Today rashi phalalu – 16 ఫిబ్రవరి 2023, గురువారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. మిత్రుల నుంచి విమర్శలు. సోదరులను కలుసుకుని కుటుంబ విషయాలు చర్చిస్తారు. ఆరోగ్యం పై కొద్దిపాటి చికాకులు. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొంత తొందరపాటు చెందుతారు. ఉద్యోగులకు మరింత పనిభారం. చిత్ర పరిశ్రమ వారు, పారిశ్రామికవర్గాలు ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు నిరాశ. అనుకూల రంగులు……ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు..తెలుపు. కాలభైరవాష్టకం పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఆకస్మిక ప్రయాణాలు. వృథా ఖర్చులు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. రాబడి కొంత నిరాశ కలిగిస్తుంది. కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు. వ్యాపార, వాణిజ్యవేత్తలు నిల్వలను తగ్గించుకుంటే మంచిది. ఉద్యోగాలలో ఒత్తిడులు మరింత రావచ్చు. పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులకు సాధారణ స్థితి. విద్యార్థులకు అవకాశాలు అంతగా కలసిరావు. మహిళలకు మానసిక ఆందోళన పెరుగుతుంది. అనుకూల రంగులు….. ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూల రంగు…గులాబీ. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


కుటుంబంలో శుభకార్యాల పై చర్చలు. ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసుల నుంచి విముక్తి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి సహయం పొందుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలు ఆశించినంతగా దక్కించుకుంటారు. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు ఒత్తిడులు తొలగుతాయి. విద్యార్థులకు అరుదైన అవకాశాలు దక్కవచ్చు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. అనుకూల రంగులు…….గులాబీ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…పసుపు. దత్తాత్రేయుని పూజించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థికంగా బలం చేకూరుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు లాభాలు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూల మార్పులు ఉండే అవకాశం. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాల కోసం చేసే యత్నాలు సఫలం. పారిశ్రామిక, రాజకీయవేత్తలు నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకూల రంగులు….. ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు…నేరేడు. కనకధారా స్తోత్రం పఠించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లాభాలపై కొంత కలత చెందుతారు. ఉద్యోగులకు పని ఒత్తిడులు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు నిరుత్సాహం. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు కష్టమే. మహిళలకు కుటుంబ సమస్యలు. అనుకూల రంగులు….. పసుపు, కాఫీ. ప్రతికూల రంగు…ఎరుపు. రావిచెట్టు చుట్టూ ప్రదక్షణలు చేయండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. శ్రమకు తగిన ఫలితం రాక ఇబ్బందిపడతారు. పనుల్లో అవాంతరాలు. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా చికాకులు. దూరప్రయాణాలు ఉంటాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మరింత పనిభారం. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు కొన్ని చిక్కులు. విద్యార్థులు మరింత శ్రద్ధ చూపాలి. మహిళలకు కుటుంబసభ్యులతో వైరం. అనుకూల రంగులు….. గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు…తెలుపు. దుర్గా స్తోత్రాలు పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. గతం నుండి నెలకొన్న సమస్యలను అధిగమిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాల పై ఆసక్తి. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలు ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు. విద్యార్థులు అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. మహిళలకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. అనుకూల రంగులు….. గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు…పసుపు. ఆదిత్య హృదయం పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

కొత్తగా రుణాలు చేస్తారు. కుటుంబసమస్యలు. ఆరోగ్యపరంగా చికాకులు, ఔషధ సేవనం. బంధువులతో అకారణంగా విరోధాలు. ఇంత కాలం పడిన శ్రమ ఫలించదు. ఆలయాలు సందర్శిస్తారు. ఒక ప్రకటన మీకు కొంత ఉపయుక్తంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో ఎదుటవారి బాధ్యతలు కూడా మోస్తారు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటారు. విద్యార్థులు కొంత ఆందోళన చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత. అనుకూల రంగులు….. గులాబీ, నీలం. ప్రతికూల రంగు. ఆకుపచ్చ. గణేశాష్టకం పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలో చికాకులు తొలగుతాయి. వ్యతిరేకులు సాయం అందించేందుకు ముందుకు వస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ యత్నాలు సఫలం. అదనపు రాబడి ఉంటుంది. ఉద్యోగాల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు శుభవార్తలు అందుతాయి. వైద్యులు, చిత్రపరిశ్రమ వారు మరింత ఆశాజనకంగా అవకాశాలు సాధిస్తారు. విద్యార్థులకు కొన్ని ఇంటర్వ్యూలు అందుతాయి. మహిళలు ఉత్సాహంగా గడుపుతారు. అనుకూల రంగులు….. గులాబీ, తెలుపు. ప్రతికూల రంగు…కాఫీ. సుందరకాండ పారాయణ మంచిది.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. భూ వివాదాలు చికాకు పరుస్తాయి. రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాల్లో ఆటుపోట్లు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అంతగా ఉండవు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు నిరాశ చెందుతారు. విద్యార్థులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు. అనుకూల రంగులు….. కాఫీ, గోధుమ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. హనుమాన్ ఛాలీసా పఠించడం మంచిది.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఇంటిలో శుభకార్యాలు. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటారు. మిత్రుల నుంచి ధనలాభం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆకస్మిక ధనలబ్ధితో అవసరాలు తీరతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు అభివృద్ధి పథంలో సాగుతారు. ఉద్యోగులకు చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు అనుకోని అవకాశాలు దక్కుతాయి. మహిళలు మరింత ఆనందంగా గడుపుతారు. అనుకూల రంగులు….. తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు.. ఎరుపు. శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


కొన్ని కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఓర్పుగా ముఖ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అధిక మొత్తంలో లాభాలు. ఉద్యోగులు సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ముఖ్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు కొత్త అవకాశాలతో ముందుకు సాగుతారు. మహిళలకు ఆస్తిలాభాలు. అనుకూల రంగులు….. గోధుమ, పసుపు. ప్రతికూల రంగు…నేరేడు. శివపంచాక్షరి పఠించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: