Today rashi phahalu – 15 జనవరి 2023, ఆదివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో పదోన్నతి సూచనలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అనుకోని అవకాశాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకూల రంగులు…….పసుపు, గులాబీ, ప్రతికూల రంగు… కాఫీ. గణపతిని పూజించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ముఖ్యమైన పనులు సకాలంలో చక్కబెడతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. నూతన పరిచయాలు.. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సత్తా చాటుకుంటారు. ఉద్యోగాల్లో కొత్త హోదాలు దక్కించుకుంటారు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి ఆశలు నెరవేరతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు……. గులాబీ, లేత పసుపు, ప్రతికూల రంగు…ఆకుపచ్చ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
అనుకోని ప్రయాణాలు. కొత్త రుణ యత్నాలు ముమ్మరం చేస్తారు. సోదరులు,మిత్రులతో అకారణంగా తగాదాలు. నిరుద్యోగులకు నిరాశ. శారీరక రుగ్మతలు. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొంత నిరాశచెందుతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మహిళలకు కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. అనుకూల రంగులు……. నలుపు, గులాబీ. ప్రతికూల రంగు…తెలుపు. ఆదిత్య హృదయం పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు ఎదురవుతాయి. కుటుంబంలో చికాకులు తప్పవు. ఆరోగ్య సమస్యలు. కార్యక్రమాలలో ప్రతిబ«ంధకాలు. బంధువుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. దూరప్రయాణాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు గందరగోళంలో పడతారు. ఉద్యోగులు అనుకున్న మార్పులు చేజారవచ్చు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు శ్రమాధిక్యం. విద్యార్థులకు కొత్త అవకాశాలు చేజారతాయి. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు……. గోధుమ, పసుపు. ప్రతికూల రంగు…నేరేడు. నరసింహ స్తోత్రాలు పఠించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఆర్థిక వ్యవహారాలు సంతప్తికరంగా ఉంటాయి. శ్రేయోభిలాషులు సహకరిస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల విస్తరణపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. చిత్ర పరిశ్రమవారు, క్రీడాకారులకు ఉత్సాహం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు…నీలం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.. కాంట్రాక్టులు చేజారతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఇబ్బందుల్లో పడతారు. ఉద్యోగులకు మార్పులు సంభవం. రాజకీయ, పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు విరమిస్తారు. విద్యార్థులకు అవకాశాలు దూరమవుతాయి. మహిళలకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అనుకూల రంగులు……. గోధుమ, తెలుపు. ప్రతికూలరంగు.. కాఫీ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి..
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు స్థలాలు కొంటారు. నిరుద్యోగుల∙శ్రమ కొలిక్కి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ప్రభుత్వం ద్వారా ఆహ్వానాలు. విద్యార్థులకు అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలకు కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనుకూల రంగులు……. పసుపు, కాఫీ. ప్రతికూల రంగు…నీలం. హనుమాన్ ఛాలీసా పఠించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
దూర ప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. నిరుద్యోగుల యత్నాలు సఫలం. శారీరక రుగ్మతలుు బాధిస్తాయి.. తీర్థ యాత్రలు చేస్తారు. కాంట్రాక్టులు తుది క్షణంలో చేజారతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నిదానం అవసరం. ఉద్యోగులకు మరింత పనిభారం. రచయితలు, చిత్రపరిశ్రమ వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. అనుకూల రంగులు……. గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు…పసుపు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు మరింతగా సహకరిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు కొన్ని అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత. అనుకూల రంగులు…. పసుపు, కాఫీ. ప్రతికూల రంగు…గులాబీ వేంకటేశ్వరస్వామిని పూజించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు సంతోషకర సమాచారం. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు శుభవార్తలు. అనుకూల రంగులు……. గోధుమ, కాఫీ. ప్రతికల రంగు…నేరేడు. గణేశాష్టకం పఠించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ముఖ్యమైన కార్యక్రమాలు హఠాత్తుగా వాయిదా వేస్తారు. స్నేహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబంలో ఒత్తిడులు, విమర్శలు ఎదురవుతాయి. ఇంటాబయటా నిరుత్సాహం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొంతమేర లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు పనిభారం తప్పదు. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు……. నీలం, తెలుపు. ప్రతికూల రంగు…నేరేడు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
రావలసిన సొమ్ము అందక ఇబ్బందిపడతారు. కొత్తగా రుణాలు సైతం చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆస్తి వివాదాలు మరింతగా పెరుగుతాయి. శారీరక రుగ్మతలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కాంట్రాక్టులు చివరిలో చేజారతాయి. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనల్లో అవరోధాలు. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు……. తెలుపు, కాఫీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com