Today rashi phalalu – 18 ఫిబ్రవరి 2023, శనివారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

aries-mesha-rasi

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)


ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు. దూర ప్రయాణాలు. బంధువులు, సోదరులతో కలహాలు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు వాయిదా. శారరక రుగ్మతలు. ఒక సమాచారం కొంత గందరగోళం పెట్టవచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సమస్యలతో సహవాసం చేస్తారు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు విదేశీ పర్యటనలు కుదించుకుంటారు. విద్యార్థులు కొంత అసంతృప్తి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు…….గోధుమ, ఆకుపచ్చ. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

taurus-vrushabha-rasi

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. సోదరులు, మిత్రులతో కలహాలు. కొత్తగా రుణాల కోసం యత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మీ శ్రమ నిష్ఫలమవుతుంది. వాహనాలు విషయంలో అప్రమత్తత అవసరం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొన్ని ఇబ్బందులు. ఉద్యోగులకు ఊహించని మార్పులు సంభవం. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు చిక్కులు. విద్యార్థులు అందిన అవకాశాలపై ఆసక్తి చూపరు. మహిళలకు అనారోగ్య సూచనలు. అనుకూల రంగులు……. కాఫీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు…పసుపు. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

gemini-mithuna-rasi

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు. విద్యార్థులు శ్రమకు ఫలితం పొందుతారు. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు……. పసుపు, ఎరుపు. ప్రతికూల రంగు..తెలుపు. విష్ణు ధ్యానం మంచిది.

cancer-karkataka-rasi

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)


కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ఆశయాలు నెరవేరతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తీరతాయి. విద్యార్థులు విద్యావకాశాలు పొందుతారు. మహిళలు ఉత్సాహంగా గడుపుతారు. అనుకూల రంగులు……. పసుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…గులాబీ. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.

leo-simha-rasi

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


పరిస్థితులు అనుకూలించవు. ఇంటాబయటా సమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో అకారణంగా తగాదాలు. వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తత పాటించాలి. ఆర్థిక లావాదేవీల్లో ఆటుపోట్లు. రుణాలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త పెట్టుబడులలో ఆటంకాలు. ఉద్యోగులకు ఊహించని మార్పులు. క్రీడాకారులు, వైద్యులకు శ్రమాధిక్యం. విద్యార్థులకు విద్యావకాశాలు చేజారతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు……. నలుపు, కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. ఆదిత్య హృదయం పఠించండి.

virgo-kanya-rasi

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)


వ్యయప్రయాసలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించవచ్చు. భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. మిత్రుల నుంచి సహాయం అంతగా ఉండదు. కాంట్రాక్టులు చేజారతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలు తమ వ్యవహారాలలో వేగం తగ్గిస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడులు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు చిక్కులు ఎదుర్కొంటారు. విద్యార్థులు కొంత శ్రద్ధ వహించాలి. మహిళలకు ఆరోగ్యసమస్యలు. అనుకూల రంగులు……. ఎరుపు, తెలుపు. ప్రతికూల రంగు..నేరేడు. హనుమాన్ ఛాలీసా పఠించండి

libra-tula-rasi

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)


వ్యతిరేకులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. తీర్థ యాత్రలు చేస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నూతనోత్సాహం. ఉద్యోగులకు పనిభారం నుండి విముక్తి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు విదేశీ పర్యటనలు. విద్యార్థులు గందరగోళం తొలగుతుంది. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు… గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. సత్యనారాయణ స్వామిని పూజించాలి.

scorpio-vruschika-rasi

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు కష్టమే. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలపై ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కొన్ని చికాకులు ఎదుర్కొంటారు. విద్యార్థులు కొంత గందరగోళం. మహిళలకు మానసిక అశాంతి. అనుకూల రంగులు……. పసుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

saggitarius-dhanu-rasi

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)


చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. మిత్రులు పూర్తిగా సహకరిస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు విశేష అనుకూల సమయం. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు నూతనోత్సాహంతో అడుగు వేస్తారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకూల రంగులు……. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు…పసుపు. రాఘవేంద్రస్వామిని పూజించండి.

capricorn-makara-rasi

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)


దూర ప్రయాణాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటిలో సమస్యలతో కుస్తీపడతారు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రయత్నాలు అనుకూలించవు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మరింత నిరాశ. ఉద్యోగులకు ఊహించని మార్పులు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కొంత నిదానం పాటించాలి. విద్యార్థులు శ్రమ పడ్డా ఆశించిన ఫలితం అందుకోలేరు. మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. అనుకూల రంగులు… ఎరుపు, నీలం. ప్రతికూల రంగు… తెలుపు. శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.

aquarius-kumbha-rasi

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపందాలుస్తాయి. వాహన యోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపార, వాణిజ్యవేత్తలు లావాదేవీలపై ఉత్సాహంతో ఉంటారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు అంచనాలు నిజం కాగలవు. విద్యార్థులు ఊహలు నిజం చేసుకుంటారు. మహిళలకు ఉత్సాహపూరితంగా ఉంటుంది. అనుకూల రంగులు……. గోధుమ, లేత పసుపు. ప్రతికూల రంగు..నేరేడు. దుర్గాదేవిని పూజించాలి.

pisces-meena-rasi

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్టలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలపై ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగులకు విశేషంగా కలసివచ్చే కాలం. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు కష్టాలు అధిగమిస్తారు. విద్యార్థులు అవకాశాలను దక్కించుకుంటారు. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు……. గులాబీ, నలుపు. ప్రతికూల రంగు..ఆకుపచ్చ. ఆంజనేయ దండకం పఠించండి.

ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com

Categorized in: