Today rashi phahalu – 19 జనవరి 2023, గురువారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు తీరతాయి. ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితులతో విభేదాలతో మనశ్శాంతి లోపిస్తుంది. ఇంటాబయటా లేనిపోని సమస్యలు ఎదురుకావచ్చు. ఆరోగ్యసమస్యతో చికాకులు. కాంట్రాక్టర్లు నిరాశకు లోనవుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు పెట్టుబడుల్లో చిక్కులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటారు. మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు. అనుకూల రంగులు………… తెలుపు, బంగారు. ప్రతికూల రంగు…నేరేడు. శివ స్తోత్రాలు పఠించాలి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. పుట్టినరోజు వేడుకలకు హాజరవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిరకాల స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విశేషమైన కాలమని చెప్పాలి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. మహిళలకు కొద్దిపాటి ఆస్తిలాభం. అనుకూల రంగులు………… గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు….ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు.. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో చిక్కులు వీడతాయి. కొన్ని సమస్యలు ఊహించని రీతిలో పరిష్కారమవుతాయి. నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు వివాదాలు తీరతాయి. ఉద్యోగ విధులు చక్కదిద్దడంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలకు దగ్గరవుతారు. మహిళలకు ఆస్తిలాభం. అనుకూల రంగులు…….. లేత ఎరుపు,కాఫీ ప్రతికూల రంగు…ఆకుపచ్చ. హనుమాన్ ఛాలీసా పఠించడం మంచిది.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి అంతగా కలసిరాదు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. స్నేహితులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. నిర్ణయాలలో తొందర వద్దు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల నిర్వహణలో శ్రద్ధ వహించాలి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు నిరుత్సాహమే మిగులుతుంది. విద్యార్థులు శ్రమ వృధాగా మారుతుంది. మహిళలకు మానసిక అశాంతి పెరుగుతుంది. అనుకూల రంగులు…….. గోధుమ, కాఫీ, ప్రతికూల రంగు….పసుపు. వేంకటేశ్వరస్వామిని పూజించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
పరిస్థితులు అనుకూలించక కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. సన్నిహితులతో విభేదాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం పై నిర్లక్ష్యం వీడాలి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త సమస్యలు. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు తొందరపాటు వీడాలి. విద్యార్థులు కొన్ని గందరగోళ పరిస్థితుల మధ్య గడుపుతారు. మహిళలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అనుకూల రంగులు…….. ఆకుపచ్చ, నీలం. ప్రతికూల రంగు….కాఫీ. దత్తాత్రేయుని పూజించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
నూతనోత్సాహంతో కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుని ముందుకు సాగుతారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. మీ జీవితం సాఫీగా సాగేందుకు మార్గం సుగమం చేసుకుంటారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు ఎటువంటి ఇబ్బందులైనా అధిగమిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు వాహన, గృహయోగాలు. అనుకూల రంగులు…. …….. గులాబీ, కాఫీ, ప్రతికూల రంగు…ఆకుపచ్చ. గణేశ్ పూజలు చేయండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. శ్రమాధిక్యమే కనిపిస్తుంది… ఫలితం శూన్యం. కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితి. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఉద్యోగులకు మార్పులు. వ్యాపార, వాణిజ్యవేత్తలు వికేంద్రీకరణ కార్యక్రమాలు వాయిదా వేస్తారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు కొత్త సమస్యలు. మహిళలకు కుటుంబసభ్యులతో మనస్పర్థలు. అనుకూల రంగులు…… తెలుపు,గోధుమ. ప్రతికూల రంగు….పసుపు. వేంకటేశ్వరస్వామిని పూజించాలి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
కొన్ని కార్యక్రమాలలో జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది. ఆధ్యాత్మికవేత్తల సూచనలు పాటిస్తారు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. శుభకార్యాలకు తగిన ఏర్పాట్లు చేస్తారు. రాబడిపై పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయి. పరిస్థితులు మీకు అనుకూల ప్రభావాన్ని చూపుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు హుషారుగా వ్యవహారాలు నడుస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. విద్యార్థుల కృషి , పట్టుదల నెరవేరతాయి. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు…….. కాఫీ, తెలుపు. ప్రతికూల రంగు….ఎరుపు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ప్రయాణాలలో కొన్ని అవాంతరాలు. ఆత్మీయులతో విభేదాలు. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. కుటుంబంలోసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్ల యత్నాలు విఫలం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు విస్తరణయత్నాలలో ప్రతిష్ఠంభన. ఉద్యోగులు అదనపు పనిభారాన్ని మోయాల్సివస్తుంది. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు వివాదాలతో సతమతమవుతారు. విద్యార్థులకు నిరాశ కలుగుతుంది. మహిళలకు గందరగోళంగా ఉంటుంది. అనుకూల రంగులు……. నీలం, ఆకుపచ్చ. ప్రతికూల రంగు….గులాబీ. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
నూతన ఉద్యోగం లభిస్తుంది. అందరిలోనూ మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. రావలసిన సొమ్ము అందుతుంది.. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఊహించనంత అభివృద్ధి సాధిస్తారు. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలకు శుభ వర్తమానాలు. అనుకూల రంగులు…….. నలుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు….తెలుపు. గణపతిని పూజించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఉద్యోగ యత్నాలు సానుకూలం. కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనుకున్న రాబడి దక్కుతుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మరిన్ని లాభాలు, పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు సంతోషకరంగా గడిచిపోతుంది. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం పొందుతారు. విద్యార్థులు సమస్యల నుండి గట్టెక్కుతారు. మహిళలకు సోదరులతో సత్సంబంధాలు. అనుకూల రంగులు…….. గోధుమ, కాఫీ. ప్రతికూల రంగు….ఆకుపచ్చ. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
కుటుంబ సభ్యులతో వివాదాలు. ఆదాయం తగ్గి నిరాశ కలిగిస్తుంది. కార్యక్రమాలలో అవాంతరాలు. ప్రయాణాలు చివరిలో వాయిదా. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇంటాబయటా చిక్కులు. ఆరోగ్యంపై దృష్టి సారించండి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొంత లాభం చేకూరుతుంది. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవేత్తలు,క్రీడాకారులకు శ్రమకు ఫలితం కనిపించక నిరాశ తప్పదు. విద్యార్థులు కొంత నిదానం పాటించడం ఉత్తమం. మహిళలకు నిరుత్సాహమే. అనుకూల రంగులు……. ఎరుపు, బంగారు. ప్రతికూల రంగు..నీలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com