Today rashi phalalu – 20 ఫిబ్రవరి 2023, సోమవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు లభిస్తాయి. సోదరులతో వివాదాల పరిష్కారం శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలను వసూలు చేసుకుని అవసరాలు తీర్చుకుంటారు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొన్ని ఇబ్బందులు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు చిరకాల కోరిక నెరవేరి ఊరట చెందుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు శుభవర్తమానాలు. అనుకూల రంగులు……. తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు…నీలం. విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
రాబడి పెరిగి రుణబాధలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వాహన సౌఖ్యం. వ్యాపార, వాణిజ్యవేత్తలకు సమస్యలు తీరతాయి. ఉద్యోగులు ఎంత బాధ్యతనైనా వేగవంతంగా పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు నూతన అవకాశాలు. విద్యార్థులకు ఉత్సాహం. మహిళలకు స్వల్ప ఆస్తిలాభం. అనుకూల రంగులు…… గులాబీ, కాఫీ. ప్రతికూల రంగు…నేరేడు. గణపతికి అభిషేకం చేయించుకోండి.

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
కొత్త రుణ యత్నాలు. మిత్రులే శత్రువులుగా మారతారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కొంత నిరాశ పరుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తల లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తప్పదు. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులకు మానసిక ఆందోళన. విద్యార్థులకు అసంతృప్తి. మహిళలకు కుటుంబ సమస్యలు. అనుకూల రంగులు………లేత పసుపు, కాఫీ. ప్రతికూల రంగు…గులాబీ. హనుమాన్ ఛాలీసా పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. భూవివాదాలు నెలకొంటాయి. మిత్రులతో విరోధాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు. ఉద్యోగులకు శ్రమతో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరిన్ని చిక్కులు. విద్యార్థులు నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు. అనుకూల రంగులు……. నీలం, తెలుపు. ప్రతికూల రంగు..గోధుమ. శివ స్తోత్రాలు పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ముఖ్యమైన కార్యక్రమాలు విజయపథంలో పూర్తి చేస్తారు. ఇంటాబయటా ప్రోత్సాహం. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. భూ వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు మరింత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మహిళలకు ధన, ఆస్తి లాభాలు. అనుకూల రంగులు……. పసుపు, గులాబీ. ప్రతికూల రంగు…నేరేడు. విష్ణు సహస్రనామాలు పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త కాంట్రాక్టులు సైతం దక్కించుకుంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగాల్లో మీ అంచనాల మేరకు మార్పులు జరుగుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు ఊహించని విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఆశాజనకంగా ఉంటుంది. మహిళలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూల రంగులు…….. లేత పచ్చ, కాఫీ. ప్రతికూల రంగు…నీలం. నరసింహ స్తోత్రాలు పఠిస్తారు.

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కుటుంబంలో చికాకులు. ఇంటి కొనుగోలు యత్నాలు వాయిదా. ముఖ్యమైన పనులలో ఆటంకాలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువుల ద్వారా సమస్యలు రావచ్చు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులకు వివాదాలు. చిత్రపరిశ్రమ వారు, వైద్యుల సేవలకు తగిన గుర్తింపు కష్టమే. విద్యార్థులు మరింత శ్రద్ద చూపాలి. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు……. పసుపు, లేత ఎరుపు. ప్రతికూల రంగు…తెలుపు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగించవచ్చు. కొన్ని పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసిరావు. వివాదాలకు దూరంగా ఉండండి. మిత్రులతో విరోధాలు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు పని ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు కొంత నిదానంగా వ్యవహరించడం మంచిది. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు సంతానపరమైన చికాకులు. అనుకూల రంగులు……. ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు…ఎరుపు. దుర్గాదేవికి అర్చనలు చేయండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటాబయటా గౌరవం పొందుతారు. గృహ నిర్మాణయత్నాలు సాగిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలు విజవయవంతంగా సాగుతాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతమైన బాధ్యతలు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు అన్నింటా విజయమే. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. మహిళలకు సంతోషకరమైన వార్తలు. అనుకూల రంగులు……. ఎరుపు, కాఫీ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. దత్తాత్రేయుని పూజించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
వ్యయప్రయాసలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు మరింత పెరుగుతాయి. దూరప్రయాణాలు ఉంటాయి. ఇంటాబయటా బాధ్యతలు అధికమవుతాయి. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలు మరిన్ని ఇబ్బందులు పడతారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు విదేశీ పర్యటనలు వాయిదా వేస్తారు. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు… గోధుమ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…పసుపు. కనకధారా స్తోత్రం పఠించండి.

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ముఖ్యమైన పనుల్లో విజయం. విలువైన వస్తువులు, స్థలాలు కొంటారు. ఆర్థిక లావాదేవీలు సంతప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.. ఉద్యోగులకు విధులు ఆశాజనకంగా సాగుతాయి. క్రీడాకారులు, వైద్యులకు ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులు అన్నింటా ముందడుగు వేస్తారు. మహిళలకు కుటుంబంలోగౌరం. అనుకూల రంగులు……. గులాబీ, ఎరుపు. ప్రతికూల రంగు…నేరేడు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆస్తి వివాదాలు నెలకొంటాయి. మిత్రులు, బ«ంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. పొరపాట్లు దొర్లి నిర్ణయాలు మార్చుకుంటారు. కాంట్రాక్టర్లకు నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవేత్తలకు చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు గందరగోళ పరిస్థితి. విద్యార్థులు శ్రమకు ఫలితం కనిపించదు. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగులు………. తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు…ఆకుప్చ. హనుమకు పూజలు చేయండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rasi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com