Today rashi phahalu – 16 జనవరి 2023, సోమవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు తెరపడుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు సకాలంలో సమకూరతాయి. ఉద్యోగస్తులకు చిక్కులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ప్రయత్నాలలో పురోగతి. విద్యార్థులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు శుభవార్తలు అందుతాయి. అనుకూల రంగులు…… కాఫీ, బంగారు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల నుంచి శుభవార్తలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మరింతగా లాభాలు రాగల సూచనలు. ఉద్యోగాల్లో కొంత ఊరట లభిస్తుంది. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు ఆహ్వానాలు. విద్యార్థులు సొంత నిర్ణయాలతో అవకాశాలు సాధిస్తారు. మహిళలకు స్వల్ప ధన లాభం. అనుకూల రంగులు….. పసుపు,కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. హనుమాన్ ఛాలీసా పఠించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
స్నేహితులతో మనస్పర్థలు ఏర్పడతాయి. కార్యక్రమాలు నత్తనడకన కొనసాగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆదాయం కొంత నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు తప్పవు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కాస్త ఉపశమనం. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు . రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు నిరాశ చెందుతారు. విద్యార్థులకు చిక్కులు, సమస్యలు ఎదురుకావచ్చు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు . అనుకూల రంగులు… గోధుమ, తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. కనకధారా స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువులు, స్నేహితులతో లేనిపోని మనస్పర్థలు. కార్యక్రమాలలో జాప్యం. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. వ్యతిరేకుల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు భాగస్వాములతో సమస్యలు. నిరుద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు చిక్కులలో పడతారు. విద్యార్థులు ఎంత కష్టించినా ఫలితం పొందలేరు. మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు. అనుకూల రంగులు…… గోధుమ, గులాబీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. అంగారక స్తోత్రాలు పఠించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
పట్టుదల, ఓర్పుతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధపడతారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. బంధువులతో విభేదాలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చవచ్చు. కాంట్రాక్టులు ఊహించని విధంగా దక్కించుకుంటారు. వ్యాపార, వాణిజ్యతవేత్తలకు నూతన పెట్టుబడులు, ఉద్యోగులకు పనిభారం కొంత తొలగుతుంది. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి నిరీక్షణ ఫలిస్తుంది. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు తొలగుతాయి. అనుకూల రంగులు…… నలుపు, లేత ఎరుపు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించాలి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
కార్యక్రమాలలో కొంత జాప్యం. ఆర్థిక ఇబ్బందులతో అవసరాలకు ఎదురవాటిని ఆశ్రయిస్తారు. ప్రయాణాలు సాగక వాయిదా వేస్తారు. కుటుంబసభ్యులతో అబిప్రాయబేధాలు. భూరిజిస్ట్రేషన్లు వాయిదా వేస్తారు. ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి.. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలపై నిరాశకు లోన వుతారు. ఉద్యోగులు విధుల్లో కొంత అయోమయంగా ఉంటుంది. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు వివాదాలు తీరతాయి. విద్యార్థుల ప్రయత్నాలు మందగిస్తాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు. అనుకూల రంగులు…… పసుపు,గులాబీ. ప్రతికూల రంగు…నేరేడు. దేవీ స్తోత్రాలు పఠించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
ఆదాయం పై సంతృప్తి చెందుతారు. అందరిలోనూ తగినంత గుర్తింపు రాగలదు. కొన్ని సమస్యల పై ఒక పరిష్కారం ఆలోచిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు ముందు అనుకున్న లాభాలు అందుకుంటారు. క్రీడాకారులు, వైద్యులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులు సంతోషంతో గడుపుతారు. మహిళలకు బంధువులతో సఖ్యత. అనుకూల రంగులు…… ఆకుపచ్చ, బంగారు. ప్రతికూల రంగు….నీలం. అంగారక స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
రుణ యత్నాలను మరింత ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలతో వాయిదా వేస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. బంధువులతో కారణంగా తగాదాలు. ఉద్యోగులకు శ్రమాధిక్యం.. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నిరాశ కలుగుతుంది. పారిశ్రామిక,రాజకీయవేత్తలకు కొత్త సమస్యలు. విద్యార్థులు అనుకున్న వాటిని దూరం చేసుకుంటారు. మహిళలకు కుటుంబంలో చిక్కులు. అనుకూల రంగులు…… తెలుపు, కాఫీ. ప్రతికూల రంగు…ఎరుపు. విష్ణు ధ్యానం చేయండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువుల ద్వారా ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. కష్టానికి తగ్గ ఫలితం అంతగా కనిపించదు. ఆరోగ్య సమస్యలు ఇబ్బందికరంగా ఉండవచ్చు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త సమస్యలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు సమస్యలపై ఆందోళన చెందుతారు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు మానసిక ఆందోళన.. అనుకూల రంగులు…… కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. శుభకార్యాల పై చర్చిస్తారు. భార్యాభర్తల మధ్య సయోధ్య ఏర్పడుతుంది. ఆదాయం ఆశించినరీతిలో ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఉత్సాహవంతంగా గడుపుతారు. ఉద్యోగాల్లో సమస్యలు కొన్ని తీరతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఊహించని అవార్డులు. విద్యార్థులు శ్రమ ఫలించి ఊరట చెందుతారు. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు…… నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…ఎరుపు. కాలభైరావాష్టకం పఠించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
కుటుంబ సభ్యులతో విభేదాలు నెలకొంటాయి. కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురవుతాయి.. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వివాదాలకు దూరంగా మెలగండి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వాహనాల విషయంలో మెలకువ పాటించండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు పనిభారం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులు ఆలస్యమవుతాయి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు సంప్రదింపులు విఫలం. విద్యార్థులకు కొన్ని నిర్ణయాలు ఫలించవు. మహిళలకు చికాకులు. అనుకూల రంగులు…… నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. ఆంజనేయ దండకం పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలలో అవాంతరాలు. బాధ్యతలు పెరిగి ఎటూ తేల్చుకోలేరు. దూర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలలో వేగం తగ్గుతుంది. స్నేహితులతో విభేదాలు ఏర్పడవచ్చు. వివాహ, ఉద్యోగ యత్నాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో చికాకులు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సమస్యలు పెరుగుతాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు మనోనిబ్బరం తగ్గుతుంది. విద్యార్థులు నిదానంగా పాటించాలి. మహిళలకు మానసికంగా ఆందోళన. అనుకూల రంగులు……పసుపు, ఎరుపు, ప్రతికూల రంగు…నీలం. గణేశాష్టకం పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com