Today rashi phahalu – 20 జనవరి 2023, శుక్రవారం – ఈ రోజు ద్వాదశ రాశుల వారికి జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం రాశి ఫల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఉద్యోగ యత్నాలలో ముందడుగు వేస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొంటారు. కొన్ని వ్యవహారాలు చాకచక్యంగా చక్కదిద్దుతారు. వివాహ,ఉద్యోగ యత్నాలు కొలిక్కి రాగలవు. కొత్త కాంట్రాక్టులు చేపడతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు తమ లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త ఆశలు రేకెత్తుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి మరింత అనుకూలం. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు ఆస్తి లాభం. అనుకూల రంగులు……గులాబీ, బంగారు. ప్రతికూల రంగు.. తెలుపు. ఆంజనేయ దండకం పఠించండి.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అందరిలోనూ మీ ప్రజ్ఞాపాటవాలకు తగిన గుర్తింపు రాగలదు. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. శుభకార్యాలపై తుది నిర్ణయానికి వస్తారు. కాంట్రాక్టర్లకు ఒడిదుడుకులు తొలగుతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తల యత్నాలు ఆశించినరీతిలో సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. చిత్రపరిశ్రమ వారు, క్రీడాకారులు ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు. విద్యార్థుల శ్రమ, కృషి ఫలించే సమయం. మహిళలు ఆస్తి లాభాలు పొందుతారు. అనుకూల రంగులు…… పసుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…ఎరుపు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
రాబడి అంతగా కనిపించదు. మిత్రులతో అకారణంగా విరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. భూవివాదాలు నెలకొంటాయి. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు. ఉద్యోగులకు పనిఒత్తిడులు తప్పకపోవచ్చు. రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలకు శ్రమాధిక్యం, పరీక్షాకాలం. విద్యార్థులు అందిన అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు. మహిళలు ఆరోగ్య భంగం. అనుకూల రంగులు…… ఎరుపు, పసుపు. ప్రతికూల రంగు…నేరేడు. నృసింహ స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. ఇంటాబయటా సమస్యలతో ఇబ్బందిపడతారు. సన్నిహితులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు భాగస్వాముల నుండి సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు. వైద్యులు, పరిశోధకులకు నిరుత్సాహం. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలు కొంత నిరాశ చెందుతారు. అనుకూల రంగులు…… గులాబీ, లేత పసుపు. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. నరసింహస్వామిని పూజించండి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. కార్యక్రమాలు అనుకున్న రీతిలో సాగుతాయి. శ్రేయోభిలాషులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార, వాణిజ్యవేత్తలకు శుభదాయకమైన కాలం. ఉద్యోగులకు ఊహించని ప్రమోషన్లు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు మరింత దూసుకువెళతారు. మహిళలు శుభవర్తమానాలు అందుతాయి. అనుకూల రంగులు…… ఆకుపచ్చ,గోధుమ. ప్రతికూల రంగు… పసుపు. శివ స్తోత్రాలు పఠించండి.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. స్థలాలు, వాహనాలు కొంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థలను మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలు విధుల్లో ప్రశంసలు. చిత్ర పరిశ్రమ వారు, వైద్యుల శ్రమ ఫలించే సమయం. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మహిళలకు నూతనోత్సాహం. అనుకూల రంగులు…… పసుపు, ఎరుపు. ప్రతికూల రంగు…నేరేడు. దుర్గా స్తోత్రాలు పఠించండి.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
బంధుమిత్రులతో విరోధాలు. ఆరోగ్యం, వాహనాలు విషయంపై శ్రద్ధ వహించండి. ఆలోచనలపై ఎటూ తేల్చుకోలేరు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ప్రయాణాలు తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఆలోచించి ముందుకు సాగాల్సిన సమయం. ఉద్యోగులకు మార్పులు. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి కొన్ని ఇబ్బందులు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దూరం చేసుకుంటారు. మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. అనుకూల రంగులు…… ఎరుపు, గోధుమ. ప్రతికూల రంగు…ఆకుపచ్చ. రాఘవేంద్రస్వామిని పూజించండి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ప్రయాణాలు కొన్ని కారణాలతో రద్దు చేసుకుంటారు. ముఖ్య కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆలోచనలు అంతగా కలసిరావు. మానసిక ఆందోళనతో కొంత నిరుత్సాహం చెందుతారు. కుటుంబసభ్యులతో తగాదాలు. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు తొందరపాటులో పొరపాట్లు దొర్లవచ్చు. ఉద్యోగాల్లో లేనిపోని సమస్యలు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు కొన్ని పరీక్షలను ఎదుర్కొంటారు. విద్యార్థులు అవకాశాలపై అసంతృప్తి. మహిళలకు మానసిక ఆందోళన. అనుకూల రంగులు…… తెలుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…ఎరుపు. ఆదిత్య హృదయం పఠించండి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
బంధువులతో సఖ్యత నెలకొని వారితో సత్సంబంధాలు ఏర్పడవచ్చు. కొన్ని ప్రధాన సమస్యలు తీరి ఊరట చెందుతారు. కుటుంబ సభ్యులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తి వివాదాలను సోదరులతో ఒక అంగీకారానికి వచ్చి పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అదనపు రాబడి ఉంటుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగాల్లో పనిభారం తగ్గి ఊరట చెందుతారు. చిత్రపరిశ్రమ వారు, పరిశోధకులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులు ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలకు కుటుంబంలో గౌరవం. అనుకూల రంగులు…… లేత ఎరుపు, ఆకుపచ్చ. ప్రతికూల రంగు…నేరేడు. హనుమాన్ఛాలీసా పఠించండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
కార్యక్రమాలు ముందుకు సాగవు. రాబడి తగ్గి నిరాశ కలిగిస్తుంది. శ్రమ మరింతగా పెరుగుతుంది. కుటుంబ సమస్యలు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధువులతో సంబంధబాంధవ్యాలు దెబ్బతినవచ్చు. ఆరోగ్యపరమైన చికాకులు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సాదాసీదా లాభాలు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు. చిత్రపరిశ్రమ వారు, వైద్యులకు విపరీతమైన ఒత్తిడులు. విద్యార్థులకు నిరాశ తప్పదు. మహిళలు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. అనుకూల రంగులు…… గులాబీ, లేత ఎరుపు. ప్రతికూల రంగు…తెలుపు. రామరక్షా స్తోత్రం పఠించండి.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
కార్యక్రమాలు మరింత సాఫీగా సకాలంలో పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల ఫలితాలు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు తథ్యం. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల చేయూత లభిస్తుంది. అనుకూల రంగులు…… గోధుమ, పసుపు. ప్రతికూల రంగు…గులాబీ. శివ స్తోత్రాలు పఠించండి.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వాహనాలు విషయంలో మరింత జాగ్రత్త వహించండి. బంధువులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య కొన్ని అపోహలు, అపార్ధాలు నెలకొంటాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మరింత ఉత్సాహం. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి కృషి ఫలించదు. ఇబ్బందులతో గడుస్తుంది. విద్యార్థులు కొంత ఆందోళన చెందుతారు. మహిళలు ఆస్తి వివాదాలతో సతమతమవుతారు. అనుకూల రంగులు…… పసుపు, కాఫీ. ప్రతికూలం…ఆకుపచ్చ. గణపతిని పూజించండి.
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Today rashi phalalu content by Vakkantham Chandramouli’s Janmakundali.com