Today rashi phalalu – 17 ఫిబ్రవరి 2023, శుక్రవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


కొన్ని పనుల్లో ఆటంకాలు. ఖర్చులు మరింత పెరుగుతాయి. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగవర్గాలకు పైస్థాయి నుండి ఒత్తిడులు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు నిరుత్సాహం చెందుతారు. విద్యార్థులు కొన్ని ఒడిదుడుకుల మధ్య గడుపుతారు. మహిళలకు కుటుంబసమస్యలు. అనుకూల రంగులు….. గోధుమ, పసుపు. ప్రతికూల రంగు…నీలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. కుటుంబసభ్యులతోవైరం. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు వ్యవహారాలలో అప్రమత్తతతో మెలగాలి. విద్యార్థులు కొన్ని సమస్యలతో గడుపుతారు. మహిళలకు మానసిక అశాంతి. చికాకులు. అనుకూల రంగులు….. కాఫీ, పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. ఆంజనేయ దండకం పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. గౌరవమర్యాదలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు ప్రతి విషయంలోనూ అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు విశేషంగా కలసివస్తుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ యానం. విద్యార్థులు శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. మహిళలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకూల రంగులు….. గులాబీ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…కాఫీ. నరసింహ స్తోత్రాలు పఠించండి.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. దూరపు బంధువుల సాయం అందుతుంది. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు రాగలవు. ఉద్యోగులకు కీలక మార్పులు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు నూతనోత్సాహం. విద్యార్థులకు ఇంటర్వ్యూలు అందే సూచనలు. మహిళలకు కుటుంబసభ్యుల నుంచి ఆశించిన ప్రోత్సాహం. అనుకూల రంగులు….. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు…పసుపు. గణపతిని ఆరాధించండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మిత్రులతో విభేదాలు. వ్యవహారాలలో ఆటంకాలు. వాహనాలు, ఆరోగ్య విషయాలలో నిర్లక్ష్యం వద్దు. వ్యాపార , వాణిజ్యవేత్తలకు సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులు అంతగా అందవు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు విదేశీ పర్యటనలు వాయిదా. మహిళలకు అనారోగ్యం. అనుకూల రంగులు….. పసుపు, ఎరుపు. ప్రతికూల రంగు…గులాబీ. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బాధ్యతలతో సతమతమవుతారు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఆస్తుల వ్యవహారాల్లో సోదరులతో విభేదాలు. బంధువులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చికాకులు ఎదురుకావచ్చు. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు అవకాశాల పై ఆందోళన చెందుతారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించలేక నిరాశచెందుతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు. అనుకూల రంగులు….. పసుపు, ఎరుపు. ప్రతికూల రంగు…నీలం. శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు అన్ని విధాలా లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు….. పసుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు..నీలం. కనకధారా స్తోత్రం పఠించండి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

వ్యవహారాలలో ఆటంకాలు. దూర ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సమస్యలు. ఉద్యోగాలలో ఒత్తిడులు ఉంటాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు మానసిక ఆందోళన. విద్యార్థులకు కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. మహిళలకు కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. అనుకూల రంగులు….. గోధుమ, పసుపు. ప్రతికూల రంగు…గులాబీ. గాయత్రీ ధ్యానం మంచిది.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిరకాల కోరిక నెరవేరుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనసౌఖ్యం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు తగిన విధంగా లాభాలు సమకూరతాయి. ఉద్యోగులకు కొత్త పోస్టులు రావచ్చు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి ఆశలు ఫలిస్తాయి. విద్యార్థుల శ్రమ కొలిక్కి వస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు. అనుకూల రంగులు….. కాఫీ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. గణపతికి అర్చన చేయించుకోండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


రుణ బాధలు తప్పవు. ఎంతకష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. లేనిపోని వివాదాలు నెలకొంటాయి. బంధువుల నుంచి ఒత్తిడులు. కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు మందగిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త సవాళ్లు. ఉద్యోగులు విధుల్లోబాధ్యతాయుతంగా మెలగాలి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు మనోవేదనకు గురవుతారు. విద్యార్థులు కొంత ఆందోళన చెందుతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు. అనుకూల రంగులు….. పసుపు,తెలుపు. ప్రతికూల రంగు…ఎరుపు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. మీ అంచనాలు నిజమవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. మీ కృషి ఫలించే సమయం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు హుషారుగా ఉంటుంది. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు నైరాశ్యం నుండి బయటపడతారు. విద్యార్థులు కొత్త అవకాశాలు అందుకుంటారు. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు…. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. హనుమాన్ ఛాలీసా పఠించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


కొత్త కార్యక్రమాలు చేపడతారు. బందువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సేవాకార్యక్రమాల పై ఆసక్తి చూపుతారు. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలకు ఆసక్తికరమైన సమాచారం. అనుకూల రంగులు….. గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు…నేరేడు. సూర్యారాధన మంచిది.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: