంగా చేస్తారు. ఉద్యగులకు శ్రమ ఫలిస్తుంది. వైద్యులు, చిత్రపరిశ్రమ వారు ఒత్తిడుల నుండి గట్టెక్కుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మహిళలు శుభవార్తలు వింటారు. అనుకూల రంగులు…. గులాబీ, కాఫీ. ప్రతికూల రంగు…పసుపు. శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. బంధువర్గంతో అకారణంగా విరోధాలు. రాబడి కొంత తగ్గవచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సామాన్యంగా గడుస్తుంది. ఉద్యోగులు మరిన్ని విధులు చేపట్టాల్సి వస్తుంది. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఏ పని పైనా శ్రద్ధ వహించలేరు. విద్యార్థులు శ్రమకు కొంతవరకూ ఫలితం దక్కించుకుంటారు. మహిళలకు కుటుంబ సమస్యలు తప్పవు. అనుకూల రంగులు…….. గులాబీ, గోధుమ. ప్రతికూల రంగు…తెలుపు. హనుమాన్ఛాలీసా పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com