Today rashi phahalu – 14 జనవరి 2023, శనివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఆర్థిక ఇబ్బందులు. రుణ బాధలు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతితో గడుపుతారు. ఆలోచనలు ఏ మాత్రం కలసిరావు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సాదాసీదాగా ఉంటుంది. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు నిరుత్సాహమే. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……గోధుమ, పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గృహ, వాహన యోగాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు శుభకార్యాలలో పాల్గొంటారు. అనుకూల రంగులు….. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు…నీలం. శివారాధన మంచిది.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. ఆలోచనలు కలసిరావు. సన్నిహితుల నుంచి విమర్శలు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొద్దిపాటి లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు గందరగోళం. మహిళలకు ఆరోగ్య భంగం. అనుకూల రంగులు…. కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు…ఎరుపు. ఆంజనేయస్వామిని పూజించాలి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


కొత్త్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో ఎనలేని గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. చిన్ననాటి మిత్రులతో చర్చలు జరుపుతారు. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులు సమస్యలు అధిగమిస్తారు. కళాకారులు, క్రీడాకారులకు ఊహించని సత్కారాలు. విద్యార్థులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకూల రంగులు….. ఆకుపచ్చ, బంగారు. ప్రతికూల రంగు…తెలుపు. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. స్థిరాస్తి వివాదాలు ఎదుర్కొంటారు. తీర్థ యాత్రలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు వివాదాలు తప్పకపోవచ్చు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఒత్తిడులు. మహిళలకు నిరుత్సాహం తప్పదు. అనుకూల రంగులు.. గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు…కాఫీ. గణపతిని ఆరాధించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. కాంట్రాక్టర్లకు అనుకూల పరిస్థితి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సంతోషకర సమాచారం. ఉద్యోగులకు ఉన్నతమైన ఒక పోస్టు రావచ్చు. రాజకీయవేత్తలు,చిత్రపరిశ్రమ వారు అన్ని విధాలా లాభపడతారు. విద్యార్థులు అవకాశాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి. అనుకూల రంగులు….. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. హనుమాన్ ఛాలీసా పఠించండి

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటుంది. వ్యతిరేకులు కూడా స్నేహితులుగా మారతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో తగినంత పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు హుషారుగా గడుస్తుంది. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు కొన్ని అంచనాలను నిజం చేసుకుంటారు. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి. అనుకూల రంగులు.. గోధుమ, తెలుపు. ప్రతికూల రంగు…గులాబీ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఇంటాబయటా సమస్యలు, వివాదాలు తప్పవు. బాధ్యతలతో సతమతమవుతారు. ఆలోచనలు కొలిక్కి రాక ఇబ్బందిపడతారు. భూవివాదాలు నెలకొంటాయి. కొన్ని కార్యక్రమాలను చివరికి వాయిదా వేయకతప్పదు. రాబడి విషయంలో కొంత గందరగోళం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులకు మరింత పనిభారం. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు రద్దు. విద్యార్థుల యత్నాలలో అవాంతరాలు. మహిళలకు అనారోగ్యం. అనుకూల రంగులు….. గులాబీ, ఆకుపచ్చ ప్రతికూల రంగు…పసుపు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


కుటుంబంలో మరిన్ని చికాకులు. దూరప్రయాణాలు చేస్తారు. బంధువులు, స్నేహితులతో విభేదాలు. ఆరోగ్య విషయంలో చికాకులు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొన్ని ఇబ్బందులు. ఉద్యోగులకు విధులు కొంత సవాలుగా మారవచ్చు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఒత్తిడులు. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. మహిళలకు నిరాశ తప్పదు. అనుకూల రంగులు….. ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు…ఎరుపు. దత్తాత్రేయుని పూజించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


కొత్త ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. పరిస్థితులను మీకు అనుకూలంగా మలచుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తల లావాదేవీలు వివాదాలు తీరతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులు ఊహించని అవకాశాలు సాధిస్తారు. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు.. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు…తెలుపు. ఆంజనేయస్వామిని పూజించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వ్యతిరేకవర్గీయులు సైతం మీకు స్నేహితులుగా మారవచ్చు. వాహన యోగం. కీలక నిర్ణయాలకు తగిన సమయం. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఉత్సాహవంతంగా గడుపుతారు. ఉద్యోగులు శక్తిసామర్థ్యాలు నిరూపించుకుంటారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు విశేషంగా కలిసివస్తుంది. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. మహిళలకు సన్మానాలు. అనుకూల రంగులు.. ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు…నీలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


కార్యక్రమాలు కొన్ని నిరాశ కలిగిస్తాయి. ఆస్తుల వ్యవహారంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. స్నేహితుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు అనుమానమే.. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు ఏ వ్యవహారమైనా కలసిరాదు. విద్యార్థులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. అనుకూల రంగులు…. గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: