Today rashi phahalu – 17 జనవరి 2023, మంగళవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలు హఠాత్తుగా చేయాల్సిన పరిస్థితి. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. కాంట్రాక్టర్లకు ఆటుపోట్లు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నిరాశ తప్పకపోవచ్చు. ఉద్యోగాల్లో కొత్త సమస్యలు ఎదురుకావచ్చు. పారిశ్రామికవేత్తలు, వైద్యుల శ్రమ వృధా కాగలదు. విద్యార్థుల యత్నాలలో ఆటంకాలు. మహిళలకు కొంత ఆందోళన తప్పదు. అనుకూల రంగులు…… నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

కార్యక్రమాలను సమయానుసారం పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనాలు, స్థిరాస్తులు కొంటారు. అనుకున్న రాబడి దక్కుతుంది. పరిచయాలు పెరుగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు తమ సత్తా నిరూపించుకుంటారు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. సాంకేతిక నిపుణులు, చిత్రపరిశ్రమ వారి కృషి ఫలించే సమయం. విద్యార్థులు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు. అనుకూల రంగులు…… ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. శివ స్తోత్రాలు పఠించండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


రుణ బాధలతో ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల వికేంద్రీకరణపై దృష్టి పెడతారు. ఉద్యోగులు కొన్ని అవాంతరాలు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు మరింత అనుకూలత. విద్యార్థులు శ్రమ ఫలించి అవకాశాలు సాధిస్తారు. మహిళలకు శుభవార్తలు. అనుకూల రంగులు…… పసుపు, గులాబీ, ప్రతికూల రంగు…ఆకుపచ్చ. గణపతి స్తోత్రాలు పఠించండి

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


ఆకస్మిక ప్రయాణాలు. అనుకున్న రాబడి తగ్గుతుంది. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. భార్యాభర్తల మధ్య కలహాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సాధారణంగా గడుస్తుంది. ఉద్యోగులకు మరింత పనిఒత్తిడులు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమవారు ఇబ్బందులు పడతారు. విద్యార్థులకు నిరుత్సాహమే. మహిళలకు తొందరపాటు నిర్ణయాలు వద్దు. అనుకూల రంగులు…… తెలుపు, బంగారు. వేంకటేశ్వరస్వామికి అర్చనలు చేయండి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


ముఖ్య కార్యక్రమాలు ఆటంకాలతో జరుగుతాయి. రాబడి తగ్గి ఆందోళన చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. భార్యాభర్తల మధ్య మాటపట్టింపులు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపార, వాణిజ్యవేత్తలు పెట్టుబడుల్లో తొందరపడతారు. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఒత్తిడులతో గడుపుతారు. విద్యార్థులు మరింత ఆచితూచి వ్యవహరించాలి. మహిళలకు నిరుత్సాహమే. అనుకూల రంగులు…… గులాబీ, లేత ఆకుపచ్చ. ప్రతికూల రంగు…పసుపు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. రాబడి మీరు అనుకున్నంత సాధిస్తారు. ఇంటి నిర్మాణాలు చేపట్టగల అవకాశం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు శుభవార్తలు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ముఖ్య సమాచారం. విద్యార్థులు అవకాశాలు అప్రయత్నంగా సాధిస్తారు. మహిళలకు ఆస్తిలాభం. అనుకూల రంగులు…… గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు…తెలుపు. హనుమాన్ ఛాలీసా పఠించండి.

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


కొన్ని దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి. దూరప్రయాణాలతో ఉక్కిరిబిక్కిరి. రాబడి అంతగా కనిపించదు. భార్యాభర్తల మధ్య విభేదాలు. కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు సాధారణ లాభాలతో గడపాలి. ఉద్యోగాల్లో మరిన్ని చిక్కులు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు ఒత్తిడులు. విద్యార్థులు ఎంత నిదానంగా సాగితే అంత మంచిది. మహిళలకు కుటుంబసమస్యలు వేధిస్తాయి. అనుకూల రంగులు…… ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. అంగారక స్తోత్రం పఠించాలి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితిని అవసరాలకు తగినట్లుగా మలచుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. చిరకాల స్నేహితులు తారసపడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు కొత్త సంస్థలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులకు వివాదాలు సర్దుకుంటాయి. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. విద్యార్థులు ఊహించని గుర్తింపు పొందుతారు. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకూల రంగులు…… గులాబీ, బంగారు. ప్రతికూల రంగు…నీలం. ఆంజనేయ దండకం పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


ఆప్తులతో తగాదాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి. ఆస్తి వివాదాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యం కొంత తేడా కనిపిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు ఎంత కష్టపడ్డా లాభాలు అందుకులేరు. ఉద్యోగాల్లో పని ఒత్తిడులు తప్పవు. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు గందరగోళ పరిస్థితి. విద్యార్థుల శ్రమ కొల్కిక్కిరాదు. మహిళలకు లేనిపోని సమస్యలు ఎదురుకావచ్చు. అనుకూల రంగులు…… నీలం, పసుపు. ప్రతికూల రంగు…తెలుపు. సత్యనారాయణస్వామిని పూజించాలి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


ముఖ్యమైన కార్యక్రమాలు కష్టపడ్డా పూర్తి చేస్తారు. ఆప్తులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. చిరకాల మిత్రులు కలుసుకుంటారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. భూములు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల అభివృద్ధిలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాల్లో మీసేవలకు గుర్తింపు లభిస్తుంది. సాంకేతిక నిపుణులు, చిత్రపరిశ్రమ వారికి అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు మరింత ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు చికాకులు తొలగుతాయి. అనుకూల రంగులు…… గులాబీ. కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. గణపతి స్తోత్రాలు పఠించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


ఆర్థిక పరిస్థితి చక్కబడి అవసరాలకు లోటు లేకుండా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. భూవివాదాల నుంచి బయటపడతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు విస్తరణ కార్యక్రమాలు వేగవంతంగా కాగలవు. ఉద్యోగాల్లో హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు కార్యసిద్ధి. మహిళలకు శుభవార్తలు. అనుకూల రంగులు…… తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు…పసుపు. సూర్య భగవానున్ని పూజించండి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


అనుకోని ప్రయాణాలు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య విభేదాలు. వాహనాలు విషయంలో జాగ్రత్తలు పాటించండి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగాల్లో బాధ్యతలు రెట్టింపు కాగలవు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు నిర్ణయాల్లో ఆచితూచి అడుగువేయాలి. విద్యార్థులకు సమస్యలు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు. అనుకూల రంగులు…… ఆకుపచ్చ, గులాబీ. ప్రతికూల రంగు…తెలుపు. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: